ఈ మధ్యే తెలిసిందీ విషయం. 1957 లో వచ్చిన మాయా బజార్ లో నట యశస్వి మన యస్వీ రంగారావు ప్రాణం పోసిన "వివాహ భోజనంబు' పాటకు స్ఫూర్తి (ఎందుకంటే కాపీ అనుకోడానికి మనసొప్పదు) 1922 లో వచ్చిన "ద లాఫింగ్ పోలీస్ మేన్ ' అనే ఇంగ్లిష్ పాటట. ఈపాట అప్పట్లో బిబిసి లో మారుమ్రోగేదట. పాట విన్నాక ఏమో కావచ్చేమో అనిపించింది. ఒక సారి మీరూ విని చూడండి. మీకోసం ఆ రెండు పాటల లింకులూ క్రింద ఇస్తున్నాను.
(ఈ పోస్ట్ మీకు నచ్చితే ఓ కామెంట్ వేస్కోండి :) )