Showing posts with label పేరడీలు. Show all posts
Showing posts with label పేరడీలు. Show all posts

Wednesday, February 23, 2011

వేర్పాటువాద వ్రత కల్పం


ఒక నాడు తెలంగాణా భవన్ మేడ మీద మందు కొడుతున్న కచరా (తెలంగాణా  రాష్ట్ర సమితిని తె.రా.స. అన్నప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ను కచరా అని ఎందుకు పిలవకూడదు అనిపించి హిందీలో "కచరా" అంటే "చెత్త" అని తెలిసి కూడా :) ఇలా పిలిచా) వద్దకు ఆయన కుమారుడైన కేటిఆర్ వచ్చి తండ్రీ ఏ వ్రతము చేసినంత పది తరముల వరకు తిన్నా తరగని ఆస్తిపాస్తులు, పదవులు సమకూరునని అడుగగా అంతట కెసిఆర్ కుమారుడి దురాశకు మిక్కిలి సంతసించి మందు గ్లాస్ పక్కన పెట్టి, బిడ్డా తరముల పాటు తిన్నా తరగని ఆస్తిపాస్తులు ఆర్జించుటకు "వేర్పాటు వాద వ్రతము" అను వ్రతము కలదు. ఈ వ్రతమును అత్యంత ఓపికగా పది వత్సరాలు ఆచరించిన పదవులు,సంపదలు వెల్లువలా వచ్చి పడునని చెప్పెను. అంతట ఆ వ్రత విధానమును తెలియజేయమని కేటిఆర్ కోరగా కెసిఆర్ ఇట్లు సెలవిచ్చెను. ముందుగా ఈ వ్రతము ఆచరించుటకు మనము ఏ పార్టీలో ఉన్నామో ఆ పార్టీ నుండి బయటకు వచ్చుటకు ఒక కారణమును వెతుకవలెను ఆపై మనము ఉన్న ప్రాంతము ప్రత్యేక రాష్ట్రముగా కావలెను అన్న నినాదముతో క్రొత్త పార్టీ పెట్టవలెను. మనము బ్రతుకవలేనన్న ఇతర ప్రాంతముల వారిని వెధవలుగా చూపవలెనన్న సూత్రమును పాటించి మనము ఉన్న ప్రాంతము తప్ప మిగిలిన ప్రాంతముల వారు మనను దోచుకోనుచున్నారని, మనము ప్రత్యేక రాష్ట్రం గా విడిపోతే మనకసలు కష్టాలే ఉండవని అరచేతిలో స్వర్గం చూపుతూ, వీర లెవెల్లో ప్రజలను రెచ్చగొట్టే విధంగా విచ్చలవిడి బూతులతో ఇతర ప్రాంతాల వారిని, మన ప్రాంతం లో మన ప్రత్యర్ధులను తిడుతూ ఇదే మన ప్రాంత సంస్కృతి, సంప్రదాయమని నుడవవలెను. ఈ క్రమంలోనే మన ప్రాంతానికి ఒక తల్లిని పుట్టించవలెను.. ఈ విధంగా చెప్పగా చెప్పగా ప్రజలలో క్రమేపీ ప్రత్యేక రాష్ట్ర వాంఛ పెరుగును. ఒక్క సారి ఆ వాంఛ తీవ్ర స్థాయికి చేరిన పిదప వారికి మనము తప్ప వేరెవరూ దిక్కు లేరని నమ్మిస్తూ  ప్రత్యేక రాష్ట్రమొచ్చిన అనంతరం పదవ తరగతి అర్హత తోనే కలెక్టర్లను చేయుదమని, పెట్రోలు లీటరు పది పైసలకే ఇస్తామని, ప్రతి ఇంటికి నెలకు వంద కిలోల బియ్యము ఉచితమని, ఉద్యోగులు చచ్చే వరకు పదవీ విరమణ ఉండదని, ఒక్క రూపాయకే ఏడాదికి సరిపడా పప్పులు, ఉప్పులు, కూరగాయలు సరఫరా చేస్తామని, "పన్ను" అన్న మాట మన రాష్ట్రం లో వినబడకుండా నిషేదిస్తామని