Friday, January 14, 2011

నవ్వించినందుకు థాంక్స్ మాస్టారూ!!!! - నేడు జంధ్యాల జయంతి


ఈ రోజు జంధ్యాల జయంతి. తెలుగు సినిమాలో నెలవంక, ఆనంద భైరవి, ముద్ద మందారం లాంటి సినిమాలు తీసినప్పటికీ జంధ్యాల సినిమా అంటే మనకి చటుక్కున గుర్తొచ్చేవి మాత్రం అహనా పెళ్ళంట, వివాహ భోజనంబు,బావా బావా పన్నీరు, హై హై నాయకా  లాంటివే. ఆ సినిమాలలో చిత్ర విచిత్రమైన తిట్లతో, అశ్లీలం లేని స్వచ్చమైన హాస్యంతో తెలుగువాళ్ళని  మనసారా నవ్వించిన ఆ మహా దర్శకునికి నివాళి.

ఇక ఆయన స్ఫూర్తి తో ఆఫీసుల్లో బాసుల్ని, క్లైంట్లని, ఇరుగు పొరుగులలో మనకి నచ్చని వాళ్ళని తిట్టుకోడానికి కొన్ని తింగరి తిట్లు. నచ్చితే మీ వాటాగా మీరూ జత చేయండి వీటికి.  (ఈ పోస్టులో ఏ  ఒక్క తిట్టుతోనూ నన్ను మాత్రం తిట్టకూడదనేది మాత్రం పరమ స్ట్రిక్ట్ రూల్)

౧. కోడిగుడ్డు కి హెయిర్ వీవింగ్ చేయించే వాడి మొహంలా ఆ మొహం చూడు 
౨. ఊర కుక్కకి పళ్ళు తోమే వాడిలా ఆ చూపెంట్రా?
౩. దిష్టి తీసిన నిమ్మకాయలేరుకుని లెమన్ టీ చేసుకు తాగే పింజారీ కుంకా 
౪. ఆర్టీసీ బస్సు వాడిని లిఫ్ట్ అడిగేవాడి మొహం 
౫. బంగాళా ఖాతం లో పూడిక తీసేవాడి మొహం 
౬ మూగ కుక్కలా పిచ్చి చూపులు చూస్తావేరా తిక్క వెధవా
౭. అప్పడం నానబెట్టుకు తినే అంట్ల వెధవా
౮. ఫోటో స్టూడియో వాడికి ఎక్స్ రే ఇచ్చి డెవలప్ చేయమని అడిగే దిక్కుమాలిన వెధవా
౯.  మంగలి షాప్ లో బొచ్చు కొట్టేసే వాడిలా ఆ మొహం చూడు 
౧౦. జలుబు చేసిందని ఐస్ క్రీం వేడి చేసుకుని తినే తింగరి వెధవా 
౧౧.  టీవీలో యాంకర్ ని చూసి కన్ను కొట్టి సిగ్గుపడే పిచ్చి నా పుత్రా
౧౨.   ముళ్ళపొదల్లో గాలిపటాలు ఎగరేసే వాడిలా ఆ చూపెంట్రా చింపాంజీ సుతా
౧౩.  తెగిపోయిన బల్లి తోక మొహం నువ్వూనూ
౧౪. ఎడ్ల బండికి పంక్చర్లు వేసేవాడిలా ఆ మొహం చూడు 
౧౫.  పానీ పూరి లో కొబ్బరి నీళ్ళు పోసుకుని తినేవాడి మొహం నువ్వూను  

4 comments:

జర్నో ముచ్చట్లు said...

సంక్రాంతి.. జంధ్యాల జయంతి.. నవ్వుల పండువగా శాశ్వతంగా గుర్తుండిపోతాయి. పండుగ పూట జంధ్యాల మార్కు తిట్లపురాణంతో నవ్వించినందుకు.. మీకు ధన్యవాదాలు.

విజయ్

tarakam said...

జంధ్యాలగారి అసంఖ్యాక అభిమానుల్లో నేనూ ఒకడిని.ఒక డిశెంబర్ 31 న నెక్లెస్ రోడ్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన స్వయంగా చెప్పిన జోక్ మరియు ఆయనకత్యంత ఇష్టమైనది.
వివాహ షష్టిపూర్తి వేడుకలో భర్తను స్నేహితులడుగుతారు మీ దాంపత్య విజయ రహస్యమేమిటని.నేను నా భార్య మా విధులను చక్కగా పంచుకొన్నాం,ఒకళ్ళ పరిధిలో ఇంకొకళ్ళం వేలు పెట్టం.చిన్న చిన్న విషయాలన్నీ మాఆవిడ చూసుకొంటుంది,అంటె పిల్లలను ఏమి చదివించాలి,ఎలా పెంచాలి,ఆస్తులేవి సమకూర్చుకోవాలి,పిల్లల పెళ్ళిళ్ళు లాంటివి.పెద్దవిషయాలన్నీ నేను చూసుకుంటాను,ఇండియా అంతర్జాతీయ సంబంధాలు,కాష్మీర్ సమస్య,G-8,WTO సమావేశాలు.గ్లోబల్ వార్మింగ్ లాంటివన్నమాట !

Anonymous said...

తెలుగులో తిట్టకలిగినన్ని తిట్లూ, జంధ్యాల గారి కలం నుండే రావడంతో, మిగిలినవారు ఎప్పుడైనా తిట్టాలని ఉన్నా, జంధ్యాల గారిని కాపీ చేస్తున్నాడురా అనేటంతగా, పేటెంట్ తీసేసికున్నారు ఆయన!

kannaji e said...

ఆయన పెట్టించిన ఎక్స్ప్రెషన్స్ పలికించిన డాయలాగ్స్ యా హ్హ హ్హ ..ఆ యాక్టర్లు అందరిని పాత్ర తో సహా గుర్తుంచుకొనేలా చేసాయి...ఆయన ఇంకా ఉండి ఉంటే కొన్ని వందల మహా నటులని ఇచ్చేవాడేమో మనకి...
ఈ పర్వదినాన మీరు అందరికి పంచుతున్నందుకు..ధన్యవాదాలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ...