వీటిని హైకూలు అనచ్చో లేదో నాకు తెలియదు. జస్ట్ రాయాలనిపించింది అంతే . నచ్చితే భుజం తట్టండి
౨౨.
రెండో క్లాసు కుర్రాడు పొద్దున్న స్కూలుకి
సాయంత్రం ఐ ఐ టి కోచింగ్ కి
౨౩.
ఒంటి నిండా బట్టలేని జనం
మురికివాడల్లోనూ
మెట్రో పబ్బుల్లోనూ
౨౪.
ఈ గతుకుల మీదొట్టు
ఈ రోడ్డు
మొన్నే వేశారు
౨౫.
అన్ని చానెళ్ళలో
అదే న్యూస్
ఎవడికి వాడే "ఎక్స్లూజివ్"
౨౬.
దున్నపోతు ఈనిందట
ఇది సీమాంధ్రుల కుట్రే
ఓ వేర్పాటు వాది స్టేట్మెంట్
౨౭.
రోడ్ల భద్రతపై అధ్యయనానికి
మన అధికారులు
వెనిస్ వెళ్లి వచ్చారు
౨౮.
జీతం వచ్చింది
కాగితం మీద బడ్జెట్ తర్వాత
లోటు వెక్కిరించింది
౨౯.
తాగుబోతు డ్రైవింగ్
వెధవరోడ్లు
తిన్నగా ఉండి చావవు
౩౦.
ఈ ప్రపంచం లో
అనంతమయినవి ఏమి లేవు
డైలీ సీరియల్స్ తప్ప
౩౧.
బాలకృష్ణ సినిమా హిట్టట
పుష్కర కాలం
అసలు గడిచినట్టే తెలియలేదు
౩౨.
పైరసీని అరికట్టండి
హాలీవుడ్ కధ కాపీ కొట్టిన
దర్శకుడి విజ్ఞప్తి
౩౩.
మా ఊళ్ళో బస్సు దిగా
అమ్మ ఒడిలో
తలపెట్టినట్టు ఉంది
(ఇప్పుడే "తోటయ్య" పోస్ట్ తో మా ఊరిని గుర్తుకు తెచ్చిన తృష్ణ గారికి ధన్యవాదాలతో)
౩౪.
అల్మారా సర్దుతుంటే
పాత ఆల్బం దొరికింది
దాంతో పాటే జ్ఞాపకాలూనూ
౩౫
ఎమ్మెస్ సుబ్బలక్ష్మి పాడుతోంది
చిన్నప్పుడు
ఉగ్గు బదులు తేనె తాగేసిందేమో
౩౬.
రెండు శరీరాల్లో
ఒకే ఆత్మ
బాపు - రమణ
6 comments:
Nice
Nice
chala bagunai andi.
మొదటి ఫదింటి పంచీ అదుర్స్. హైకూలని పిలవడానికి రూల్సు ఒప్పుకోకపోతే "పంచి కట్టు" అని పిలుద్దాము. మీరు కానివ్వండి.
3 parts -chala chala bagunnayi
భలే బాగా రాసారండి. అన్నీ కలిపి అచ్చేయించేయండి.
బాపూ రమణలు గుర్తొస్తే నాకు "నీ స్నేహం" సినిమాలోని ఈ పాట గుర్తుకొస్తుందండీ "కొంతకాలం క్రిందట బ్రహ్మదేవుడి ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం"(అదివరకూ ఓ టపాలో కూడా రాసాను.)
Post a Comment