నిన్న టివి నైన్ లో జగన్ కొత్త పార్టి పెడతాడా లేదా అని చిలక జోస్యం తో డిసైడ్ చెయ్యడం చూసి నాకు భలే చిరాకేసింది. అసలు ఈ మధ్య న్యూస్ చానెల్స్ మరీ న్యూమరాలజిస్ట్ లు , వాస్తు శాస్త్ర నిపుణులు, చివరాఖరికి రోడ్డుపక్క చిలక జోస్యం చెప్పేవాడిని కూడా స్టూడియో కి తీసుకొచ్చి క్రీడల దగ్గరనుంచి రాజకీయాలవరకు విశ్లేషిస్తుంటే ఛీ... మన జీవితం అనిపిస్తోంది. ఇక ఆ సోకాల్డ్ నిపుణులు చెప్పేవి కూడా భలే వెరైటీగా ఉంటాయిలెండి సైనా నెహ్వాల్ ఇన్ని టోర్నమెంట్లు వరుసగా గెలవడానికి కారణం ఆమె హార్డ్ వర్క్ కాక వాళ్ళింటి ఈశాన్యం వైపు గోడ కాస్త ఎత్తు పెంచినందుకు అని చెప్తారు, అసలు సచిన్ ఇంత మంచి ప్లేయర్ అవడానికి కారణం అతని పేరులో "టి" అనే అక్షరం ఉండడం వలెనే అని (వీళ్ళ మొహం టెండూల్కర్ అనేది వాళ్ళ ఇంటిపేరు అని వీళ్ళకి తెలిసినట్టు ఉండదు), సోనియా జాతకం లో ప్రధాని పదవి లేదని అందుకు కారణం ఆమె పేరులో "ఆర్" అనే అక్షరం లేదని (అందుకు సాక్ష్యంగా ఇప్పటివరకు ప్రధానమంత్రులుగా పనిచేసిన వారందరి పేర్లలో "ఆర్" ఉందని ఉదాహరణలు చూపిస్తారు ...మన్మోహన్ సింగ్ విషయం లో ఇది ఎందుకు పనిచేయలేదో...ఏమో బహుశా డాక్టర్ లో "ఆర్" ఉంది కదా అంటారేమో) ఇలా తిక్క తిక్క వాదనలు, దానికోసం గంటలు గంటలు చర్చలు. ఇవన్నీ చూసాక ఇకనుంచి న్యూస్ చానల్స్ లో సోది చెప్పుకునేవాళ్ళు, చిలకజోస్యం వాళ్ళు, బల్లిశాస్త్రం తెలిసినవాళ్ళు, పుట్టుమచ్చలు-వాటి ఫలితాలు చెప్పేవారు , న్యూమరాలజిస్ట్ లు ఇలాంటి వాళ్ళే ఫుల్ టైం రిపోర్టర్లుగా, విశ్లేషకులుగా వచ్చేసినా ఆశ్చర్యం లేదు.
Sunday, July 11, 2010
Wednesday, July 7, 2010
శిలలపై శిల్పాలు చెక్కినారు....పేరడీ - లీలామోహనం బ్లాగు "విజయమోహన్" గారికి ధన్యవాదాలతో
ఈ వేళ చిలమకూరి విజయమోహన్ గారి లీలా మోహనం బ్లాగులో ఈ పాటకు ఆయన రాసిన పేరడీ చదివాను. సరే ఆయన భావాలకే నాదయిన టచ్ ఇద్దామనిపించింది అందుకే పతనమవుతున్న విలువలపై నా బ్లాగులో మరొక పేరడీ. పాట మీకు తెలిసినా ఇక్కడ లింక్ ఇస్తున్నాను మరొక సారి వింటూ ఆ ట్యూన్ తో పాటు ఈ పదాలు చదువుకోండి. మీ అభిప్రాయాలు చెప్పడం మరచిపోకండి.
