Thursday, February 17, 2011

ఛీ...వెధవ బ్రతుకు..చెప్పుకోడానికి ఒక్కళ్ళూ లేరు


ఒక్క నాయకుడు, జనం గురించి ఆలోచించే ఒక్క నాయకుడూ కనబడట్లేదు. ఎవరికి వాళ్ళే ప్రజల కోసం పేరుతో తమ పొట్టలు నింపుకుంటున్నారు. ఎవరి గురించని చెప్పాలి? ఎవరిని ఆదర్శంగా రేపటి తరానికి చూపించాలి? లేకపోతే అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డులా గాంధీ, నెహ్రూ, లాల్ బహదూర్ పేర్లనే ఇంకో పది తరాల వరకు వాడుకుందామా? నేటి తరం నాయకులలో ఎవరి గురించి చెప్పుకోవాలి?

సోనియా గాంధీనా? - ఎవరో రాసిచ్చిన ప్రసంగాలు చదువుతూ, వేరెవరో చెప్పే మాటల ఆధారంగా సర్వం సహా ఆధిపత్యాన్ని చలాయిస్తున్న ఈవిడని చూస్తే మన దేశ ఖర్మను తలచుకుని బాధేస్తుంది. ఇక అమ్మే దైవమంటూ భట్రాజుల్లా వంగి వంగి దండాలు పెట్టే కాంగ్రెస్ నాయకులనా?. పే....ద్ద  త్యాగశీలి అంటారు, ఏమిటి ఈవిడ చేసిన త్యాగం? ప్రధాని పదవా? ప్రధాని పదవిలో ఉంటే అధికారం తో పాటు బాధ్యతలు, సవాలక్ష తలనొప్పులు ఉంటాయి...త్యాగం పేరుతో ఆ తలనొప్పులను వదిలించుకున్న ఈవిడ అవధుల్లేని అధికారం మాత్రం ఆనందంగా అనుభవిస్తోంది. ఈవిడ త్యాగశీలి ఏంటండీ? కామెడీగా లేదూ?

ఇక భారత దేశం ఇప్పటివరకు చూసిన అత్యంత సమర్ధవంతమైన ఆర్ధిక మంత్రిగా పేరు తెచ్చుకున్న మన ప్రధానిని చూస్తే నాకు మనీ సినిమాలో "అమ్మగారు నాతో ఈ విషయం చెప్పలేదండి" అనే చారి కేరక్టర్ గుర్తొస్తుంది. వ్యక్తిగతంగా ఆయన సచ్చీలుడే కావచ్చు. అయితే తప్పు జరుగుతుంటే కళ్ళు మూసుకున్నవాడు కూడా తప్పు చేసినట్టే కదా. మేడం ఏం చెప్తే అలా ఆడే కీలుబొమ్మలా తయారయి తన ప్రతిష్టని దిగజార్చుకుంటున్న ఈ ఆర్ధిక మేధావి సమకాలీన రాజకీయాలలో అత్యంత అసమర్దునిగా మాత్రం బోల్డంత అప్రతిష్ట మూటకట్టుకున్నారు.  

ఇక చిదంబరం, ప్రణబ్ వగైరాల వంటి తొట్టి గ్యాంగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వీళ్ళకి మేడం చెప్పిందే వేదం. ఆవిడ మెప్పుకోసం రాహుల్ ప్రధాని కావాలనే నినాదం ఎప్పుడూ భుజాన వేసుకుని తిరుగుతూనే ఉంటారు. అవును మరి మనకి నెహ్రూ కుటుంబం తప్ప వేరే దిక్కులేదు కదా. ఛీ మన జీవితం...!. 

ప్రతిపక్ష నేత అద్వానీ -  ఈయనకి రాముడి మీద ఉన్న భక్తీ, శ్రద్ధ రామరాజ్యం మీద లేదు. రాముడొక్కడే దేవుడు అని నమ్మే ఈ అతివాద ఆరెస్సెస్ నాయకుడు ఆ రాముడందించిన పాలనలో ఒక్క శాతం...ఒక్కటంటే ఒక్క శాతం తమ అజందాలో చేర్చినా ఇంకో అర్ధ శతాబ్దం వరకూ ఈయనకు పగ్గాలు గ్యారంటీ. కానీ పాపం అయోధ్యలో మందిరమే తప్ప రాముడి అసలు ఆదర్శాలు పట్టని ఈయనకి ఆ విషయం ఎప్పటికీ తలపుకు రాదు.  

లాలూ, మమత, శరద్ పవార్ లాంటివాళ్ళు పొరపాటున కేంద్రమంత్రి పదవులోచ్చిన మున్సిపల్ కౌన్సిలర్లలా అనిపిస్తారు నాకు. ఇంకా జయలలిత, కరుణానిధి లాంటి చాలా మంది నేతల పేర్ల గురించి మీరు ఈ పోస్ట్ లో వెతుకుతుంటే సారీ. వాళ్ళ పేర్లు కూడా గుర్తుకురాలేదంటే దేశం మీద వాళ్ళ ప్రభావం ఎలా ఉందొ మీరే ఆలోచించుకోండి. 

