Wednesday, November 25, 2009

మహాప్రస్థానం



సాహసి



సంధ్యా సమస్యలు



ఓ మహాత్మా ఓ మహర్షి



తుదిపయనం తొలివిజయం



కేక



కవితా ఓ కవితా!



రుక్కులు



రావణాసుర పద్యం



నిన్నటి జట్కావాలా



ప్రతిజ్ఞ



మనం రాస్తే తవిక ... శ్రీశ్రీ రాస్తే కవిత

మన బ్లాగ్ అన్నతరువాత కుసింత స్పెషల్ ఉండాలని, ఏం చేద్దామా అని తెగ అలోచిస్తుంటే మన శ్రీరంగం శ్రీనివాసరావు గారు గుర్తొచ్చారు. ఆయన కవితలు కొన్ని ఇక్కడ పంచుకోవాలనిపించింది. డైరెక్ట్ గా అవే ఇచ్చేస్తే ఇంక మన పెసాలిటీ ఏంటని ముళ్ళపూడి వెంకటరమణగారి బుడుగ్గాడు జెల్ల కొట్టి మరీ తిడితే సరే అన్చెప్పి ఆ కవితలేవో శ్రీ శ్రీ నే మీకు చదివి వినిపించమన్నా. అచ్చంగా ఆయన గొంతులోనే... (ఏదో కవి సమ్మేళనం లో చదువుతుంటే  ఎవరో మహానుభావుడు రికార్డు చేశారు) విని తరించండి.

ఇంకా ఇలాంటి చమక్కులు నా బ్లాగ్ లో బోల్డన్ని లైన్ లో వచ్చేస్తున్నాయి!!!!

బ్లాగవద్గీత మొదటి అధ్యాయం

హల్లో ఇది నా బ్లాగ్ లో మొదటి పోస్టింగ్

వర్షాకాలం
చల్లని సాయంత్రం
ఎర్రని బొగ్గులమీద అప్పుడే కాల్చిన మొక్కజొన్న పొత్తును కొరికితే ఎలా వుంటుందో

వేసవికాలం
వెన్నెల రాత్రి
ఆరుబయట చల్లని గాలిలో చుక్కలు లెక్కెడుతూ పాతపాటలు వింటూంటే ఎలా వుంటుందో

చలికాలం
పొద్దున్నే నీరెండలో
వేడివేడి కాఫీ సిప్ చేస్తూంటే ఎలా ఉంటుందో

ఈ బ్లాగ్ అలా చేద్దామని నా ఫీలింగ్

కానీ ఒక్కోసారి

IMAX 3D లో ఆర్. నారాయణమూర్తి సినిమా చూస్తున్నట్టు
వేడి వేడి మిరపకాయ బజ్జీని వెనీలా ఐస్ క్రీం లో ముంచుకుని తింటున్నట్టు
చల్లని మిరియాల కషాయం లో కోక్ కలుపుకుని తాగుతున్నట్టు

మీకనిపిస్తే అది నా తప్పు కాదు......