Tuesday, January 26, 2010

ఎమ్మెస్ సుబ్బలక్ష్మి ఇంగ్లీష్ పాట......అద్భుతం, అపురూపం

రిపబ్లిక్ డే షష్టి పూర్తి సందర్భంగా నా బ్లాగ్ లో స్పెషల్ గా ఏం పెట్టాలా అని ఆలోచించినప్పుడు ఐక్య రాజ్య సమితిలో కచేరీ చేసిన సందర్భంలో ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారు పాడిన ఒక అరుదయిన, అపూర్వమయిన ఇంగ్లిష్ సాంగ్ గుర్తొచ్చింది. అన్నట్టు ఇందులో స్వతంత్ర భారతదేశం లో ఏకైక గవర్నర్ జనరల్ అయిన "రాజాజీ (చక్రవర్తుల రాజగోపాలచారి)" గొంతు మిమ్మల్ని ముందుగా పలకరిస్తుంది. (అయితే ఈ క్రింద పేరా చదివిన తరువాతే మీరు ఆ లింక్ దగ్గరకి వెళ్ళండి)


అసలైతే ఈ ఆడియో మీతో పంచుకోకూడదు అనుకునేంత కోపం వచ్చేసింది నాకు. ఎందుకంటే "ఆవిడ ఈ భూమ్మీద సంగీతం ప్రాక్టీసు చేసుకోడానికి వచ్చిన సరస్వతీ దేవి " అంటూ ఆవిడ నటించిన తొలి హిందీ సినిమా "మీరా" పాట వీడియోలతో  నేను డిశంబర్ ఇరవై నాల్గున పోస్ట్ పెడితే  కేవలం మూడంటే మూడే కామెంట్స్ వచ్చాయి (శిశిర గారు, సత్యసాయి కొవ్వలి గారు , సంతోష్ గారు) పోనీ అలా అని ఎవరూ చూడలేదు అనుకుందామా ఇప్పటికి దాదాపు యాభై మంది ఆ క్లిపింగ్స్ ని డౌన్లోడ్ చేసుకున్నారు. ఇక ఆవిడ పాడిన అన్నమయ్య పాటలతో నేను పెట్టిన పోస్ట్ లకి ఒక్కటంటే ఒక్కే కామెంట్ (మ్యాడీ గారు) కానీ ఒక నలభై మందిదాకా డౌన్లోడ్ చేసుకున్నారు. పోనీ కామెంట్ పెట్టడానికి బద్దకిస్తున్నారులే అని సరిపెట్టుకుందామంటే అదే ఏ కె.సి ఆర్ మీదో, తెలంగాణా మీదో పోస్ట్ పెడితే ఇహ చూస్కోండి తెగ కామెంట్స్..." మాయా బజార్ లో అహ నా పెళ్ళంట" పాట పారడి కి పాతికకు పైగా వచ్చిన కామెంట్స్ అదే "ఎమ్మెస్ సుబ్బలక్ష్మి" పాట అంటే ఎందుకు రావటం లేదు అనేది నాకు అర్ధం కావటం లేదు.
(ఇదేదో మిమ్మల్ని కామెంట్ చేస్తారా చస్తారా అని బెదిరించేందుకు కాదు :) ......నాకు కలుక్కుమంది ...చెప్పానంతే)


సరే ఆ గొడవ వదిలేసి ఈ పాట ఎంజాయ్ చెయ్యండి. ఇది అరవై ఆరు లో  ఐక్య రాజ్య సమితిలో ఎమ్మెస్ కచేరి లైవ్ రికార్డింగ్ ఆడియో....ఇది మీకు నచ్చితే ఆ మొత్తం కచేరి ఆడియో క్లిప్ లు పోస్ట్ చేస్తాను. లింక్ కింద ఇస్తున్నాను


19 comments:

విజయ క్రాంతి said...

చాల మంచి పాటని పరిచయం చేసారు . మీ సూటి ప్రశ్న కూడా ఆలోచించాల్సిన విషయమే.
ఇదే మొదటి సారి మీ బ్లాగ్లోక దర్శనం . ఇక నుండి నా నుంచి వ్యాఖ్య తప్పని సరి.
మీరు ఇంకా మంచి పాటలు పెట్టేసేయండి ...

మైత్రేయి said...

థాంక్స్ అండి. మీకు వ్యాఖ్యలు ముఖ్యమను కొంటె కేలకాలండి. ఇలా మంచి విషయాలు, అందరు ఒప్పుకొనేవీ చెప్తే మౌనం గా చూస్తాం, మనసులో థాంక్స్ చెప్పుకొంటాం, వ్రాయం :)

సత్యసాయి కొవ్వలి said...

మీకలుక్కు కు నాక్కూడా కలుక్కు. అయినా దింపుకున్న వాళ్ళు కామెంటు పెట్టకనే పెట్టినట్లు కాదా..:))

జయ said...

