నిన్న ఏదో మాటల్లో బాపు గారు తీస్తున్న శ్రీరామ రాజ్యం సినిమా గురించి నేను నా శ్రీమతి మాట్లాడుకుంటూ ఉండగా సడన్ గా ఆ సినిమాకి టైటిల్ సాంగ్ ఎలా ఉంటుందా అనిపించింది. అంటే రామరాజ్యం గురించి ఏం చెప్తే బావుంటుంది అన్న ఆలోచనతో రాయడం మొదలు పెట్టా. మొత్తం పాట రాయడానికి జస్ట్ ఇరవై నిమిషాలు పట్టింది (అంటే అది నా గొప్ప కాదు లెండి రాములోరిది). చదివి మీ అభిప్రాయం చెప్తే ఆ ధైర్యం తో రమణ గారికి కూడా వినిపించే సాహసం చేస్తా.
ధర్మం నాలుగు పాదాల నడచిన రాజ్యమిది
దైవం మానుష రూపేణా ఏలిన రాజ్యమిది
కరకు బోయ కడు రమ్యముగా కీర్తించిన రాజ్యమిది
భవిష్యత్ బ్రహ్మే బంటుగా ఒదిగిన సిత్రపు రాజ్యమిది
రామనామమే రాజముద్రగా సాగిన రాజ్యమిది
ప్రజల క్షేమమే ధర్మసూత్రమై నడచిన రాజ్యమిది
బడుగు మడేలు మాటకు సైతం విలువిచ్చిన రాజ్యమిది
ఆలి కన్నా పాలితులే ప్రియమని సెలవిచ్చిన రాజ్యమిది
పాలనలో ఇల సాటిలేదని కొలచిన రాజ్యమిది
పాలకులే ప్రజ సేవకులని నేర్పించిన రాజ్యమిది
ఇదండీ రామరాజ్యం అంటే నాకు తోచినది. ఎలా రాసానో మీరే చెప్పాలిక.
9 comments:
Super .. try to extend this
Very good, sir.
"కరకు బోయ కాదు ..."
అన్నది సరియైన ప్రయోగమేనా? అది అచ్చు తప్పా? మీరు "కరకు బోయ "కడు" రమ్యముగా" అని చెప్పాలనుకున్నారా?
shyamkr గారూ,
"కాదు" కాదు "కడు" అని నా ఉద్దేశ్యం. అచ్చుతప్పు పడింది. సవరించాను. ధన్యవాదాలు.
బాగుంది. మీరు బాపూగారిని కలిసిన ఆనందంలో పాట అలవోకగా వచ్చినట్లుంది.
బాగుందండీ. సంతోషం.
very nice.బాగుందండీ...ఎంతైనా పేరడీలు రాయటంలో అందె వేసిన చెయ్యి కదా...:)
మీ బ్లాగు చాల బాగ ఉందండి. ...ఇ రొజె మొత్తము బ్లాగు చదివాను ....మీలాంటి వారు ఇంకా ఎక్కువ పొస్ట్ లు చెస్తె బావుంటుంది...
Chaala baaga raasaru "mee peru".
"కరకు బోయ కడు రమ్యముగా కీర్తించిన రాజ్యమిది"
"ఆలి కన్నా పాలితులే ప్రియమని సెలవిచ్చిన రాజ్యమిది "
ee rendu lines chaala baaga nachhayi. aa ramuloru challaga chuste, memu ee paata aa cinema lo vintaamu annamata..:)
Post a Comment