అహో ఆంధ్ర/ రాయలసీమ/ తెలంగాణా భోజా*
శ్రీ కృష్ణ దేవరాయా
తెలుగుజాతి ఘనకీర్తి నిర్మాణ తేజో విరాజా
ఈ రాష్ట్ర దుస్థితికి సాక్ష్యంగ నిలిచావయా
విలువలే తుంగలో తొక్కినారు
విలువలే తుంగలో తొక్కినారు
మనవాళ్ళు స్టేటు కే అపకీర్తి తెచ్చినారు
విలువలే తుంగలో తొక్కినారు
అవినీతి ఎరుగని వారికైనా
అవినీతి ఎరుగని వారికైనా
వలవేసి ఊబిలో లాగేటి రీతిగా
విలువలే తుంగలో తొక్కినారు
ఒకవైపు రాష్ట్రాన్ని దోచుకొను ఘనులు
ఒక ప్రక్క విసిగించు వేర్పాటు జోరు
ఒక చెంప పదవికై వర్గ భేదాలు
నరకమే అనిపించు రాష్ట్రానికొచ్చాము
ప్రగతి లేదని నీవు కలతపడవలదు
ప్రగతి లేదని నీవు కలతపడవలదు
ఈ స్థితిని ప్రగతిగా తలచుకొని ఏడు
విలువలే తుంగలో తొక్కినారు
మనవాళ్ళు స్టేటు కే అపకీర్తి తెచ్చినారు
విలువలే తుంగలో తొక్కినారు
ఏడు కొండలపైన వెంకన్న గుడిలోన
చోరచేష్టల తోటి పరువంత పోగా
రాతి దేవుళ్లకే చేతనత్వము కలిగి
హరిహరీ ఖర్మంటు తలపట్టుకేడ్వగా
అమ్మజపమందుకుని చెత్త నాయకులు
అమ్మజపమందుకుని చెత్త నాయకులు
పదవి దక్కాలని మొక్కుకున్నారని
విలువలే తుంగలో తొక్కినారు
మనవాళ్ళు స్టేటు కే అపకీర్తి తెచ్చినారు
విలువలే తుంగలో తొక్కినారు
పదవులే పోయినా
అధికారమూడినా
కాలాలు మారినా
కాలమ్ము మూడినా
నేతలే దనుజులై మట్టిపాల్జేసినా
చెదరని కదలని శిల్పాల వలెనె
మనము ఈ రాష్ట్రాన కష్టాల, నష్టాల బ్రతుకుతున్నాం బ్రదర్!!
నిజమురా సోదరా
లీలామోహనం బ్లాగు "విజయమోహన్" గారికి ధన్యవాదాలతో
*(ఎందుకొచ్చిన గొడవ! ఒట్టి "ఆంధ్ర భోజా" అనే అన్నానంటే ఏ వేర్పాటు వాదయినా నా బ్లాగు బ్లాక్ చెయ్యమన్నా అనగలరు. ఎవరి ఏరియాను బట్టి వాళ్ళు చదువుకోండి.)
పన్లోపని నా పాత పోస్టుల్లోని పేరడీ పాటలపై కూడా ఓ లుక్కేయండి.
నిదురించే తోటలోకి పాటకు పేరడీ http://blogavadgeetha.blogspot.com/2009/12/blog-post_17.html
మాయా బజార్ లో తెలంగాణా మాయా శశి రేఖ - అహ నా పెళ్ళంట పాట పేరడీ
మాయా బజార్ లో తెలంగాణా మాయా శశి రేఖ - అహ నా పెళ్ళంట పాట పేరడీ
http://blogavadgeetha.blogspot.com/2010/01/blog-post_12.html
మహాకవుల తెలంగాణం - ఒక పేరడీ ప్రయత్నం
http://blogavadgeetha.blogspot.com/2009/12/blog-post_9543.html
మహాకవుల తెలంగాణం - ఒక పేరడీ ప్రయత్నం
http://blogavadgeetha.blogspot.com/2009/12/blog-post_9543.html
Labels:
పేరడీలు
Subscribe to:
Posts (Atom)