Sunday, December 13, 2009

మన తెలుగుకు రెండు వైపులా పదునే! అక్షరం మారితే ...అర్థం తారుమారు


తెనాలి రామలింగడి ఆమరణ దీక్ష.....థాంక్స్ టు ఘంటసాల

నిన్న రాత్రి తెనాలి రామలింగడు కలలోకొచ్చి  మా చెడ్డ గొడవ చేశేసాడు. "అసలేంటి నీ ఉద్దేశ్యం? "కాస్త ఇలా చాటుకొస్తారా' అని తెలుగు చాటు పద్యాల గురించి ౩ పార్టులు నీ బ్లాగ్ లో పెట్టావు బానే ఉంది. ఒక్క మాట, కనీసం ఒక్కమాటయినా నా గురించి చెప్పవా? పోనీ నేన్జెప్పిన ఏ ఒక్క పద్యమయినా అందులో ఉంచావా? అంటే అప్పటి మా విజయనగర సామ్రాజ్యం ఇప్పుడు కర్ణాటకలో ఉంది కాబట్టి నన్నొదిలేసి మీ స్టేట్ వాళ్లకి ప్రాముఖ్యం ఇచ్చావన్నమాట. పోనీ మా రాయలేలిన సీమేగా ... ఆ రాయలసీమ కోటాలో నాకూ ఓ మూల చోటిచ్చి ఉండచ్చుగా...ఇదే చెప్తున్నా..నువ్వు కనక నీ బ్లాగ్ లో నా గురించి ప్రత్యేక పోస్ట్ ఏర్పాటు చెయ్యకపోతే వెంటనే సెలైన్ పెట్టుకుని మరీ ఆమరణ నిరాహార దీక్ష చేపడతా ...ఇక వికటకవి చచ్చుడో ...వేరే పోస్ట్ ఇచ్చుడో తెలిపోవాలంతే' అని తన మార్కు సెటైర్ వదిలాడు. అసలే ఆమరణ దీక్షలంటే అదిరిపడే కాలం. అధిష్టానానికే తప్పలేదు ఆఫ్ట్రాల్ నేనెంత అనుకుని ఈ విషయంలో కాస్త హెల్ప్ చేసిపెట్టమని రీసెంట్ గా బర్త్ డే చేసుకున్న మన మహా గాయకుడు ఘంటసాల గారిని బ్రతిమాలుకోగా నా మీద జాలిపడి తెనాలి రామలింగడు సినిమాలో ఆయన పాడిన పద్యాలని ఇచ్చారు. బ్రతుకుజీవుడా అని అవి ఇక్కడ పోస్ట్ చేస్తున్నా.(సందర్భాలు కూడా ఉండటం వలన మరింత ఎంజాయ్ చేసే విధంగా ఉన్నాయి ఈ ఆడియో క్లిప్ప్..కింద ఇచ్చిన పద్యం లింక్ మీద క్లిక్ చేస్తే ఆడియో ప్లే అవుతుంది ). మీకు వీలయితే నేను ముందు చెప్పిన "కాస్త ఇలా చాటుకొస్తారా' పోస్ట్ మూడు పార్టులు నా బ్లాగ్ లో చదివి నేను ఏ ప్రాంతం వాళ్ళ పట్ల వివక్ష చూపలేదని తెనాలి రామలింగడికి చెప్పి కాస్త ఆ దీక్ష విరమింపజేద్దురూ! 


(రంజన చెడి పద్యం తర్వాత ఉన్న డైలాగ్ లలో ఉన్న పంచ్ నాకు భలే ఇష్టం)
ఇవన్నీ మీకు నచ్చితే నాకు చెప్పడం మాత్రం మర్చిపోకండి.....ఈ సినిమా చూడాలనిపిస్తే ఎలాగూ ఆదివారమే కదా చూసెయ్యండి ఓ పనయిపోతుంది.



మమ్మల్నిలా వదిలేస్తే ఉద్ధరించినంత పుణ్యం