Wednesday, November 25, 2009

బ్లాగవద్గీత మొదటి అధ్యాయం

హల్లో ఇది నా బ్లాగ్ లో మొదటి పోస్టింగ్

వర్షాకాలం
చల్లని సాయంత్రం
ఎర్రని బొగ్గులమీద అప్పుడే కాల్చిన మొక్కజొన్న పొత్తును కొరికితే ఎలా వుంటుందో

వేసవికాలం
వెన్నెల రాత్రి
ఆరుబయట చల్లని గాలిలో చుక్కలు లెక్కెడుతూ పాతపాటలు వింటూంటే ఎలా వుంటుందో

చలికాలం
పొద్దున్నే నీరెండలో
వేడివేడి కాఫీ సిప్ చేస్తూంటే ఎలా ఉంటుందో

ఈ బ్లాగ్ అలా చేద్దామని నా ఫీలింగ్

కానీ ఒక్కోసారి

IMAX 3D లో ఆర్. నారాయణమూర్తి సినిమా చూస్తున్నట్టు
వేడి వేడి మిరపకాయ బజ్జీని వెనీలా ఐస్ క్రీం లో ముంచుకుని తింటున్నట్టు
చల్లని మిరియాల కషాయం లో కోక్ కలుపుకుని తాగుతున్నట్టు

మీకనిపిస్తే అది నా తప్పు కాదు......

1 comment:

sunnie said...

keka....... racha.... intro elaa undante...
BrahmanDam baddalai malli atukkunnattu...
Somalia lo unna yekaika india restaurant lo pedarasi peddamma vaddistunna guntur mirapakaya karam baga dattinchina Avakaya tinnantha kammaga undi....