మీరు ఇంత స్పెషల్ గా చెప్పి వినమన్నాక, ఇంకా వినకుండా ఉంటామా? విన్నదే అయినా, మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట ఇది. ఆమె సాధించిన ప్రపంచ కీర్తికి ఇది ఒక ఉదాహరణ. మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

నేస్తం said...

thank you very much :)భలే పాట .నేనెప్పుడూ పాటలు డవున్ లోడ్ చేయలేదు గాని కొన్ని సార్లు మీ పోస్ట్లు చదివాను , మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది కరక్టే కదా :)

నాగరాజు రవీందర్ said...

అద్భుతం ! ఆశ్చర్యం ! సుబ్బులక్ష్మి పాడిన ఇంగ్లీషు పాటను మొదటి సారిగా వినడం.

నాగరాజు రవీందర్ said...

అద్భుతం ! ఆశ్చర్యం ! సుబ్బులక్ష్మి పాడిన ఇంగ్లీషు పాటను మొదటి సారిగా వినడం.

మధురవాణి said...

Thanks for sharing a rare audio clip :)
మీ పాటల పోస్టులు నేను చూళ్ళేదండీ ఇప్పటి దాకా..! మీరడిగిన ప్రశ్న కరక్టే సుమా :)

నాగప్రసాద్ said...

కామెంట్లు రావాలంటే, కెలకాలమ్మా..కెలకాలి ఊర్కనే రావు. :))) కేవలం కెలకడమే కాదు, వచ్చిన కామెంట్లకు ఓపిగ్గా సరైన కెలుకుడు రీతిలో సమాధానాలు కూడా ఇవ్వాలి. అప్పుడే కిక్కు ఉంటుంది.

లేదూ, మీకు కెలకడం రాదనుకుంటే, సింపుల్‌గా మార్తాండ బ్లాగులోకి వెళ్ళి అతను రాసిన కథల్లో మీకు నచ్చినదాన్ని ఎన్నుకొని, ఆ కథకు రివ్యూనో, పేరడీనో రాయండి. అప్పుడు తెలుస్తుంది, కామెంట్ల ప్రవాహాం అంటే ఎలా ఉంటుందో. :))))

Ramakrishna said...

nee alakaklo artham ubdhi raa baavaa. Intha manchi collections isthunnandhuku aa maathram expect ceyyochu.

Enaganti (ఇనగంటి) Ravi Chandra (రవిచంద్ర) said...

ఎమ్మెస్ సుబ్బులక్ష్మి నోట ఇంగ్లీష్ పాట ఊహించుకుంటూనే అద్భుతంగా ఉంది. మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.

ఏకాంతపు దిలీప్ said...

మీకు ధన్యవాదాలు. మిగిలిన క్లిప్పింగ్ల కోసం ఎదురు చూస్తున్నాము.

Sharada said...

ఐక్య రాజ్య సమితిలో జరిగిన ఆ కచేరీలోని విశేషం- ఆవిడకి లభించిన standing ovation. కచేరీ ముగిసింతరువాత శ్రోతలందరూ లేచి నిలబడి, ఆవిడ సభకి నమస్కరించి, వేదిక దిగి తన కారు దగ్గరికి వెళ్ళేంత వరకూ చప్పట్లు కొట్టారట.
అ కచేరీలోని అన్ని పాటలూ చాల గొప్పవే.
శారద

md.subhani said...

shankar, naku assalu sahityam meeda avagahana ledu, naku sangeetamante peddaga nachhadu anduke coment cheyyaledu.......

sowmya said...

భలే ఎప్పుడు MS ఇంగ్లీసు పాట వినలేదు. చాలా కొత్తగా బావుంది. విన్నాను, డౌన్లోడ్ చేసుకున్నాను. చాలా చాలా thanks !

ramyam ....ramaneyam said...

మంచి పాట .............మొదటి సారిగా విన్నాను. సేకరించి , భధ్ర పరచినందుకు ధన్య వాదములు.
డా. కె . వి . రమన మూర్తి

http://ramanafm.blogspot.com/
http://madhuramesudhaaganam.blogspot.com/

vinaybhasker said...

nijamE nanDi,meecollection choostunTE naaku eershya ga undi,thankyou for giving the link to download

గీత_యశస్వి said...

చాల మంచి పాటని పరిచయం చేసారు . మీ సూటి ప్రశ్న కూడా ఆలోచించాల్సిన విషయమే. Thanks చాల బాగా చెప్పారు

తృష్ణ said...

"గీత_యశస్వి"గారి బ్లాగ్ కు వెళ్ళి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చానండి. ఆ బ్లాగ్ కూడా ఇదే చూడటం. నేను మీ పాత postలన్నీ చాదవాల్సి ఉంది. చాలా గొప్పగా ఉంది ఆవిడ ఇంగ్లీష్ పాట వినటం...థాంక్యూ.
ఇక మీ అలకలాంటి అలకలు నాకు బోలెడు సార్లు వచ్చి వచ్చి ఇక అలిగే ఓపికలేక రాయాలని ఉన్నా మానుకున్న సంగతులు ఎన్నో...బ్లాగ్లోకపు చిత్తప్రవృత్తుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది..:)