ఇలా నోటికొచ్చిన వాగ్దానాలు చేయవలెను. ఎన్నికైన మన పార్టీ శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యులు (మనం తప్ప) ప్రతి రెండు నెలలకు ఒకసారి రాజీనామా చేసి ఉప ఎన్నికలను తెచ్చునట్లు చూసుకొనవలెను. సదరు పదవులు మన పార్టీ చేజారకుండా ఉప ఎన్నికలలో మనపై పోటీ చేయదలచిన వారిని మన ప్రాంత ద్రోహులుగా ప్రచారము చేయవలెను, తద్వారా సెంటి మంట రగిల్చి చలి కాచుకోవలెను. మనకు నచ్చినప్పుడు బందులు ప్రకటించవలెను. అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి శత్రువులను, మిత్రులను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ..మనను ప్రశ్చించిన వారిని ద్రోహులుగా ముద్ర వేస్తూ ఉద్యమమును ఉధృతంగా నడుపవలెను. మన ప్రాంతం లో సినిమా షూటింగ్ నుండి పరిశ్రమ స్థాపన వరకు, గృహప్రవేశం నుండీ బడ్డీకొట్టు ప్రారంభం వరకూ మనకు మామూళ్ళు ఇచ్చిన తరువాతే జరిగే విధంగా చూడమని మన కార్యకర్తలకు చెప్పవలెను. ఇక అసెంబ్లీ లో తోటి సభ్యులను దూషిస్తూ, సందు దొరికితే వారిపై చేయి చేసుకోవలెను, వారిని తెలంగాణా ద్రోహిగా చిత్రించి మన చర్యను సమర్ధించుకోవలెను. ఇక మరొక ముఖ్యమైన విషయమేమన్న పొరపాటున కూడా మనంతట మనం పార్లమెంట్ లో ఈ అంశాన్ని లేవనేత్తరాదు. అటుల ఈ ప్రత్యేక వాదమును నిరంతర రావణ కాష్టం వలె రగిలిస్తూ మన పబ్బం గడుపుకోవలెను.ఈ విధంగా కఠోర వేర్పాటు వాద వ్రతము సలుపు క్రమంలో చందాలు, వసూళ్లు, ముడుపులు, టికెట్ల అమ్మకాలు, కేంద్రం నుంచి వచ్చే తాయిలాల రూపంలో వద్దంటే డబ్బు మరియు కోరిన పదవులు వరించగలవు అని తెలియజేసెను. పూర్వము ఆంధ్ర రాష్ట్రములో ఈ వ్రతమును చెన్నారెడ్డి చేసి ముఖ్యమంత్రి పదవిని, ప్రస్తుతం నేను చేయుచూ కోట్లాది ఆస్తి మరియు కేంద్ర పదవులను పొందాము. ఇదే వ్రతమును పంజాబులో ఖలిస్తాన్ పేరిట జరిగి విఫలమయిన చరిత్ర కలదు.  వేర్పాటు వాద వ్రతములో పాటించవలసిన ముఖ్య నియమం ఎట్టి పరిస్థితిలోనూ మన వాదన ఫలించి ప్రత్యేక రాష్ట్రం రానీయరాదు. అటుల తెచ్చుకున్న జార్ఖండ్, చత్తీస్ ఘడ్, ఉత్తరాంచల్ లలో ఏ మేరకు అభివృద్ధి జరిగినదో జనులెల్లరకూ విదితమే. ప్రజలకు వాస్తవం కళ్ళముందుకు వచ్చే ప్రమాదమున్నందున అట్టి పొరపాటు మనం చేయరాదు. జార్ఖండ్ ముక్తి మోర్చా పేరుతో మనవలే ప్రత్యేక వాదము వినిపించి  అధికారము చేజిక్కించుకున్న శిబు సోరెన్ అను వ్యక్తీ ఏ విధముగా అధః పాతాళమునకేగెనో గుర్తించి అత్యంత జాగరూకులై ఉద్యమము విజయవంతము కాకుండా చూడవలెను. 

