Monday, April 4, 2011

ఉగాది పచ్చడికి సరిక్రొత్త రెసిపీ - అన్ని పేటెంట్ హక్కులూ నావే


హమ్మయ్య అన్ని బ్లాగులూ చూసుకుంటూ నా బ్లాగుకి కూడా వచ్చేసారు కదా. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. ఇంక మేటర్లోకి వచ్చేద్దాం.

ఎక్కడ చూసినా ఎడాపెడా చెట్లు నరికేస్తున్నారు ఇలాగే ఉంటే కొన్నాళ్ళకి వేప, మామిడి లాంటి చెట్లు కనబడవు కదా. అంచేత ఉగాది పచ్చడికి కొత్త రెసిపీ కనిపెట్టాల్సిందే. సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు?, ఆ భారం ఏదో నా భుజాల మీదే వేసుకుందామని ఈ మహా ప్రయోగానికి శ్రీకారం చుట్టి ప్రపంచానికి ఒక వినూత్న ఆవిష్కరణ పరిచయం చేస్తున్నాను. కాస్త కిందకి స్క్రోల్ చేసి రెసిపీ చూసేయండి.

(గమనిక: ఇదిగో ముందే చెప్తున్నాను నాకు ఈ అభినందనలు, పొగడ్తలు, సన్మానాలు, నోబుల్ ప్రైజులు లాంటివి అస్సలు గిట్టవు.) 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
రెండు గుప్పెళ్ళ  పంచదార, పావు గ్లాసు నిమ్మరసం, గుప్పెడు ఉప్పు , అరగ్లాసు మిరియాల కషాయం,  అరగ్లాసు కాకరకాయ రసం గ్లాసుడు  గ్రీన్ టీలో కలుపుకుని తాగితే సరిపోతుంది. (ఆరు రుచులు వచ్చేసాయి కదా). ఇహ ఉగాది పచ్చడి పరమార్ధం మీకు తెలిసి పోయినట్టే.

(అదిగో ఎవరో అక్కడ "వా.......వ్వ్" అనేస్తున్నారు. ముందే చెప్పాకదా పొగడ్తలు గట్రా వద్దు. ఈ రెసిపీ భరించలేము అనుకుంటే ఈ రోజు మీ వంతుగా కనీసం ఒక మొక్క నాటండి మరి.)  

5 comments:

కృష్ణప్రియ said...

నాకు నచ్చిందండీ.. నేను చెట్టు నాటను... :)
Just kidding... Good post

తృష్ణ said...

ఇవాళ మీ ఈ కొత్త రెసిపీ మీరు తిన్నారని విశ్వసనీయంగా తెలిసాకా, రేపో ఎప్పుడో మరో టపా మీ బ్లాగులో కనబడ్డాకా అప్పుడు...అప్పుడు ఆలోచిస్తాము మీకు ఏ ప్రైజ్ ఇవ్వాలి? ఏ సన్మానం చెయ్యాలి అని !! అదన్నమాట...:)

పొద్దున్న కామెంట్ల ఫారం కనబడలేదండీ.ఇప్పుడే కనబడింది.

Unknown said...

బాబోయ్ చదువుతూ ఉంటేనే గుండెల్లో గుబులుగా ఉంది చేస్తే ఇంకేమి అవుతుందో మాష్టారు ..
ఇలాంటి వింతలు చెప్పకండి బాబ్బాబు .. మీకు పుణ్యం ఉంటుంది :)

bharadwaj said...

చక్కని ఉగాది పచ్చడి ఉండగా నీకు ఈ తిక్క ఆలోచన ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు రా..

Unknown said...

meeru cheppina ugadi pachhadi bavundi kaani nimma kuda chette kada idi first point, chetlu kottese manam mokkalu penchakapote kakarakayalu matram ekkadinunchi vastayi edi second point...

http:/kallurisailabala.blogspot.com