Sunday, July 11, 2010

రిపోర్టర్లు కావలెను - బల్లి శాస్త్రం, పుట్టుమచ్చల ఫలితాలు, చిలకజోస్యం వగైరాలలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత

నిన్న టివి నైన్ లో జగన్ కొత్త పార్టి పెడతాడా లేదా అని చిలక జోస్యం తో డిసైడ్ చెయ్యడం చూసి నాకు భలే చిరాకేసింది. అసలు ఈ మధ్య న్యూస్ చానెల్స్ మరీ న్యూమరాలజిస్ట్ లు , వాస్తు శాస్త్ర నిపుణులు, చివరాఖరికి రోడ్డుపక్క చిలక జోస్యం చెప్పేవాడిని కూడా స్టూడియో కి తీసుకొచ్చి క్రీడల దగ్గరనుంచి రాజకీయాలవరకు విశ్లేషిస్తుంటే ఛీ... మన జీవితం అనిపిస్తోంది. ఇక ఆ సోకాల్డ్ నిపుణులు చెప్పేవి కూడా భలే వెరైటీగా ఉంటాయిలెండి సైనా నెహ్వాల్ ఇన్ని టోర్నమెంట్లు వరుసగా గెలవడానికి కారణం ఆమె హార్డ్ వర్క్ కాక వాళ్ళింటి ఈశాన్యం వైపు గోడ కాస్త ఎత్తు పెంచినందుకు అని చెప్తారు, అసలు సచిన్ ఇంత మంచి ప్లేయర్ అవడానికి కారణం అతని పేరులో "టి" అనే అక్షరం ఉండడం వలెనే అని (వీళ్ళ మొహం టెండూల్కర్ అనేది వాళ్ళ ఇంటిపేరు అని వీళ్ళకి తెలిసినట్టు ఉండదు), సోనియా జాతకం లో ప్రధాని పదవి లేదని అందుకు కారణం ఆమె పేరులో "ఆర్" అనే అక్షరం లేదని (అందుకు సాక్ష్యంగా ఇప్పటివరకు ప్రధానమంత్రులుగా పనిచేసిన వారందరి పేర్లలో "ఆర్" ఉందని ఉదాహరణలు చూపిస్తారు ...మన్మోహన్ సింగ్ విషయం లో ఇది ఎందుకు పనిచేయలేదో...ఏమో బహుశా డాక్టర్ లో "ఆర్" ఉంది కదా అంటారేమో) ఇలా తిక్క తిక్క వాదనలు, దానికోసం గంటలు గంటలు చర్చలు.  ఇవన్నీ  చూసాక ఇకనుంచి న్యూస్ చానల్స్ లో సోది చెప్పుకునేవాళ్ళు, చిలకజోస్యం వాళ్ళు, బల్లిశాస్త్రం తెలిసినవాళ్ళు, పుట్టుమచ్చలు-వాటి ఫలితాలు  చెప్పేవారు , న్యూమరాలజిస్ట్ లు ఇలాంటి వాళ్ళే ఫుల్ టైం  రిపోర్టర్లుగా, విశ్లేషకులుగా వచ్చేసినా ఆశ్చర్యం లేదు. 

9 comments:

kodali srinivas said...

very good post

భావన said...

:-) :-)

మంచు said...

:-)

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

నాక్కూడా చెప్పు తీసి కొట్టాలనిపించింది తిక్క వెధవలని.

శిశిర said...

హ్హహ్హహ్హ..

వాత్సల్య said...

>>మన్మోహన్ సింగ్ విషయం లో ఇది ఎందుకు పనిచేయలేదో...ఏమో బహుశా డాక్టర్ లో "ఆర్" ఉంది కదా అంటారేమో)

:)). Nice post

Unknown said...

kudirithe germany nundi paul octopus ni kuda testaadu tv9 vaadu...

meekemayina doubt ha..... :-)

తార said...

అహా నాకు సైన్సు జాతకం తెలుసు, నేను నా రెజ్యూం తయారు చేసుకొని వేగంగా ఎదో ఒక వార్తా చానెల్ లో జేరాలి

Rk said...

asalu tv9 lo vochavi anni panikimalina vaarthalae.