అంతట కేటిఆర్ "తండ్రీ ఒక వేళ మన గ్రహచారం బాలేక ప్రత్యేక వాదం ఫలించి తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన అప్పుడేమి చేయవలె?" అని ప్రశ్నించగా చిద్విలాసముతో కెసిఆర్ "కుమారా అపుడు ఒక సంవత్సరం వేచి ఆపై ప్రత్యేక ఉత్తర తెలంగాణా లేదా దక్షిణ తెలంగాణా వాదము అందుకున్న చాలు" అని నుడివెను. 

తండ్రి సమాధానమునకు మిక్కిలి సంతుష్టుడైన కేటిఆర్ ఆ విధం గా తండ్రి బాటను నడువసాగెను.

ఫలశ్రుతి: ఈ వ్రత కధను బ్లాగులో చదివిన వారు, కామెంటిన వారికి జీవితమున వేరుపడు బాధలుండవు అని ఈ బ్లాగ్రచయిత శంకర ఉవాచ.

Monday, February 7, 2011

చిరంజీవి పరిస్థితికి సరిపోయే నాగార్జున పాట - మరొక నా మార్కు పేరడీ

ఏదో ఉద్ధరించేస్తానని ఉత్తర రాకుమార ప్రజ్ఞలు పలికి రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి ముచ్చటగా మూడేళ్ళు కూడా పార్టీని నడపలేక ఓటేసిన జనాల నమ్మకాన్ని నట్టేట ముంచి సొనియమ్మ పాదాల ముందు సాగిలపడిన వైనం నాకు భలే చికాకు కలిగించింది. పదవి రాకపోతే పార్టీని నడపలేం అనుకున్నాడో ఏమో మరి. అందుకే అసలు చిరంజీవి రాష్ట్రం లో పెరుగుతున్న ఈ రాజకీయ పోరు లో నిలవలేనని నిర్ణయించుకుని ఏ పార్టీలో చేరాలా అని సోనియానే సలహా అడిగితే ఎలా ఉంటుందో అన్న చిలిపి ఆలోచనే ఈ పేరడీ. దీనికి నేను తీసుకున్నా పాట రక్షకుడు సినిమాలో "సోనియా సోనియా". ఆ పాట లింక్ క్రింద ఇస్తున్నాను. అది వింటూ ఇది చదివి ఎలా వుందో చెప్పండి.


రక్షకుడు సినిమాలో పాట లింక్ 
సోనియా సోనియా 

సోనియా...నీ దయ
సోనియా
నీ దయ

సోనియా సోనియా 
దేవతంటి సోనియా
పెరుగుతోందే రాజకీయ పోరు
పార్టి ముందు రెండు రూట్లు
బాబుదొకటి, అమ్మదొకటి
రెండిట్లో ఏది నాకు బెటరు?

సంటైమ్స్ బాబే వేస్టు
సంటైమ్స్ నేనో ఘోస్టు 
ఇచ్చే వరములు చూసి
తీస్కో ఏదో రూటు                        || సోనియా సోనియా ||

ఓ పదవి ఇచ్చే పార్టీలో దూకి
జండా పీకేస్తే అది ఫేటు 
ఆంటోని మాట బెటరంటూ నమ్మి
నీ శరణు జొస్తే అది గ్రేటు 

పదవులు కోరుకునే వెధవలమల్లె 
నా ఫ్యామిలినంతా
స్తుతి చేయడమే గ్రేటు
మిగతా నాయకుల దారిని పట్టి
నా భజనలు చేస్తూ
వెయిట్ చేయడమే ఫేటు 

నీ పార్టి లోని బంటును నేనై 
పదవిచ్చే దాక భజనే చెయనా
సంచులతో డబ్బుల్ నీ దోసిట పోసి
సీయం పోస్టయినా కొట్టకపోనా

పదవొచ్చే పార్టీలో దూకేస్తా అమ్మడూ 

సోనియా సోనియా 
దేవతంటి సోనియా
రెండిట్లో ఏది నాకు బెటరు?

జనమంతా వార్నీ 
అనుకుంటూ చూసి
ఖాండ్రించి నా పై 
ఉమ్మేస్తుంటే

కాంగ్రేసు మడిసై
నువ్విచ్చే పదవే
ఆ తిట్లు చీవాట్లు
మరపిస్తుంటే

రాజకీయాల్లో విలువలు లేవే
ఒక పధ్ధతి లేదే
జనమేమంటే ఏం లే!

