Wednesday, December 23, 2009

బాబూ కె.సి.ఆర్...తప్పమ్మా అలా అనకూడదు...ఇంద ఈ గిఫ్టులు తీసుకో...

బాబూ కె.సి.ఆర్,

తప్పమ్మా అలా అనకూడదు. హైదరాబాద్ నాది అన్నవాడి నాలుక కోస్తా అన్నావు. ఒక్క కోస్తావాడి నాలుకే కాదు బాబు ఈ స్టేట్ లో ప్రతి ప్రాంతం వాడి నాలుకా హైదరాబాద్ నాది అనే అంటుంది. ఒక్క హైదరాబాద్ అనే ఏంటి? ఈ రాష్ట్రము, దేశము నాదే అనుకోడం తప్పుకాదు నాయనా. దేశం లో అన్ని ప్రాంతాలు అందరివీ అని మన రాజ్యాంగమే చెప్పింది...వద్దనడానికి నువ్వెవరు?  అయినా గౌరవనీయ పార్లమెంటు సభ్యుడివై ఉండి ఇలాంటి సంస్కారం లేని మాటలు మాట్లాడేందుకు నీకు సిగ్గుగాలేదా? మునుపోసారి బూతుమాటలకు అర్ధం వివరించి రాష్ట్రం లో పిల్లలని చెడగొట్టావు. ఇప్పుడు మళ్ళీ నాలుక కోస్తా, పీకలు కోస్తా అని వాళ్లకి కొత్త కొత్త మాటలు నేర్పకు (ఇలా ఎందుకు చెప్తున్నానంటే రేపు పొద్దున్న నీ మనవలు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటూ "ఈ బొమ్మ నాది అని ఎవరయినా అంటే వాళ్ళ నాలుక కోస్తా' అని మీ ముందే చెప్పారనుకోండి మీ పరిస్థితి ఏంటి?).  అయినా తెలంగాణా మీద నీకున్న ప్రేమ చూస్తే ముచ్చటేస్తోంది....నల్గొండ ఫ్లోరైడ్ బాధితుల కష్టాలు చూసి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అన్నావు, మరి శాసనసభ్యుడిగా, లోక్ సభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా వాళ్ళ కోసం ఏనాడైనా ఏమైనా చేశావా? ఇప్పుడు నీళ్ళు తిరుగుతున్నాయి అన్నావు....ఇప్పటిదాకా ఆ కళ్ళు మూసుకుపోయాయా బాబూ? పోనీ నల్గొండ వదిలేయి నిన్ను ఎన్నుకున్న నియోజక వర్గాల ప్రజలకైనా ఏదైనా చేశావా? ఎంత సేపూ వాళ్ళు ఏమీ చేయలేదు, వీళ్ళు ఏమీ చేయలేదు అంటావే తప్ప అసలు తెలంగాణా కు నువ్వేమీ చేయలేదన్న విషయం చెప్పవా?  ఏ నాడైనా పార్లమెంటులో ఏ సమస్య గురించయినా చర్చించావా? ఇక హైదరాబాద్ లో నువ్వు కట్టించిన ఏకైక  పెద్ద కట్టడం తెలంగాణా భవన్ (అది కూడా విరాళాలతో). పాపం ఆ మోహన్ బాబే నయం వరదల్లో నష్టపోయిన రాజోలి గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. నువ్వు అదీ చేయలేదుగా. ఈ మాత్రానికే ఇంతలా ఎగరాలా? నువ్వు మంచి చదువరి అని అందరికీ తెలుసు (మన బ్లాగ్మిత్రుడు "చదువరి" కాదని మనవి) . నీకు వచ్చిన భాష తో నీ కార్యకర్తల్ని ఉత్సాహపరచు తప్పులేదు. అంతేకాని వాళ్ళని రెచ్చగొట్టకు. ఇంక నువ్వు ఉపయోగించే భాషే తెలంగాణా భాష అని నువ్వు అనుకుంటే పాపం సి.నా.రే లాంటి వాళ్ళు నీ దగ్గర చాలా నేర్చుకోవాలన్న మాట . నరుకుతా, పొడుస్తా , చంపుతా అనడమే తెలంగాణా సంస్కృతి అని దేశంలో మిగిలిన ప్రాంతాల వాళ్లకి నువ్వు చెప్పదలచుకున్నట్టు ఉంది. కాస్త పద్దతి మార్చుకో. ఇది నువ్వు వలస వచ్చిన తెలంగాణా ప్రాంతం వాళ్ళ సంస్కృతీ కాదు, నీ పూర్వీకుల విజయనగరం జిల్లా సంస్కృతీ కాదు.


ఇంక హైదరాబాద్ గురించి నువ్వు ఎవర్నీ మాట్లాడవద్దన్నావు. సరదాగా ఈ పాటలు విను. నీకు ఇవి ఒక సమైక్యవాది పంపుతున్న బహుమతిగా భావించి స్వీకరించు. చివరిగా నాదొక సలహా "ఎందుకైనా మంచిది కాస్త బి.పి. చెక్ చేయించుకో."


రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్

చల్ చల్ రే హైదరాబాదీ


(పైన లింకుల మీద క్లిక్ చేసి పాటలు విను. ఇంకెప్పుడూ హైదరాబాద్ నీ ఒక్కడిదే అనకు నాయనా! )