అసలైతే ఈ ఆడియో మీతో పంచుకోకూడదు అనుకునేంత కోపం వచ్చేసింది నాకు. ఎందుకంటే "ఆవిడ ఈ భూమ్మీద సంగీతం ప్రాక్టీసు చేసుకోడానికి వచ్చిన సరస్వతీ దేవి " అంటూ ఆవిడ నటించిన తొలి హిందీ సినిమా "మీరా" పాట వీడియోలతో నేను డిశంబర్ ఇరవై నాల్గున పోస్ట్ పెడితే కేవలం మూడంటే మూడే కామెంట్స్ వచ్చాయి (శిశిర గారు, సత్యసాయి కొవ్వలి గారు , సంతోష్ గారు) పోనీ అలా అని ఎవరూ చూడలేదు అనుకుందామా ఇప్పటికి దాదాపు యాభై మంది ఆ క్లిపింగ్స్ ని డౌన్లోడ్ చేసుకున్నారు. ఇక ఆవిడ పాడిన అన్నమయ్య పాటలతో నేను పెట్టిన పోస్ట్ లకి ఒక్కటంటే ఒక్కే కామెంట్ (మ్యాడీ గారు) కానీ ఒక నలభై మందిదాకా డౌన్లోడ్ చేసుకున్నారు. పోనీ కామెంట్ పెట్టడానికి బద్దకిస్తున్నారులే అని సరిపెట్టుకుందామంటే అదే ఏ కె.సి ఆర్ మీదో, తెలంగాణా మీదో పోస్ట్ పెడితే ఇహ చూస్కోండి తెగ కామెంట్స్..." మాయా బజార్ లో అహ నా పెళ్ళంట" పాట పారడి కి పాతికకు పైగా వచ్చిన కామెంట్స్ అదే "ఎమ్మెస్ సుబ్బలక్ష్మి" పాట అంటే ఎందుకు రావటం లేదు అనేది నాకు అర్ధం కావటం లేదు.
(ఇదేదో మిమ్మల్ని కామెంట్ చేస్తారా చస్తారా అని బెదిరించేందుకు కాదు :) ......నాకు కలుక్కుమంది ...చెప్పానంతే)
సరే ఆ గొడవ వదిలేసి ఈ పాట ఎంజాయ్ చెయ్యండి. ఇది అరవై ఆరు లో ఐక్య రాజ్య సమితిలో ఎమ్మెస్ కచేరి లైవ్ రికార్డింగ్ ఆడియో....ఇది మీకు నచ్చితే ఆ మొత్తం కచేరి ఆడియో క్లిప్ లు పోస్ట్ చేస్తాను. లింక్ కింద ఇస్తున్నాను