ఈ వేళ చిలమకూరి విజయమోహన్ గారి లీలా మోహనం బ్లాగులో ఈ పాటకు ఆయన రాసిన పేరడీ చదివాను. సరే ఆయన భావాలకే నాదయిన టచ్ ఇద్దామనిపించింది అందుకే పతనమవుతున్న విలువలపై నా బ్లాగులో మరొక పేరడీ. పాట మీకు తెలిసినా ఇక్కడ లింక్ ఇస్తున్నాను మరొక సారి వింటూ ఆ ట్యూన్ తో పాటు ఈ పదాలు చదువుకోండి. మీ అభిప్రాయాలు చెప్పడం మరచిపోకండి.
అహో ఆంధ్ర/ రాయలసీమ/ తెలంగాణా భోజా*
శ్రీ కృష్ణ దేవరాయా
తెలుగుజాతి ఘనకీర్తి నిర్మాణ తేజో విరాజా
ఈ రాష్ట్ర దుస్థితికి సాక్ష్యంగ నిలిచావయా
విలువలే తుంగలో తొక్కినారు
విలువలే తుంగలో తొక్కినారు
మనవాళ్ళు స్టేటు కే అపకీర్తి తెచ్చినారు
విలువలే తుంగలో తొక్కినారు
అవినీతి ఎరుగని వారికైనా
అవినీతి ఎరుగని వారికైనా
వలవేసి ఊబిలో లాగేటి రీతిగా
విలువలే తుంగలో తొక్కినారు
ఒకవైపు రాష్ట్రాన్ని దోచుకొను ఘనులు
ఒక ప్రక్క విసిగించు వేర్పాటు జోరు
ఒక చెంప పదవికై వర్గ భేదాలు
నరకమే అనిపించు రాష్ట్రానికొచ్చాము
ప్రగతి లేదని నీవు కలతపడవలదు
ప్రగతి లేదని నీవు కలతపడవలదు
ఈ స్థితిని ప్రగతిగా తలచుకొని ఏడు
విలువలే తుంగలో తొక్కినారు
మనవాళ్ళు స్టేటు కే అపకీర్తి తెచ్చినారు
విలువలే తుంగలో తొక్కినారు
ఏడు కొండలపైన వెంకన్న గుడిలోన
చోరచేష్టల తోటి పరువంత పోగా
రాతి దేవుళ్లకే చేతనత్వము కలిగి
హరిహరీ ఖర్మంటు తలపట్టుకేడ్వగా
అమ్మజపమందుకుని చెత్త నాయకులు
అమ్మజపమందుకుని చెత్త నాయకులు
పదవి దక్కాలని మొక్కుకున్నారని
విలువలే తుంగలో తొక్కినారు
మనవాళ్ళు స్టేటు కే అపకీర్తి తెచ్చినారు
విలువలే తుంగలో తొక్కినారు
పదవులే పోయినా
అధికారమూడినా
కాలాలు మారినా
కాలమ్ము మూడినా
నేతలే దనుజులై మట్టిపాల్జేసినా
చెదరని కదలని శిల్పాల వలెనె
మనము ఈ రాష్ట్రాన కష్టాల, నష్టాల బ్రతుకుతున్నాం బ్రదర్!!
నిజమురా సోదరా
లీలామోహనం బ్లాగు "విజయమోహన్" గారికి ధన్యవాదాలతో
*(ఎందుకొచ్చిన గొడవ! ఒట్టి "ఆంధ్ర భోజా" అనే అన్నానంటే ఏ వేర్పాటు వాదయినా నా బ్లాగు బ్లాక్ చెయ్యమన్నా అనగలరు. ఎవరి ఏరియాను బట్టి వాళ్ళు చదువుకోండి.)
పన్లోపని నా పాత పోస్టుల్లోని పేరడీ పాటలపై కూడా ఓ లుక్కేయండి.