Wednesday, December 23, 2009

బాబూ కె.సి.ఆర్...తప్పమ్మా అలా అనకూడదు...ఇంద ఈ గిఫ్టులు తీసుకో...

బాబూ కె.సి.ఆర్,

తప్పమ్మా అలా అనకూడదు. హైదరాబాద్ నాది అన్నవాడి నాలుక కోస్తా అన్నావు. ఒక్క కోస్తావాడి నాలుకే కాదు బాబు ఈ స్టేట్ లో ప్రతి ప్రాంతం వాడి నాలుకా హైదరాబాద్ నాది అనే అంటుంది. ఒక్క హైదరాబాద్ అనే ఏంటి? ఈ రాష్ట్రము, దేశము నాదే అనుకోడం తప్పుకాదు నాయనా. దేశం లో అన్ని ప్రాంతాలు అందరివీ అని మన రాజ్యాంగమే చెప్పింది...వద్దనడానికి నువ్వెవరు?  అయినా గౌరవనీయ పార్లమెంటు సభ్యుడివై ఉండి ఇలాంటి సంస్కారం లేని మాటలు మాట్లాడేందుకు నీకు సిగ్గుగాలేదా? మునుపోసారి బూతుమాటలకు అర్ధం వివరించి రాష్ట్రం లో పిల్లలని చెడగొట్టావు. ఇప్పుడు మళ్ళీ నాలుక కోస్తా, పీకలు కోస్తా అని వాళ్లకి కొత్త కొత్త మాటలు నేర్పకు (ఇలా ఎందుకు చెప్తున్నానంటే రేపు పొద్దున్న నీ మనవలు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటూ "ఈ బొమ్మ నాది అని ఎవరయినా అంటే వాళ్ళ నాలుక కోస్తా' అని మీ ముందే చెప్పారనుకోండి మీ పరిస్థితి ఏంటి?).  అయినా తెలంగాణా మీద నీకున్న ప్రేమ చూస్తే ముచ్చటేస్తోంది....నల్గొండ ఫ్లోరైడ్ బాధితుల కష్టాలు చూసి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అన్నావు, మరి శాసనసభ్యుడిగా, లోక్ సభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా వాళ్ళ కోసం ఏనాడైనా ఏమైనా చేశావా? ఇప్పుడు నీళ్ళు తిరుగుతున్నాయి అన్నావు....ఇప్పటిదాకా ఆ కళ్ళు మూసుకుపోయాయా బాబూ? పోనీ నల్గొండ వదిలేయి నిన్ను ఎన్నుకున్న నియోజక వర్గాల ప్రజలకైనా ఏదైనా చేశావా? ఎంత సేపూ వాళ్ళు ఏమీ చేయలేదు, వీళ్ళు ఏమీ చేయలేదు అంటావే తప్ప అసలు తెలంగాణా కు నువ్వేమీ చేయలేదన్న విషయం చెప్పవా?  ఏ నాడైనా పార్లమెంటులో ఏ సమస్య గురించయినా చర్చించావా? ఇక హైదరాబాద్ లో నువ్వు కట్టించిన ఏకైక  పెద్ద కట్టడం తెలంగాణా భవన్ (అది కూడా విరాళాలతో). పాపం ఆ మోహన్ బాబే నయం వరదల్లో నష్టపోయిన రాజోలి గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. నువ్వు అదీ చేయలేదుగా. ఈ మాత్రానికే ఇంతలా ఎగరాలా? నువ్వు మంచి చదువరి అని అందరికీ తెలుసు (మన బ్లాగ్మిత్రుడు "చదువరి" కాదని మనవి) . నీకు వచ్చిన భాష తో నీ కార్యకర్తల్ని ఉత్సాహపరచు తప్పులేదు. అంతేకాని వాళ్ళని రెచ్చగొట్టకు. ఇంక నువ్వు ఉపయోగించే భాషే తెలంగాణా భాష అని నువ్వు అనుకుంటే పాపం సి.నా.రే లాంటి వాళ్ళు నీ దగ్గర చాలా నేర్చుకోవాలన్న మాట . నరుకుతా, పొడుస్తా , చంపుతా అనడమే తెలంగాణా సంస్కృతి అని దేశంలో మిగిలిన ప్రాంతాల వాళ్లకి నువ్వు చెప్పదలచుకున్నట్టు ఉంది. కాస్త పద్దతి మార్చుకో. ఇది నువ్వు వలస వచ్చిన తెలంగాణా ప్రాంతం వాళ్ళ సంస్కృతీ కాదు, నీ పూర్వీకుల విజయనగరం జిల్లా సంస్కృతీ కాదు.


ఇంక హైదరాబాద్ గురించి నువ్వు ఎవర్నీ మాట్లాడవద్దన్నావు. సరదాగా ఈ పాటలు విను. నీకు ఇవి ఒక సమైక్యవాది పంపుతున్న బహుమతిగా భావించి స్వీకరించు. చివరిగా నాదొక సలహా "ఎందుకైనా మంచిది కాస్త బి.పి. చెక్ చేయించుకో."


రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్

చల్ చల్ రే హైదరాబాదీ


(పైన లింకుల మీద క్లిక్ చేసి పాటలు విను. ఇంకెప్పుడూ హైదరాబాద్ నీ ఒక్కడిదే అనకు నాయనా! )

14 comments:

శరత్ కాలమ్ said...

:)

శాంతిమిత్ర said...

ఇలాంటివి కెసిఆర్ కి కొత్త కాదు. నాకు తెలిసి రాజకీయాల్లో వాడంత లుచ్చా మరొకడులేడు. అమాయక జనాన్ని సెంటిమెంట్ పేరుతో రెచ్చగొట్టి పబ్బం గడుపుకొనే పద్ధతిలో కెసిఆర్, ఆతని మేనల్లుడు హరీష్ రావు వ్యవహిస్తున్నారు. ప్రజలు అంత తెలివి తక్కువ వారేం కాదు. ఎవరు ఎన్ని చెప్పినా వాళ్ళు చేసేది చేస్తారు. అయితే వచ్చిన చిక్కల్లా కార్యకర్తలుగా చెప్పబడే కొంతమంది హంగామాకు మీడియా తోడవుతోంది. ఎలక్ట్రానిక్ మీడియా పెరిగిన తరువాత ప్రతి చిన్న విషయానికి లైవ్ ఇవ్వడం, ‘దీనిపై మీరెలా స్పందిస్తారు’, ‘మీరేం చేయాలనుకుంటున్నారు’ వంటి చెత్త ప్రశ్నలతో వీరు మరింత రెచ్చిపోయి, పెద్ద మేధావుల వలే ఫోజుకొడుతూ వ్యాఖ్యానాలు చేయడం, రెచ్చిపోయి ధ్వంస రచన చేయడం చేస్తున్నారు. ఇది ఎంతమాత్రం క్షంతవ్యం కాదు. ఎంత భరితెగించకపోతే.... మోహన్ బాబు కొడుకు షూటింగ్ ను ధ్వంసం చేస్తారు. ప్రస్తుతం పెద్ద నటులుగా, పెద్ద నిర్మాతలుగా మనం గౌరవించే ప్రతి నటుడు తెలుగు సినీ పరిశ్రమ మద్రాసులో వున్నప్పుడునుంచే వున్నారు. వారంతా అక్కడే సెటిలయ్యారు. పరాయి రాష్ట్రం అయినా వారు మన తెలుగువారినేం అనలేదు. కాని తెలుగు రాష్ట్రంలో తెలుగు గడ్డపై ఒక కళాకారుడికి ఇంత అవమానం జరగడం పట్ల కళాకారులంతా స్పందించాలి. కళా ప్రపంచవ్యాపితం. దీనికి భాష, ప్రాంతం, దేశం వంటి భేదాలు లేవు. అదేమంటే మన తెలంగాణాలో నటులు లేరా వాళ్ళ సినిమాలు మనం చూడాలా అంటున్నాడు కెసిఆర్. మనకు నటుల్లేకనా హిందీ, ఇంగ్లీష్ సినిమాలు చూస్తున్నాం. ఆమాత్రం బుద్దైనా అతనికి లేదు.

పదనిసలు said...

మీ టపాకు ధన్యవాదములు. మీ టపాకు సమాధానంగా నేను టపా వేయవలసి వచ్చింది. మీ టపాలోని కొన్ని ప్రశ్నలికి నా టపాలో జవాబులు దొరుకుతాయేమో చూసుకోండి.. :) మీ సౌలభ్యం కోసం నా టపా లంకె..

రాజగోపాల్ ను ఎందుకు ప్రశ్నించకూడదు?

Truely said...

KCR comments really hurting telugu(telangana people are no more telugu people) people. we are unable to digest this guy.

పదనిసలు said...

మన్నించండి కాపీ & పేస్టు తప్పు

Ravi said...

కేసీఆర్ మాట్లాడే భాషే తెలంగాణా భాషే అయితే తెలంగాణా ప్రజలు సిగ్గు పడతారు.

kvrn said...

nicely put.

Anonymous said...

నా బ్లాగులో ఇంకో తెలగాణ్యుడు వాడిన భాషని ప్రజాప్రదర్శన కోసం అలాగే ఉంచేశాను. అందఱూ వచ్చి చదవండి.

http://www.tadepally.com

సుజాత వేల్పూరి said...

భీభత్సం మీ టపా! ఇంకోటి మర్చిపోయారు...ఆయన నియోజకవర్గ ప్రజలు "మా ప్రజా ప్రతి నిధి కనపడట్లేదు. కాస్త వెదికి పెట్టండి బాబూ" అని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశార్ట పాపం!

ఆయన భావజాలం(అంటే ఏంటో ఈ మాట వాడేవాళ్లకు తెలీదు), భాష(ఇది తెలుసు) గొప్పవని, వాటిని అర్థం చేసుకోవడం ఏ సమైక్య వాది తరమూ కాదని(ఇది నిజమేలెండి) వారి అభిమానుల అభిప్రాయం!

విరజాజి said...

తిట్టే నోరూ, తిరిగే కాలూ ఊరికే ఉండవని మన పెద్దలు ఎప్పుడో చెప్పారుగా! కేసీయార్ తిట్టే నోరును పెద్ద గొప్పగా మీడియాలో మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నందుకు ముందు ఈ టీ.వీ ఛానెళ్ళని అనాలి. మంచి మాటలు ఒక్కటైనా అలా చూపించరు గానీ - ఇలాటి కారు కూతలకి మాత్రం బాగా ప్రాముఖ్యత ఇస్తారు. అందరికీ అలా నోరు పారేసుకుంటే - అందరూ తిట్టే తిట్లకి అతని చెవుల్లో సీసం పోసుకుంటాడేమో !

ఓ బ్రమ్మీ said...

బిడ్డా!! ఏం రాసినవ్..

గిట్టా రాసినందుకు నిన్ను అలాగే నీ బ్లాగుని కండిస్తున్నా.. మా తెలెంగానోళ్ళు నీ బ్లాగు సూడకుండా ఆల్ల కంప్యూటర్ల పగల కొడతా. కామెంటినొళ్ళందర్ని తెగ నరకతా..

నాయాల్ది, నా ఇలాకాలో నేనేమైనా జేస్తే జెస్తా లేకుంటే మానుకుంటా.. నీకేంది జెప్పాల్నా? తంబీ.. గిదే జెప్తాండా, ఉంటే మంచిగా రాయ్ లేకుంటే గమ్మున కూకో .. నాతో ఎట్టుకోక, మల్లీ ఎల్లి నిరాహార దీచ్చ చేత్తా..

ఒరేయ్ సదువుకునే పిల్లొల్లారా.. గీడ సూడుండ్రి, బద్మాస్ గాడు నన్ను అదే మిమ్ముల్నందర్నీ తిడతాండు. రాండ్రి .. గీడ్ని తన్నుండ్రి. గీడకొచ్చి ఈడ్ని తిడితే, బిర్యానీ పాకెట్ మన కార్యకర్తలు ఇస్తారు. ఇక ఇరగ దీయుండ్రి

SHANKAR.S said...

@ శరత్ 'కాలం'
మీ చిరునవ్వుకు ధన్యవాదాలు
@ శాంతి మిత్ర
మీడియా అత్యుత్సాహం జగమెరిగిన సత్యమే కదండీ. ఇక సినిమాలంటారా మేమే తీస్కుంటాం అన్నారుగా అందుకే కె.సి.ఆర్ కి ఈ సవాల్

మేం నటులం కామా
సినిమాల్ తిస్కోలేమా
అని గర్జించిన కె.సి.ఆరూ...
చేతైతే ఒక్క 'మాయాబజార్' తీసి చూపు
జనమంతా నీ కాళ్ళు మొక్కుతారు......

@ పదనిసలు
థాంక్స్ అండీ

@ Mady
తప్పండి అలా అనకూడదు. మనమంతా తెలుగు వాళ్ళమే...కొన్ని గంజాయి మొక్కలున్నాయని తులసివనం వదులుకోలేం కదా. అది వాడి సంస్కారం. ఇది మన సంస్కారం

@ రవిచంద్ర
అర్ధం తెలిస్తే మొత్తం దేశమే సిగ్గుపడుతుంది

@ కె.వి ఆర్ ఎన్
థాంక్సండి

@ ఎల్ బి ఎస్
:)

@సుజాత
అవన్నీ చెప్తే అదీ ఆంధ్ర వాళ్ళ కుట్ర అనేయగలడు

@విరజాజి
మీకు దున్నపోతు మీద వర్షం సామెత తెలిసినట్టు లేదు

@ చక్రవర్తి

ఆయ్(! మాది తూర్పుగోదారండి. మరండీ మీరిలా భయపెడితే మాకు మాసెడ్డ భయమేసేస్తోందండి... ;)

Unknown said...

Cheetu Meeda Konga ra K C R Donga Ra.............
Telangana kanna maa Andhra lo Bootulu chala ekkuva vuntaie achha yasa lo tidite ardham kadani vadilesamu.......nee kurra.....

శరత్ కాలమ్ said...

@ చక్రవర్తి
నేను కామెంటిన. ఏం జేస్తవ్. నరుకుతవా? నరుకు సూద్దాం. ఏం నరుకుతవో ముందు జెప్పు బిడ్డా. కాలు నర్కుతవా, ఏలు నరుకుతవా లేక ఎంట్రుక నర్కుతవా? ఎంట్రుక అయితే ఓకేనే. గది ముందు జెప్పొచ్చుగదనే అన్నా.

ఆట్ల బెదిరించినోల్లకు మేమేం జేస్తమో తెల్సునా నీకు. ముక్కు కోసి చేతిల బెడతం. అసలే కుక్క అడ్డమొచ్చి పరేషాన్ అయిపోయినవ్. ఇప్పుడు నేనడ్డమొస్తా మల్ల ఏమనుకున్నవో బిడ్డ. ఆయ్!