ఇన్నాళ్ళు ఎవడికి నచ్చినట్టు వాడు తనమీద కోపాన్ని చూపుతుంటే మూగగా భరించిన బస్సు ఇప్పుడు తనవంతంటోంది. ఆర్టీసీ అంటే R (రాయల సీమ) T (తెలంగాణా) C (కోస్టల్ ఆంధ్ర) అన్నట్టు అందరికీ సమానంగా ఇన్నాళ్ళు సేవలందించి, మన కోపాలు, తాపాలు భరించిన ఎర్రబస్సు కళ్ళెర్ర చేసింది. తన కోపమే తన శత్రువు అన్న మాట ఇప్పటికయినా ఆందోళన కారులకు అర్ధం అయితే బస్సుల మీద ప్రతాపం చూపడం ఆపుతారని ఆశిద్దాం. లేదా ఇంకో సారి బస్సు ఛార్జీల వడ్డింపుకు సిద్ధపడదాం.
నేను ఈ ఛార్జీల పెంపును సమర్ధిస్తున్నాను. (ఎందుకంటే అటు కార్మికుల జీతాలూ పెంచి, ఇటు ఆందోళనకారుల ఆగ్రహాలూ చూసిన ఎర్ర బస్సు బ్రతికి బట్టకట్టాలంటే ఈ పెంపు అవసరం అని నేను భావిస్తున్నాను..)