కుర్చీలు విరిగి పొతే
కూర్చోడం మాననట్టు గొప్ప రచనలన్
కూర్చే శక్తి నశిస్తే
చేర్చదగు నొకింత చెత్త సిరిసిరి మువ్వా!
ఖగరాట్ కృషి ఫలితంగా
పొగాకు భూలోకమందు పుట్టెను గానీ
పొగచుట్టలెన్ని అయినను
సిగరెట్టుకు సాటిరావు సిరిసిరిమువ్వా!
పెసలో,బొబ్బర్లో, వే
రుసేనగలో విక్రయించి రూపాయలు బొ
క్కసమున కెక్కించడమా
సిసలైన కవిత్వ రచన సిరిసిరి మువ్వా!
ఎప్పుడు పడితే అప్పుడు
కప్పెడు కాఫీ నొసంగ గలిగిన సుజనుల్
చొప్పడిన ఊర నుండుము
చొప్పడకున్నట్టి ఊరు చొరకుము మువ్వా!
ఉగ్గేల త్రాగుబోతుకు?
ముగ్గేలా తాజమహలు మునివాకిటిలో?
విగ్గేలా కృష్ణ శాస్త్రికి ?
సిగ్గేలా భావకవికి సిరిసిరి మువ్వా!
మళ్ళీ ఇన్నాళ్ళకి ఇ
న్నేళ్ళకి పద్యాలు వ్రాయుటిది యెట్లన్నన్
పళ్ళూడిన ముసిలిది కు
చ్చిళ్ళన్ సవరించినట్టు సిరిసిరి మువ్వా!
మాస్కోకు వెళ్ళగలిగే
ఆస్కారము లేకపోయినప్పటికైనన్
విస్కీ సేవిస్తూనే
శ్రీ స్కీనై బ్రతుకగలను సిరిసిరి మువ్వా!
ఈ సందర్భంగా ఆయన కవిత్వం ఆయన నోటివెంటే వింటూ, చూడాలంటే "నేను శ్రీ శ్రీ ని చూశానోచ్ !!!!" అంటూ ఆయన వీడియోలను సేకరించి మీకోసం అందించిన నా పాత పోస్ట్ ఇదిగో ....ఒక సారి చూసేయండి.
http://blogavadgeetha.blogspot.com/2009/12/blog-post_15.html
(నచ్చితే ఆయనకి మనసులో విషెస్...నాకు బ్లాగ్ లో కామెంట్స్ మర్చిపోకండి)