అసలు ఈ పోస్ట్ నేను త్వరలో పెట్టబోయే హంపి టూరు విశేషాలలో పెడదామనుకున్నా. సర్లే ఎలాగూ శివరాత్రి కదా మీకు ఈ అద్భుతమైన నటరాజు విగ్రహం చూపిస్తే కుసింత వెరయిటీగా ఉంటుందేమో అనిపించి ఇప్పుడే ఇచ్చేస్తున్నా.
ఇక విషయానికొస్తే హంపి కి దగ్గరలో ఉన్న (మరీ అంత దగ్గరేం కాదు లెండి ఓ నాల్గు గంటలు ఉంటుంది జర్నీ) బాదామి గుహలలో చాళుక్యుల కాలం నాటి గుహాలయాలు ఉన్నాయి. నాల్గు అంతస్తులుగా ఉండే ఈ గుహాలయాలలో ప్రతి అణువూ ఒక శిల్ప కళా అద్భుతమే. గుహను గదిలా తొలుస్తూ అందులోనే స్తంభాలు (అచ్చు గుద్దినట్టు అన్నీ ఒకే కొలతలు, ఆ శిల్పుల పర్ఫెక్షన్ కి కనిపిస్తే కాళ్ళ మీద పడిపోదాం అనిపించింది), గుహ పై కప్పును కూడా వదలకుండా ప్రతి అంగుళం ఒక అద్భుతం అనిపించేలా చెక్కారు. మొదటి మూడు అంతస్తులూ హిందూ మత శైలి కనిపించింది నాల్గవ దాని టైం కి ఆ రాజ్యం లో జైన మత ప్రభావం ఉందనుకుంటా అక్కడన్నీ జైన గురువుల శిల్పాలు. ప్రతి చోటా నిజంగా ఆ దేవుళ్ళే ఈ శిల్పాలకి మోడల్స్ గా పనిచేశారా అనిపిస్తుంది (చెప్పొద్దూ.. అదంతా చూసి ఆఫ్ట్రాల్ మనుషుల ఉలి తగిలితేనే రాయి దేవుడయి పోతుంటే దేవుడి కాలు తగిలి రాయి ఆడది అవడం ఏమన్నా గొప్పా? అనిపించింది)
ఇక బాదామి గుహల మొదటి అంతస్తులోనే మనల్ని పలకరించేదే నేను చెప్పిన నటరాజు విగ్రహం. భరత నాట్యం లో ఉండే ఎనభై ఒక్క ముద్రలని కళ్ళ ముందు ఉంచేలా పద్దెనిమిది చేతులతో నటరాజు విగ్రహాన్ని చెక్కారు. ఏ రెండు చేతులని కలిపి చూసినా ఒక ముద్ర వస్తుందన్న మాట. ఇలాంటిది ప్రపంచంలో ఇంకెక్కడా లేదు (ట). అసలు అలాంటి శిల్పాన్ని చేక్కించాలన్న ఐడియా ఎవరికీ వచ్చిందో గానీ నిజంగా తెగ నచ్చేసింది ఆ శిల్పం. ఇదిగో మీరూ చూడండి.
(మనలో మనమాట దీన్ని బాపు బొమ్మగా గీస్తే చూడాలనిపించింది నాకు.....ఎవరయినా ఆయనకీ విషయం చెప్తే బాగుండును! :))
11 comments:
>>ఆఫ్ట్రాల్ మనుషుల ఉలి తగిలితేనే రాయి దేవుడయి పోతుంటే దేవుడి కాలు తగిలి రాయి ఆడది అవడం ఏమన్నా గొప్పా?
చాలా బాగా చెప్పారండీ. నటరాజస్వామి విగ్రహం కనులవిందుగా ఉంది.
చాలా మంచి టపా. బాగుంది.
A doubt. Taking two at a time out of 18 gives a large number. Could it be that one has to take one from each side?
adbuthamainaa kalaa kandam.
manchi post rasarandi... idi chusi, inthati shilpakala vaibhavam mana desham lo undani garvamu, ippudu ika ledani badha kaligaayi..
@gaddeswarup :
right side 9 mudralu, left side 9 mudralu..right side gala oka chetiki, left side 9 chetulu kalisthe 9 mudralu avuthayi , alane prathi chetiki ante 9*9 = 81 mudralu motham..
koncham mathematics lo permutations and combinations telisinavarayithe, 9C1 * 9C1 = 81.
>>ఆఫ్ట్రాల్ మనుషుల ఉలి తగిలితేనే రాయి దేవుడయి పోతుంటే దేవుడి కాలు తగిలి రాయి ఆడది అవడం ఏమన్నా గొప్పా?
చాలా గొప్పగా చెప్పారండి. నెనర్లు!
"baadami guhalu" gurinchi kotta vishayam telisindi neevalla,chala thanks..
Colors,
Thanks. I was confused and thought of 18C2 forgetting the obvious left, right business.
chala baga chepparu ika nenu kotha patakudini mee blog telugu basha meeda abhimananni marinta penchutondhi.
ఆఫ్ట్రాల్ మనుషుల ఉలి తగిలితేనే రాయి దేవుడయి పోతుంటే దేవుడి కాలు తగిలి రాయి ఆడది అవడం ఏమన్నా గొప్పా?
excellent chala baagundi ..ee tapaa
హంపీ గురించి మీరు అందించిన ప్రతి విషయమూ ఆణి ముత్యమే!
అత్యద్భుతం కదూ!
ఎంతో విలువైన సమాచారాన్ని మాకు అందించారు;
Many many thanks !!
( kadambari - konamanini )
Post a Comment