"నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది" ఇది నాకు చాలా చాలా చాలా ఇష్టమైన పాట. తెలుగు వాళ్ళు గర్వించదగ్గ గొప్ప కవి శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గారు రాసిన ఒకే ఒక్క సినిమా పాట ఇది. పాటలో ఫీల్ ను అలాగే తెరకెక్కించిన మన "బాపు" గురించి ప్రత్యేకంగా చెప్పాలా? అలాంటి ఆ పాటను ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సమైక్య వాది పేరడి గా పాడుకుంటే ఎలా ఉంటుందన్న ఊహతో ఇది రాయడం జరిగింది. ఇది ఎవర్నీ నొప్పించేందుకు కాదని మనవి. (గుంటూరు శేషేంద్ర శర్మ గారికి, మన బాపు కు క్షమార్పణలతో..)
మీ సదుపాయం కోసం ఆ పాట లింక్ ఇక్కడ ఇస్తున్నాను. ఆ ట్యూన్ వింటూ ఇది చదవండి. బావుంటే ఓ కామెంట్ తో భుజం తట్టండి. మీకు నచ్చకపోయినా మొహమాటం లేకుండా ఆ ముక్క చెప్పేయండి.
నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది