౧.
పెద్ద బాలశిక్ష
పేరెక్కడో విన్నా
వీక్లీయా? మంత్లీయా?
౨.
కూతురు పుట్టిందట
grl brn అని
బామ్మర్ది sms
౩.
మా వీధిలో గేదె ఈనింది
ఇందాకనే చూసా
ఏదో టీవి బ్రేకింగ్ న్యూస్ లో
౪.
ఉల్లిపాయ
కోసినా, కొన్నా
కన్నీళ్ళే
౫
ఆదివారం తర్వాత ఏ వారం?
ఈ వారం రియాల్టీ షో లో
ప్రేక్షకులకు sms ప్రశ్న
౬.
బందులు, ధర్నాలతో
ఏడాదంతా గడిచిపోయింది
రేపట్నించి కాలేజి లో ఎగ్జామ్స్
౭.
రాష్ట్రం ప్రశాంతంగా ఉంది
ముఖ్యమంత్రి స్టేట్మెంట్
సచివాలయం ఎదురుగా లాఠిచార్జ్
౮.
అహింసాయుత మార్గం లో స్వాతంత్రం
గొప్పగా చెప్పుకుందాం
రక్తపాతాల ఆర్తనాదాల మధ్య
౯.
నేటి పిల్లలకి
టెల్గు బాగా వచ్చు
అ ఆ ఇ ఈ F
౧౦
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని
పుస్తకాల్లో హైదరాబాదే
పాలన మాత్రం ఢిల్లీ లో
6 comments:
మా నాన్నగారి దగ్గర ఒక హైకూల పుస్తకం చూసానండి. రచయిత పేరు గుర్తులేదు కానీ చాలా బాగున్నాయి. ఆ పుస్తకం గురించి రాద్దాం అనుకుంటూనే గడిచిపోతోంది...
ఇంతకీ "ఆదివారం తర్వాత ఏ వారం?
ఈ వారం రియాల్టీ షో లో
ప్రేక్షకులకు sms ప్రశ్న" మాత్రం సూపర్.
తెలుగు టివీ సీరియల్స్ మీద కూడా ఒకటి రాయాల్సిందండీ.
భేషుగ్గా ఉన్నాయి! హైకూ అంటే పిట్ట పువ్వూ, చెట్టూ వర్షం ఇవే కాదుగా! ఇంకా బాగా కూడా రాయగలరు. రాస్తూ ఉండండి!
:) Very nice!
చిన్నగా, ముద్దుగా,నవ్వు కునేలా,ఆలోచనచేసేలా,అబ్బురపదేలా వున్నాయి మీ హైకులు...నచ్చాయి నాకు చాలా....
లక్ష్మీ రాఘవ
meru rasinavi chala funny&cute ga vu nai
chala chala bagunnai, neti mana rashtra parstini ni taggattugaa..
Post a Comment