ఏంటో అటు కోస్తా, రాయలసీమలలో ...ఇటు తెలంగాణా లో రోజుకొక్క జేఏసి పుట్టుకొస్తోంది. ప్రతి యూనివర్సిటీకొక జేఏసి, లాయర్లకి, డాక్టర్లకి, యాక్టర్లకి, కులానికి ఒకటి, మతానికి ఒకటి, పార్టీకి ఒకటి, ప్రాంతానికి ఒకటి, వూరికొకటి, చెట్టుకొకటి, పుట్టకొకటి చొప్పున జేఏసి లు..వాటిలో మళ్ళీ వర్గ జేఏసి లు పుట్టుకొస్తున్నపుడు ఇవన్నీ చూసి ఏం? మన బ్లాగ్గర్స్ ఎందులో తీసిపోయారని అనిపించి బ్లాగ్గర్స్ జేఏసి ప్రారంభిద్దామని డిసైడ్ అయిపోయా. దీని కార్యవర్గం లో ఎవరెవరు ఉండాలో మీరే సలహా ఇవ్వండి.
అలాకాదూ....మళ్ళీ ఇందులో కూడా మహిళా బ్లాగ్గర్లు, పురుష బ్లాగ్గర్లు, బాల బ్లాగ్గర్లు, వృద్ధ బ్లాగ్గర్లు, తెలంగాణా బ్లాగ్గర్లు, ఆంధ్ర బ్లాగ్గర్లు, ఉత్తరాంధ్ర బ్లాగ్గర్లు, రాయలసీమ బ్లాగ్గర్లు, ప్రవాసాంధ్ర బ్లాగ్గర్లు, బ్లాగ్ స్పాట్ బ్లాగ్గర్లు, వర్డ్ ప్రెస్ బ్లాగ్గర్లు ఇంకా నానా రకాల బ్లాగ్గర్ల విడివిడి జేఏసి లు ఉండాలంటారా....మీ గొడవ మీరు పడండి...నేను మాత్రం నా స్వంత జేఏసి ప్రారంభిన్చేసుకుంటా....వద్దామనుకున్నా వాళ్ళు రావచ్చు.
ఇంతకీ జేఏసి లక్ష్యం ఏంటి అంటారా?.....ఏమో ఇప్పటి దాకా ఉన్న ఏ జేఏసి కి మాత్రం వాళ్ళ లక్ష్యం ఖచ్చితం గా తెలిసి ఏడిసింది కనుక...
(నాకు మొదటి కామెంట్ చేసిన వాళ్లకి నా జేఏసి కన్వీనర్ పదవి ఇచ్చేస్తానోచ్!!!!!! త్వరపడండి)