సియం చేయకుంటే ఏడవరాదు 
నువ్వు "నో" అనరాదు
ఏదో టైం లో చూస్తాలే 

కాంగ్రేసు చెప్పింది బానేఉందే
ఏపిలో పరువుతో పని ఏముందే 
సొనియమ్మ చెప్పాక తిరుగే ఉందా
పార్టీని కలపడమే లాభం కాదా

ఏపిని నడిపేది నాకంటి చూపేగా...

సోనియా...నీ దయ
సోనియా
నీ దయ 

ఇది నచ్చితే నా పాత పేరడీల మీద కూడా ఓ లుక్కేయండి (లేబుల్స్ సెక్షన్ లో పేరడీలు అని ఉంది)


(చిరంజీవి  వీరాభిమానులూ.. దీన్ని కేవలం సరదాగానే తీసుకోండి)

Sunday, January 2, 2011

జనవరి ఐదవ తేదీ రాత్రి సమైక్య, వేర్పాటు వాదుల ఆలోచన ఎలా ఉంటుందన్న చిన్న చిలిపి ఆలోచనతో - ఒక పేరడీ

మంచి మిత్రులు సినిమాలో "ఎన్నాళ్ళో వేచిన ఉదయం" నాకు చాలా ఇష్టమయిన పాటల్లో ఒకటి. రేపు జనవరి ఆరో తేదీన శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్ మన ముందుకు రానున్న తరుణంలో ఐదవ తేదీ రాత్రి సమైక్య,వేర్పాటు వాదుల  ఆలోచనలు ఏ విధంగా ఉంటాయన్న చిలిపి ఆలోచనతో ఏ పాట రాయడం జరిగింది. ఆ సినిమాలో ఇద్దరు మిత్రులు ఒకరినొకరు కలుసుకొనేటప్పుడు తమ ఆలోచనల్లో వచ్చిన మార్పు గురించి అవతలివాళ్ళకి చెప్పాలనే ఆత్రుతతో తెల్లరడం గురించి ఎదురుచూస్తూ ఉంటారని మీకు తెలిసే ఉంటుంది. అలాగే ఆరవ తేదీ గురించి సమైక్య, విభజన వాదులు తమ ఆలోచనలు మార్చుకుంటే ఎలా ఉంటుందనేదే ఈ పేరడీ కి స్ఫూర్తి. ఇంత సూపర్ హిట్ పాట  ట్యూన్ మీకు తెలియదని కాదు. అయినా ఏదో నా తృప్తి కొద్దీ పాట లింక్ కింద ఇస్తున్నాను. ట్యూన్ కి తగ్గట్టు పేరడీ ఉందా లేదా అనేది మీరే చెప్పాలి. 


http://www.box.net/shared/e3f7u0du1p



ఎన్నాళ్ళో వేచిన ఉదయం
ఈనాడే ఎదురవుతుంటే
ఎన్నాళ్ళో వేచిన ఉదయం
ఈనాడే ఎదురవుతుంటే 

ఇన్నినాళ్ళు దాచిన సత్యం
ఉబికి ఉబికి వస్తుంటే 
ఇంకా తెలవారదేమి 
ఈ సస్పెన్స్ విడిపోదేమి?
ఇంకా తెలవారదేమి 
ఈ సస్పెన్స్ విడిపోదేమి?

ఒకటిగా నిలిచిన జాతిని 
ఏ తంత్రం ఏమీ చేయదని 
ఐక్యత కోరే వారికి
ఏనాటికి ముప్పే రాదనీ

ఐక్యత కోరే వారికి
ఏనాటికి ముప్పే రాదనీ

నేనెరిగిన సమైక్య వాదం
నీతో చెప్పాలని వస్తే 
ఇంకా తెలవారదేమి 
ఈ సస్పెన్స్ విడిపోదేమి?

నేతలు తిరిగే జాతిలో 
ఏ ఐక్యత పనికి రాదనీ
ప్రగతిని కోరే స్టేటులో 
తమ ప్రాంత స్వార్ధమే మేలని 
నేచూసిన విభజనిజం
నీతో చెప్పాలని వస్తే 

ఇంకా తెలవారదేమి 
ఈ సస్పెన్స్ విడిపోదేమి?
ఇంకా తెలవారదేమి 
ఈ సస్పెన్స్ విడిపోదేమి?

