అన్నట్టు మర్చేపోయాను ఈ వేళ గొప్పెష్ట్టు సింగర్ మన ఘంటసాల గారి హ్యాపీ బర్త్ డే! అంచేత కుసింత వెరైటీగా ఉండాలని ఆయన పాడిన మొదటి సినిమా పాట (స్వర్గ సీమ సినిమాలో భానుమతితో డ్యూయట్), ఆల్ ఇండియా రేడియో కి ఆయనిచ్చిన చివరి ఇంటర్వ్యూ మీకు వినిపిద్దామనిపించింది (శభాష్ శభాష్).
బ్లాగ్ చూసి కామెంట్స్ చేయకుండా వెళితే వచ్చే జన్మలో దూరదర్శన్ యాంకర్ గా పుడతారు ........ఇదే నా శాపం.
Friday, December 4, 2009
పల్నాటి పా ఫోటో
పల్నాటి పా స్టొరీ మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఈ సినిమాలో బాలకృష్ణ గెటప్ ఇలా ఉంటుందన్నమాట.
(అడగంగానే చేసి ఇచ్చిన నా ఫ్రెండ్ శ్రీకాంత్ కి బోల్డన్ని థాంకులు)
Labels:
పేరడీలు
వీను(ణ)ల విందు...
వీణ వినడానికి చాలా బావుంటుంది కదా! చాలా low volume లో వింటూంటే భలే ఉంటుంది. ఒక్క వీణే అలా అనిపిస్తే ఒక్కసారిగా 50 వీణలతో orchestra చేస్తే ..................దీన్నే పూరి జగన్నాధ్ మాటల్లో చెప్పాలంటే "దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవడం' అనచ్చేమో. famous వీణ విద్వాంసుడు చిట్టిబాబు చేసిన "టెంపుల్ బెల్స్" ఆల్బం (ఎప్పటినుంచో వెతుకుతుంటే ఇన్నాళ్ళకి దొరికింది) మీకోసం పోస్ట్ చేస్తున్నా. ఇది వింటూ కళ్ళుమూసుకుని ఏ 12-13 శతాబ్దంనాటి గుడిలోనో సాయంత్రం చల్లగాలిలో మెల్లిగా నడుస్తున్నట్టు ఊహించుకోండి. కళ్ళు తెరిచాక కొత్త ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది. (ఏమో నాకైతే అలా అనిపించింది మరి ) . ట్రై చేసి చూడండి.
(కామెంట్స్ పోస్ట్ చేయడం మర్చిపోకండి)
Labels:
అరుదైనవి...అపురూపమైనవి
Subscribe to:
Posts (Atom)