కాస్తో కూస్తో  నిబద్ధత ఉన్న ఆంటోని, నితీష్ కుమార్, మోడీ లాంటి వాళ్ళు ఇప్పట్లో స్వయం ప్రకాశం ఉండే జాతీయ స్థాయి నాయకులు కాబోరు. (ముఖ్య గమనిక: వీళ్ళు పూర్తీ నీతివంతులు, సచ్చీ లురు అని నేను అనటం లేదు. మిగిలిన వాళ్ళ కంటే కాస్త బెటరని నా ఫీలింగ్ అంతే.)  

ఇంక ఎవరి గురించి చెప్పాలి రేపటి తరానికి? 

(ఇంకా అయిపోలేదు. మన రాష్ట్రం లో రాజకీయ వెధవల గురించి ......సారీ సారీ రాజకీయ మేధావుల గురించి తరువాతి భాగం లో బ్లాగుతా) 

6 comments:

ఇందు said...

నిజమేనండీ....దేశం ఒక లీడర్ కోసం మొహంవాచిపోయింది.మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండీ అన్న చందంలో ఎప్పటి నాయకులనో ఉదహరించడమే తప్ప....సమకాలీన రాజకీయల్లో ఒక్కడూ లేడు లీడర్ అనిపించుకోదగ్గ వాడు.ఈ కుళ్ళు రాజకీయాలని ఏరివేయడానికి ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు.మీరు చివర చెప్పిన నేతలు తమ తమ రాష్ట్ర విషయాలలో బానే ఉన్నా,అభివ్రుధ్ధి బానే జరిగినా వారు చెసిన పనులేమీ తక్కువ కాదు కదా!నాకు ఈ వారసత్వ రాజకీయాలు ఒక పట్టాన అర్ధం కావు! ఏం ఒక సీయం కొడుకు సీయ్యమ్మే కావాలా? ఏంటి అంత గొప్ప? ఎవరికి వారు స్వలాభం చూసుకోడమే కానీ దేశం ఎటుపోతోందో పట్టించుకునేవాడే కరువయ్యాడు!! ఇదివరకు రాష్ట్రపతులు రబ్బర్ స్టాంపులుగా ఉండేవాళ్ళు[కలాం కి కొంచెం మినహాయింపు]..ఇప్పుడు ప్రధానులు,ముఖ్యమంత్రులు కూడా రబ్బరు స్టాంపులు అయిపోయారండీ! ఏంచేస్తాం!! మొన్న ఎన్నికలప్పుడు మొదటిసారి ఓటు వేయడానికి వెళ్ళిన నాకు....ఎవరికి వేయాలో తెలీక...కాసెపు బుర్ర బద్దలు కొట్టుకుని...ఏదైతే అది అయ్యిందని లోక్ సత్తాకి వేసి వచ్చా!అదేమో నామరూపల్లేకుండా పోయింది.అక్కడ రాజు మాత్రమే తప్ప సైన్యం లేదాయే! అంతే! మన రాతలు ఇంతే!

bharadwaj said...

ee roju MANA mla lu assembly lonu, bayata pravartanchina theeru choosthe...chee emi chayyaleni mana asahayathani maname asahyanchukune paristhithi...mana nethalandharu kotlu mesesthunte kaneesam prasniche dhikku leni mana paristhithi thalachukunte....

tankman said...

"ఇక భారత దేశం ఇప్పటివరకు చూసిన అత్యంత సమర్ధవంతమైన ఆర్ధిక మంత్రిగా పేరు తెచ్చుకున్న మన ప్రధానిని చూస్తే నాకు మనీ సినిమాలో "అమ్మగారు నాతో ఈ విషయం చెప్పలేదండి" అనే చారి కేరక్టర్ గుర్తొస్తుంది."....hehe

Anonymous said...

@Sanju
మీరు కామెంట్లు బాగా వ్రాస్తారనేది నా అభిప్రాయం. కానీ ఈసారి మాత్రం కేవల సరదాకోసమే వ్రాసినట్లున్నారు:)
ఇక్కడ మన్మోహన్ గారు తాననుకున్నవన్నీ చేఏంత స్వేచ్ఛ ఆ పార్టీలో లేదుగనక నాకొద్దీ పార్టీ/ పదవి అని మూలన కూర్చునుంటే ఆ మాత్రం కూడా చేసేందుకు అవకాశం ఉండేది కాదుకదా? Something is better than nothing కదా? కాంగ్రేసు మార్కు అవినీతి ఇంకా విచ్చలవిడిగా జరిగి యుండేది కాదా?
అందుకే (though right man in a wrong party/ wrong demonocracy) తనకవకాశమున్నంతవరకు చెయ్యగలిగినా చాలనే అభిప్రాయంతో ఉండడం ఏమీ చాతగానివాడిలా పక్కకు తొలగడం కన్నా మిన్నకదా??

tankman said...

@RSReddy garu ... thanks for the compliment...i have nothing against our PM but i could not stop laughing at the comparison this blogger made...it is funny :)

Sriharsha said...

:)