"విభజనిజం" అనే కొత్త పదం పుట్టించాల్సి వచ్చింది. దీనికి వీరతాడు వేసినా (ఎవరూ పుట్టించకుండా కొత్త పదాలు ఎలా పుడతాయి - మాయా బజార్ లో ఘటోత్కచుడు), భాషను ఖూనీ చేసానని తిట్టుకున్నామీ  ఇష్టం. ఈ ప్రయత్నం నచ్చితే ఒక చిన్న కామెంట్ తో భుజం తట్టండి చాలు!!!! 





Wednesday, July 7, 2010

శిలలపై శిల్పాలు చెక్కినారు....పేరడీ - లీలామోహనం బ్లాగు "విజయమోహన్" గారికి ధన్యవాదాలతో

ఈ వేళ చిలమకూరి విజయమోహన్ గారి లీలా మోహనం బ్లాగులో ఈ పాటకు ఆయన రాసిన పేరడీ చదివాను. సరే ఆయన భావాలకే నాదయిన టచ్ ఇద్దామనిపించింది అందుకే పతనమవుతున్న విలువలపై నా బ్లాగులో మరొక పేరడీ. పాట మీకు తెలిసినా ఇక్కడ లింక్ ఇస్తున్నాను మరొక సారి వింటూ ఆ ట్యూన్ తో పాటు ఈ పదాలు చదువుకోండి. మీ అభిప్రాయాలు చెప్పడం మరచిపోకండి.


అహో ఆంధ్ర/ రాయలసీమ/ తెలంగాణా భోజా*
శ్రీ కృష్ణ దేవరాయా
తెలుగుజాతి ఘనకీర్తి నిర్మాణ తేజో విరాజా
ఈ రాష్ట్ర దుస్థితికి సాక్ష్యంగ నిలిచావయా

విలువలే తుంగలో తొక్కినారు
విలువలే తుంగలో తొక్కినారు
మనవాళ్ళు స్టేటు కే అపకీర్తి తెచ్చినారు
విలువలే తుంగలో తొక్కినారు

అవినీతి ఎరుగని వారికైనా
అవినీతి ఎరుగని వారికైనా
వలవేసి ఊబిలో లాగేటి రీతిగా 
విలువలే తుంగలో తొక్కినారు

ఒకవైపు   రాష్ట్రాన్ని దోచుకొను ఘనులు
ఒక ప్రక్క విసిగించు వేర్పాటు జోరు
ఒక చెంప పదవికై  వర్గ భేదాలు 
నరకమే అనిపించు రాష్ట్రానికొచ్చాము

ప్రగతి లేదని నీవు కలతపడవలదు 
ప్రగతి లేదని నీవు కలతపడవలదు 
ఈ స్థితిని ప్రగతిగా తలచుకొని ఏడు 

విలువలే తుంగలో తొక్కినారు
మనవాళ్ళు స్టేటు కే అపకీర్తి తెచ్చినారు
విలువలే తుంగలో తొక్కినారు

ఏడు కొండలపైన వెంకన్న గుడిలోన
చోరచేష్టల తోటి పరువంత పోగా
రాతి దేవుళ్లకే చేతనత్వము కలిగి 
హరిహరీ ఖర్మంటు తలపట్టుకేడ్వగా

అమ్మజపమందుకుని చెత్త నాయకులు 
అమ్మజపమందుకుని చెత్త నాయకులు 
పదవి దక్కాలని మొక్కుకున్నారని 

విలువలే తుంగలో తొక్కినారు
మనవాళ్ళు స్టేటు కే అపకీర్తి తెచ్చినారు
విలువలే తుంగలో తొక్కినారు

పదవులే పోయినా
అధికారమూడినా
కాలాలు మారినా
కాలమ్ము మూడినా
నేతలే దనుజులై మట్టిపాల్జేసినా 

చెదరని కదలని శిల్పాల వలెనె 
మనము  ఈ రాష్ట్రాన కష్టాల, నష్టాల బ్రతుకుతున్నాం బ్రదర్!!
నిజమురా సోదరా 

లీలామోహనం బ్లాగు "విజయమోహన్" గారికి ధన్యవాదాలతో 

*(ఎందుకొచ్చిన గొడవ! ఒట్టి "ఆంధ్ర భోజా" అనే అన్నానంటే ఏ వేర్పాటు వాదయినా నా బ్లాగు బ్లాక్ చెయ్యమన్నా అనగలరు. ఎవరి ఏరియాను బట్టి వాళ్ళు చదువుకోండి.)

