Thursday, January 6, 2011

జస్ట్ రాయాలనిపించింది అంతే - రెండవ భాగం

వీటిని హైకూలు అనచ్చో లేదో నాకు తెలియదు. జస్ట్ రాయాలనిపించింది అంతే. వీటిలో కొన్ని పాతవి, కొన్ని కొత్తవి. నచ్చితే భుజం తట్టండి

౧౧. 
ఇప్పుడే భోజనమయింది 
ఇక ప్రకటించేయ్యచ్చు
ఒక్క పూట ఆమరణ దీక్ష

౧౨. 
మూడు తరాలుగా సాగుతోంది
ఆ టివి సీరియల్ 
ఇంకా సగం కూడా కాలేదట 

౧౩ 
ర్యాంక్ తగ్గింది
రైలు పట్టాల మీద 
ఇంటర్ కుర్రాడి శవం 

౧౪. 
అంతా ప్రశాంతం గా ఉంది 
ఆనందం గా లేనిది 
ఆ న్యూస్ చానెల్ వాళ్ళే 

౧౫. 
మన దేశం లో దొంగలకి 
మర్యాదేక్కువ
పార్లమెంట్లో కూర్చోపెడతాం 

౧౬. 
సొనియమ్మ కి మూడ్ బాలేదట 
ఎపి సిఎం 
మళ్ళీ మారతాడేమో

౧౭. 
నాస్తిక నేత మరణం 
కాల్చాలా? పూడ్చాలా? 
న్యూస్ చానెల్ లో SMS POLL 

౧౮.
పెళ్లి చూపులయ్యాయి 
అధిష్టానంతో సంప్రదించి చెప్తాం 
అబ్బాయి తరపు వారి సమాధానం

౧౯ 
అన్నిటికీ రాజీవ్, ఇందిరే
తన కొడుక్కి మాత్రం 
ఆ పేరు పెట్టలేదేందుకో ఆ నేత 

౨౦ 
మా వాడి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలట 
ఇంటికి ఇద్దరు చొప్పున రమ్మని
స్కూల్ నించి ఆహ్వానం 

౨౧. 
ఘంటసాలా? ఏ ప్రోగ్రాం లో సింగర్? 
స్రిప్ట్ చదువుతున్న 
మ్యూజిక్ షో యాంకరమ్మ ప్రశ్న 

6 comments:

aparna said...

anni bavunnai malli malli chadavali anipinchela vunnai

సుజాత వేల్పూరి said...

నాస్తిక నేత మరణం...progress report...కేక!

ఆత్రేయ said...

బాగున్నాయి పదును గా కరకర లాడుతూ ( sharpక్రి & crispy )

కృష్ణప్రియ said...

అంతా ప్రశాంతం గా ఉంది
ఆనందం గా లేనిది
ఆ న్యూస్ చానెల్ వాళ్ళే ..

:) Good

Jyothi said...
This comment has been removed by the author.
తృష్ణ said...

"మూడు తరాలుగా.."
"నాస్తికనేత.."
"ప్రోగ్రెస్ రిపోర్ట్.."

సూపర్..!