ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ కి మన జాతి పిత మహాత్మా గాంధీని హత్యలో భాగం ఉందా? అవుననే అంటోంది ఉగాండా కి చెందిన ఓ కరపత్రం. దీనిపై మా విలేఖరి గాలివార్తల గన్నారావు అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్.
గన్నారావు: "ఆమె ఒక పాప్ సంచలనం....పెదవి విప్పి పాడినా...కాలు కదిపి ఆడినా కనక వర్షం. అలాంటి ఆమె మన జాతి పిత మహాత్మా గాంధీ ని ఎందుకు చంపించింది?(వీడు దాన్ని ఆల్రెడీ కన్ఫర్మ్ చేసేస్తాడు). ఉగాండా లో దొరికిన ఓ చిత్తు కాగితం ఈ నిజాన్ని బయట పెట్టింది. 1932 లో భారతదేశం లోని ఒక ప్రముఖ ఛానల్ లో ప్రసారమవుతున్న రియాల్టీ షో లో పాల్గొనేందుకు తనకు మహాత్మా గాంధీ అనుమతి నిరాకరించినందుకే ఆమె ఈ కుట్రకు పాల్పడ్డట్టు ఆ కరపత్రం లో ఉన్న అంశం. (ఆ చిత్తు కాగితాన్ని వంద సార్లు బ్లర్ చేసి..... జూమ్ లో మరీ చూపించడం జరుగుతుంది)....
(బ్యాక్ టు న్యూస్)
ఈ విషయమై చర్చించేందుకు మన స్టూడియో లో ఉన్నారు ప్రముఖ తాగుబోతులు శ్రీ పిచ్చి పుల్లయ్య గారు, శ్రీ వెర్రి వెంగలప్ప గారు (పాపం ఆ సమయానికి కాస్త ఖాళీగా వాళ్ళే దొరికుంటారు)......
ఇంక ఆ తరువాత చర్చ మొదలవుతుంది.......దీన్ని అందుకున్న మరొక పది చానెల్స్ ...వాళ్ళ స్టైల్ లో మరింత మసాల జోడిస్తాయి. ఇది నమ్మిన జనం కోపానికి మరొక యాభయ్ బస్సులు, వందలాది మ్యూజిక్ స్టోర్లు నాశనం అయిపోతుంటే దాన్ని మళ్లీ లైవ్ లో కవరేజి. ఆ తరువాత ఇంకో పిచ్చి నా పార్టీ దీనికి నిరసనగా ఉగాండా, భారత్ లలో వారం రోజుల బందుకు పిలుపు.......
(దీనిపై ఇంటర్ పోల్ దర్యాప్తు లో అది ఒక రెండో క్లాస్ కుర్రాడి రఫ్ నోట్స్ లో కాగితం గా....అందులో కాస్త కనబడేలా ఉన్న బ్రిట్నీ........గాంధీ అన్న రెండు పేర్ల ఆధారంగా సదరు చానెల్ సృష్టించిన సంచలన వార్తా కధనం గా తేలడం జరిగింది)
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
(ఇలాంటి న్యూస్ చానెల్స్ కి కోటి దండాలు....ఇంత చదివిన తరువాత కూడా "అవునా!.... నిజమేనేమో" అనుకునే వాళ్ళకి శత కోటి దండాలు.. సంచలన వార్తలంటూ చానెల్స్ ఎంతకయినా దిగజారగలవు అని చెప్పడమే నా ఉద్దేశ్యం తప్ప గాంధీనో ...బ్రిట్నీ స్పియర్స్ నో కించపరచడం నా ఉద్దేశ్యం కాదని మనవి)