పన్లోపని నా పాత పోస్టుల్లోని పేరడీ పాటలపై కూడా ఓ లుక్కేయండి.  
రింగారింగా పాటకు  పేరడీ           http://blogavadgeetha.blogspot.com/2009/12/blog-post_333.html
నిదురించే తోటలోకి పాటకు పేరడీ  http://blogavadgeetha.blogspot.com/2009/12/blog-post_17.html
మాయా బజార్ లో తెలంగాణా మాయా శశి రేఖ  - అహ నా పెళ్ళంట పాట పేరడీ 
http://blogavadgeetha.blogspot.com/2010/01/blog-post_12.html
మహాకవుల తెలంగాణం - ఒక పేరడీ ప్రయత్నం 
http://blogavadgeetha.blogspot.com/2009/12/blog-post_9543.html

Tuesday, January 12, 2010

మాయాబజార్ లో తెలంగాణా మాయా శశిరేఖ.......అహనా పెళ్ళంట....తెలం"గానం"

తెలంగాణా వాదం ఇప్పుడు పాపం కళలని కూడా వదలట్లేదు. అదుర్స్ ని అడ్డుకుంటాం అంటూ ఒక పక్క తెలంగాణా జేఏసిలు, కెసిఆర్ కూతురు కవిత వీరంగాలేస్తుంటే...మరోపక్క తెలంగాణా కవి (అదేం బిరుదో???) అని తనకి తానే చెప్పేసుకునే దేశపతి శ్రీనివాస్ ఆంధ్ర వాళ్ళ సినిమాలొద్దు...అమితాబ్..షారుఖ్ సినిమాలు చూదాం అని అల్టిమేటం జారీచేసినట్టు ఎక్కడో చదివా. ఇవన్నీ చూసి రేపు రంగుల్లో మళ్లీ మనముందుకు రాబోతున్న అపురూపమయిన మాయాబజార్ ని అందులో ఒక్క పాత్ర తెలంగాణా యాసలో మాట్లాడలేదు కాబట్టి..ఆ సినిమాని అడ్డుకుంటాం అనయినా అనేస్తారు అనిపిస్తోంది. అందుకే సరదాగా ఆ సినిమాలో "అహనా పెళ్ళంట " పాటని తెలంగాణా యాసలో పెడితే ఎలా ఉంటుందో అన్న ఆలోచనతో చేసిన పేరడీ ఇది. ఇది పూర్తిగా తెలంగాణా యాసో కాదో నాకు తెలియదు. తప్పులుంటే సరిదిద్దండి. మాయ బజార్ ని కించపరిచే ఆలోచన, సాహసం నాకు ఏ కోశానా లేవని, ఇది కేవలం వెర్రితలలేస్తున్న ప్రాంతీయోన్మాదం మీద నా నిరసన ప్రయత్నంగానే  గ్రహించి మీ అభిప్రాయాలు తెలుపగలరు. మీకోసం ఆ సినిమాలో అసలు పాట లింక్ కూడా ఇస్తున్నాను. ఆ ట్యూన్ వింటూ ఇది చదవండి.

అసలు "అహనా పెళ్ళంట పాట"
అహనా పెళ్ళంట...అసలు పాట లింక్ ...ఇక్కడ క్లిక్ చేయండి

(ఈ పాటను మీ మిత్రులకి మెయిల్ లోకూడా పంపించుకునేందుకు వీలుగా ఇమేజ్ ఫార్మాట్ లో ఇస్తున్నాను. క్లిక్ చేస్తే వేరే పేజి లో ఓపెన్ అవుతుంది .పాట కాస్త పెద్దది కాబట్టి రెండు పేజీలు పట్టింది..పండుగ చేసుకోండి. ఈ ప్రయత్నం కనుక మీకు నచ్చితే పన్లోపనిగా నా పాత పోస్టుల్లోని "రింగా రింగా", "నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది" పాటలకు ఇలాంటి పేరడీలు చూసి మీ అభిప్రాయం తెలియజేయండి. ఆ పోస్టుల లింకులు రింగా రింగా  - http://blogavadgeetha.blogspot.com/2009/12/blog-post_333.html , నిదురించే తోటలోకి  - http://blogavadgeetha.blogspot.com/2009/12/blog-post_17.html )





