బ్లాగర్లలో, బజ్జర్లలో బ్లాగ్లోకం మీద ఎంత పరిజ్ఞానం ఉందో తెలుసుకునేందుకు బ్లాగర్స్ సర్వీస్ కమీషన్ పరీక్ష ఉంటే ఎలా ఉంటుందో అన్న ఊహతో ఈ ప్రశ్నా పత్రం రూపొందించబడింది. ఆసక్తి గల అభ్యర్ధులు కామెంట్లు పెట్టి హాజరవవచ్చు. ఈ రోజు జరిగే పేపర్ 1 (50 మార్కులు) మరియు రేపు జరిగే పేపర్ 2 (20 మార్కులు) లలో ఉత్తీర్ణులయిన వారికి ఇంటర్వ్యూలు (30 మార్కులు) నిర్వహించబడతాయి.
ప్రశ్న 1. తెలుగు బ్లాగర్ల పోస్టులలో అజ్ఞాతల పాత్ర సోదాహరణముగా వివరింపుము
(అన్ని ప్రశ్నలకూ జవాబులు చచ్చినట్టు రాసి తీరవలెను. ఇది సరదా పోస్టే కాబట్టి ఎవరూ ఫీలవకూడదని తెలియజేయబడినది)
(ప్రతి ప్రశ్నకూ 5 మార్కులు)
ప్రశ్న 2. మధ్యందిన "మార్తాండునిలా" చెలరేగుతూ అన్ని బ్లాగులలో అసందర్భ కామెంట్లు పెట్టు బ్లాగర్ పేరేమి? వారి చిత్ర విచిత్ర చేష్టలను క్లుప్తంగా వివరించుము
ప్రశ్న 3. తెలుగు బ్లాగులకు గల ఐదు సంకలినుల పేర్లు తెలుపుము
ప్రశ్న 4. బ్లాగుల్లో "సెగట్రీ" అనగా ఎవరు? వారికి ఆ పేరు ఎట్లు వచ్చినది
ప్రశ్న 5. తెలుగు బ్లాగులలో మీకు తెలిసిన ఐదుగురు మధ్య తరగతి (రెండు బ్లాగులు కలవారు), ధనిక (రెండు కన్నా ఎక్కువ బ్లాగులు కలవారు) బ్లాగర్ల మరియు వారి బ్లాగుల పేర్లు చెప్పుము
ప్రశ్న 6. "నవ్వితే నవ్వండి" బ్లాగరు ఎవరు? వారి ప్రాశస్త్యం గురించి పది వాక్యాలకు మించకుండా వివరించుడి
ప్రశ్న 7. ఈ క్రింది బ్లాగులు వాటి యాజమాన బ్లాగర్ల ను జతపరచుడి
మనసులో మాట - ఫణిబాబు గారు
మాయా శశిరేఖ - తృష్ణ గారు
బాతాఖానీ లక్ష్మీఫణి కబుర్లు - భరద్వాజ్ గారు
తృష్ణ - ఆ. సౌమ్య గారు
రౌడీ రాజ్యం - సుజాత గారు
ప్రశ్న 8. బ్లాగ్లోకం లో మీరు చూసిన ఐదు ఉత్తమ బ్లాగులు, ఐదు చెత్త బ్లాగులు కారణాలతో సహా వివరించండి
ప్రశ్న 9 : బజ్జుకు , బ్లాగుకు గల తేడాలను వివరించుము
ప్రశ్న 10 : బ్లాగర్లలో ప్రవాస తెలుగు బ్లాగర్ల పాత్రను వివరింపుము. మీకు తెలిసిన ఐదుగురు ప్రవాస బ్లాగర్ల పేర్లను తెలుపుము
(అన్ని ప్రశ్నలకూ జవాబులు చచ్చినట్టు రాసి తీరవలెను. ఇది సరదా పోస్టే కాబట్టి ఎవరూ ఫీలవకూడదని తెలియజేయబడినది)