http://www.box.net/shared/e3f7u0du1p
ఎన్నాళ్ళో వేచిన ఉదయం
ఈనాడే ఎదురవుతుంటే
ఎన్నాళ్ళో వేచిన ఉదయం
ఈనాడే ఎదురవుతుంటే
ఇన్నినాళ్ళు దాచిన సత్యం
ఉబికి ఉబికి వస్తుంటే
ఇంకా తెలవారదేమి
ఈ సస్పెన్స్ విడిపోదేమి?
ఇంకా తెలవారదేమి
ఈ సస్పెన్స్ విడిపోదేమి?
ఒకటిగా నిలిచిన జాతిని
ఏ తంత్రం ఏమీ చేయదని
ఐక్యత కోరే వారికి
ఏనాటికి ముప్పే రాదనీ
ఐక్యత కోరే వారికి
ఏనాటికి ముప్పే రాదనీ
నేనెరిగిన సమైక్య వాదం
నీతో చెప్పాలని వస్తే
ఇంకా తెలవారదేమి
ఈ సస్పెన్స్ విడిపోదేమి?
నేతలు తిరిగే జాతిలో
ఏ ఐక్యత పనికి రాదనీ
ప్రగతిని కోరే స్టేటులో
తమ ప్రాంత స్వార్ధమే మేలని
నేచూసిన విభజనిజం
నీతో చెప్పాలని వస్తే
ఇంకా తెలవారదేమి
ఈ సస్పెన్స్ విడిపోదేమి?
ఇంకా తెలవారదేమి
ఈ సస్పెన్స్ విడిపోదేమి?
"విభజనిజం" అనే కొత్త పదం పుట్టించాల్సి వచ్చింది. దీనికి వీరతాడు వేసినా (ఎవరూ పుట్టించకుండా కొత్త పదాలు ఎలా పుడతాయి - మాయా బజార్ లో ఘటోత్కచుడు), భాషను ఖూనీ చేసానని తిట్టుకున్నామీ ఇష్టం. ఈ ప్రయత్నం నచ్చితే ఒక చిన్న కామెంట్ తో భుజం తట్టండి చాలు!!!!
13 comments:
:):):)
Baagundi.:)
బావుందండీ.
good
nice attempt. But becareful that either TRS may ban it or Samaikyandhra people may adopt it as their main weapon to fight against TRS.
మీ ఆలోచన బాగుంది. పేరడీ కూడా బాగుంది. తెలుగు న్యూస్ ఛానళ్ల
వాళ్లు ఎవరైనా కాపీ కొట్టే ప్రమాదముంది. జాగ్రత్త
విభజనిజం....వేస్కోండి వీరతాడు! చక్కగా ఉంది ...రివిజనిజం లాగా!
super.
"విభజనిజం" బాగుబాగు
pavala adirindi.vibajanijam nijamga bagundi
పేరడీ బావుంది. విభజనిజం పదం సంకరమే. అయితే దీని విస్తృతార్థం ఆలోచించేదిగా ఉంది. (దీన్ని విభజన.. నిజం అని విడదీసి చూడొచ్చు.. అలాగే, క్యాపిటలిజం, మార్క్సిజం తరహాలో ఏకపదంగా చూడొచ్చు) వర్తమానానికి ప్రతీకగా ఉంది కాబట్టి అందుకోండి వీరతాడు..
విజయ్
నేను రాగయుక్తంగా పాడుకున్నానండీ...చక్కగా కుదిరింది.
విభజనిజం....అందుకోడి రెండు వీరతాళ్ళు :)
పేరడీ చాలా చక్కగా కుదిరిందండి :-) విభజనిజం కి వీరతాడే :-)
Totalga ADURS..
Post a Comment