Thursday, December 17, 2009

'నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది' కి సమైక్య వాది పేరడీ (గుంటూరు శేషేంద్ర శర్మ, మన "బాపు" లకు క్షమార్పణలతో)

"నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది" ఇది నాకు చాలా చాలా చాలా ఇష్టమైన పాట. తెలుగు వాళ్ళు గర్వించదగ్గ గొప్ప కవి శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గారు రాసిన ఒకే ఒక్క సినిమా పాట ఇది. పాటలో ఫీల్ ను అలాగే తెరకెక్కించిన మన "బాపు" గురించి ప్రత్యేకంగా చెప్పాలా? అలాంటి ఆ పాటను ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సమైక్య వాది పేరడి గా పాడుకుంటే ఎలా ఉంటుందన్న ఊహతో ఇది రాయడం జరిగింది. ఇది ఎవర్నీ నొప్పించేందుకు కాదని మనవి. (గుంటూరు శేషేంద్ర శర్మ గారికి, మన బాపు కు క్షమార్పణలతో..)
మీ సదుపాయం కోసం ఆ పాట లింక్ ఇక్కడ ఇస్తున్నాను.  ఆ ట్యూన్ వింటూ ఇది చదవండి. బావుంటే ఓ కామెంట్ తో భుజం తట్టండి. మీకు నచ్చకపోయినా మొహమాటం లేకుండా ఆ ముక్క చెప్పేయండి.
నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది





Saturday, December 12, 2009

సమైక్య వాది - "రింగా రింగా' పేరడీ

ఈ మధ్య "రింగా రింగా' పాట ఎంత పాపులర్ అయిందో మీకందరికీ తెలుసు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఒక సమైక్య వాది ఆ పాటను పేరడీ చేసి తన మనసులో భావాలు చెప్తే ఎలా ఉంటుందో ఊహించి చేసిన చిన్న ప్రయత్నం. ట్యూన్ కోసం ఒరిజినల్ ఆడియో సీడీ లో పాట లింక్ గా ఇస్తున్నాను. అది వింటూ ఇది చదువుకోండి. (లిరిక్స్ ఇమేజ్ ఫైల్ ఫార్మాట్ లో ఇచ్చాను, క్లిక్ చేస్తే వేరే పేజి లో ఓపెన్ అవుతుంది కాబట్టి జూమ్ చేసి చదువుకోవచ్చు)
RINGA RINGA SONG





























Monday, December 7, 2009

మహాకవుల తెలం"గానం"

తెలుగు సాహితీ దిగ్గజాలు ఇప్పుడు బ్రతికుంటే రగులుతున్న తెలంగాణ పట్ల ఎలా స్పందిస్తారోనన్న చిన్న ఊహ. ఛందస్సు పట్టింపులు లేకుండా చదవండి.

మీ సదుపాయం కోసం ఈ పోస్ట్ ఇమేజ్ ఫార్మాట్ లో అందిస్తున్నాను. క్లిక్ చేస్తే వేరే పక్క పేజి లో ఓపెన్ అవుతుంది.


Friday, December 4, 2009

పల్నాటి పా ఫోటో

పల్నాటి పా స్టొరీ మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఈ సినిమాలో బాలకృష్ణ గెటప్ ఇలా ఉంటుందన్నమాట.


(అడగంగానే చేసి ఇచ్చిన నా ఫ్రెండ్ శ్రీకాంత్ కి బోల్డన్ని థాంకులు)


Saturday, November 28, 2009

పల్నాటి పా - పార్ట్ 2

మీకు CONVENIENT గా ఉండాలని ఈ ఫైల్ ఇమేజ్ ఫార్మాట్ లో పోస్ట్ చేశాను. క్లిక్ చేస్తే సెపరేట్ పేజీలో ఓపెన్ అవుతుంది.



Friday, November 27, 2009

పల్నాటి పా - పార్ట్ 1

మీకు CONVENIENT గా ఉండాలని ఈ ఫైల్ ఇమేజ్ ఫార్మాట్ లో పేస్ట్ చేసాను. టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజిలో  ఓపెన్ అవుతుంది.