వీటిని హైకూలు అనచ్చో లేదో నాకు తెలియదు. జస్ట్ రాయాలనిపించింది అంతే. నచ్చితే భుజం తట్టండి
౩౭
తెలంగాణా ఉద్యమం
జనాల కన్నా
జేఏసి లే ఎక్కువున్నాయి
౩౮
ఛానెల్లో చర్చలు
ఎప్పుడు చూసినా
అవే మొహాలు
౩౯
అతివృష్టి
ఎటుచూసినా నీళ్ళే
పొలంలో, రైతు కళ్ళలో
౪౦
గతేడాది పిల్లలకి
వేసవి శలవలతో పాటు
వేర్పాటు శలవలూ వచ్చాయి
౪౧
కమిటీ రిపోర్టిచ్చింది
ఏడాది క్రితం పరిస్థితికి
తీసుకొచ్చి వదిలేసింది
౪౨
శ్రీ కృష్ణ కమిటీ
కొండని తవ్వి
ఎలకనీ వదిలేసింది
౪౩
అందరికీ ఆమోదయోగ్యం
అంటే
ఎవరికీ అక్ఖర్లేదని అర్ధం
౪౪
ఎవరన్నారు
దేశం క్రీడల్లో వెనకుందని?
నేతలు జనాలతో ఆడుకోవట్లేదూ
౪౫
మార్కెట్ కెళ్లా
జేబు ఖాళీ అయి
సగం సంచి నిండింది
౪౬
డైలీ సీరియల్ హీరొయిన్
వీలునామాలో
తన పాత్ర మునిమనవరాలికి రాసింది
౪౭
మా ముత్తాతకి , శ్రీ శ్రీ కి
ఒక పోలికుంది
ఇద్దరూ కీర్తి శేషులే
౪౮
ఎవరో అడిగారు నా వయసెంతని
12045 డైలీ సీరియల్ ఎపిసోడ్లు
నా సమాధానం
౪౯
మా ఊరికి రైల్లో ప్రయాణం
రైలు ముందుకి
ఆలోచనలు వెనక్కి
౫౦
దేవతలకే కాదు మనకీ తెల్సు
అమృతం రుచి
కాపోతే మనం అమ్మచేతి వంట అంటాం
ఇంక చాలు మహాప్రభో అనుకుంటున్నారా? ఏదో మీ అభిమానం. ఈ సారికిలా కానిచ్చేయండి.