Tuesday, December 22, 2009

మీ అభిమానం, ఆత్రుత , ఆందోళన తగలడా!!!.....అసలా విషయం ఎవరూ ఆలోచించరేం?

ఎప్పటిలాగే ఈ పోస్ట్ ఇమేజ్ ఫార్మాట్ లో ఇస్తున్నాను. క్లిక్ చేస్తే వేరే పేజి లో ఓపెన్ అవుతుంది. చదివేసి వదిలేయకుండా కుసింత ఆలోచించండి. అలాంటి వారిలో ఏ ఒక్కరైనా మీకు తెలిసిన వాళ్ళుంటే వాళ్ళలో ఆలోచనకు బీజం వేయండి. 


ఘంటసాల పుష్ప విలాపం - విని చెప్పండి ఎలా ఉందో...

ఎప్పుడు విన్నా మనసును కదిలించే కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పుష్పవిలాపం ఘంటసాల గొంతులో వినడమంటే నాకు చాలా ఇష్టం. రాసింది పాపం కరుణశ్రీ అయినా ఇది ఘంటసాల గొంతులో నుంచి వచ్చి ఘంటసాల పుష్పవిలాపం గా ఫేమస్ అయిపోయిందంటే ఏ స్థాయిలో ఆయన ఈ రచనకు న్యాయం చేయగలిగాడో ఊహించుకోవచ్చు. పూర్తిగా విన్న తరువాత ఇంక ఏ పువ్వు ను చూసినా మీకు ఇదే గుర్తుకు వస్తుందని మాత్రం ఘంటాపధంగా చెప్పగలను. అలాంటి అరుదైన, అపురూపమైన ఆడియో క్లిప్ లను మీతో పంచుకోవాలనిపించింది. లింకులు కింద ఇస్తున్నా. క్లిక్ చేసి విని మైమరచిపోండి. నాకు కామెంట్ చేయడం మాత్రం మరచిపోకండి.
ఘంటసాల పుష్ప విలాపం - 1

ఘంటసాల పుష్ప విలాపం - 2