నిన్న రాత్రి తెనాలి రామలింగడు కలలోకొచ్చి మా చెడ్డ గొడవ చేశేసాడు. "అసలేంటి నీ ఉద్దేశ్యం? "కాస్త ఇలా చాటుకొస్తారా' అని తెలుగు చాటు పద్యాల గురించి ౩ పార్టులు నీ బ్లాగ్ లో పెట్టావు బానే ఉంది. ఒక్క మాట, కనీసం ఒక్కమాటయినా నా గురించి చెప్పవా? పోనీ నేన్జెప్పిన ఏ ఒక్క పద్యమయినా అందులో ఉంచావా? అంటే అప్పటి మా విజయనగర సామ్రాజ్యం ఇప్పుడు కర్ణాటకలో ఉంది కాబట్టి నన్నొదిలేసి మీ స్టేట్ వాళ్లకి ప్రాముఖ్యం ఇచ్చావన్నమాట. పోనీ మా రాయలేలిన సీమేగా ... ఆ రాయలసీమ కోటాలో నాకూ ఓ మూల చోటిచ్చి ఉండచ్చుగా...ఇదే చెప్తున్నా..నువ్వు కనక నీ బ్లాగ్ లో నా గురించి ప్రత్యేక పోస్ట్ ఏర్పాటు చెయ్యకపోతే వెంటనే సెలైన్ పెట్టుకుని మరీ ఆమరణ నిరాహార దీక్ష చేపడతా ...ఇక వికటకవి చచ్చుడో ...వేరే పోస్ట్ ఇచ్చుడో తెలిపోవాలంతే' అని తన మార్కు సెటైర్ వదిలాడు. అసలే ఆమరణ దీక్షలంటే అదిరిపడే కాలం. అధిష్టానానికే తప్పలేదు ఆఫ్ట్రాల్ నేనెంత అనుకుని ఈ విషయంలో కాస్త హెల్ప్ చేసిపెట్టమని రీసెంట్ గా బర్త్ డే చేసుకున్న మన మహా గాయకుడు ఘంటసాల గారిని బ్రతిమాలుకోగా నా మీద జాలిపడి తెనాలి రామలింగడు సినిమాలో ఆయన పాడిన పద్యాలని ఇచ్చారు. బ్రతుకుజీవుడా అని అవి ఇక్కడ పోస్ట్ చేస్తున్నా.(సందర్భాలు కూడా ఉండటం వలన మరింత ఎంజాయ్ చేసే విధంగా ఉన్నాయి ఈ ఆడియో క్లిప్ప్..కింద ఇచ్చిన పద్యం లింక్ మీద క్లిక్ చేస్తే ఆడియో ప్లే అవుతుంది ). మీకు వీలయితే నేను ముందు చెప్పిన "కాస్త ఇలా చాటుకొస్తారా' పోస్ట్ మూడు పార్టులు నా బ్లాగ్ లో చదివి నేను ఏ ప్రాంతం వాళ్ళ పట్ల వివక్ష చూపలేదని తెనాలి రామలింగడికి చెప్పి కాస్త ఆ దీక్ష విరమింపజేద్దురూ!
(రంజన చెడి పద్యం తర్వాత ఉన్న డైలాగ్ లలో ఉన్న పంచ్ నాకు భలే ఇష్టం)
ఇవన్నీ మీకు నచ్చితే నాకు చెప్పడం మాత్రం మర్చిపోకండి.....ఈ సినిమా చూడాలనిపిస్తే ఎలాగూ ఆదివారమే కదా చూసెయ్యండి ఓ పనయిపోతుంది.
4 comments:
ఎప్పుడో విన్న తెనాలి రామలింగని హాస్య పద్యాలను కేవలం మళ్ళీ చదివించడమే కాకుండా వినిపించారు. మీ సేకరణకు అభినందనలు, మమ్మల్ని కాసేపు ఆనందింపజేసినందులకు ధన్యవాదములు.
రాజన్
http://naagola.wordpress.com/
రాజన్ గారు చాలా థాంక్సండి. ఇంతమంది బ్లాగ్మిత్రులు చూసి ఆనందిస్తున్నారు గాని కామెంట్ చేసి అభినందించింది మీరొక్కరే. ఇలాంటి ప్రోత్సాహం కోసమే కదా కష్టపడి వ్రాసేది. ఇకనైనా మన బ్లాగ్మిత్రులు పోస్ట్ ను ఆనందించడం తో పాటు ఒక్క కామెంట్ తో వెన్ను తట్టి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. మీకు మరొక్కసారి కృతఙ్ఞతలు.
మీరు చెప్పింది రైటేనండి. ఇంత శ్రమా పడి రాస్తే, ఊరికే చూసేవారే కానీ,ఏ వ్యాఖ్యా వ్రాయకుండా వెళ్ళిపోతే ఎంత బాధొస్తుందో!!
మీ పూర్తి పేరు నాకు తెలియడం లేదు. కానీ ఇంత మంచి విషయాలు మీరు తీసుకువస్తున్నారు. వ్యాఖ్యలు పెట్టలేదని, స్పందించలేదని ఎట్టి పరిస్తితుల్లోనూ మీరు నిరాశకు గురికావద్దు. కొన్ని వందల మంది బ్లాగర్లు రోజూ టపాలు పెడుతున్న నేపథ్యంలో అనుకోకుండా చూసిన ప్రతి బ్లాగులోనూ వ్యాఖ్య పెట్టాలని, స్పందించాలని అనుకోవద్దు. నిజంగా బాగా రాశామనుకున్న వాటికి కూడా ఒక్కోసారి స్పందనలు ఉండవు. అలాగే మంచి బ్లాగు కథనం చూసి, చదివి కూడా వ్యాఖ్య పెట్టలేని సందర్భాలు కూడా ఉన్నాయి. వ్యాఖ్య రావడం లేదంటే ఆ కథనం బాగాలేదని, హిట్లు రాలేదని అనుకోవద్దు. మీ బ్లాగు ప్రత్యేకత అర్థమయితే, ఒక ప్రత్యేకాంశం మీద మీరు దృష్టి సారిస్తున్నారని బోధపడితే వ్యాఖ్యలు రాకున్నా మీ బ్లాగును చదివేవాళ్లు చాలా మందే ఉంటారు. కాబట్టి నిరాశకు తావివ్వకుండా టపా చేస్తూ పోండి.
ఇక మీ ఈ కథనం విషయానికి వస్తే.. తెనాలి రామలింగం సినిమాలోని ఈ పద్యాలు అజరామరాలు. మీరు ఈ బ్లాగులో పెట్టడం ద్వారా వాటికి శాశ్వత ప్రచారం చేస్తున్నారు. ఇలాగే తెలుగు సినిమాలలో ఘంటసాల గారు తదితరులు పాడిన అద్బుత పద్యాలను కూడా మీ బ్లాగులో వీలున్నప్పుడు చేరుస్తూ రండి. ఈ సందర్బంగా నా బ్లాగులో "మా తెలుగు మాస్టారూ... మా తెలుగు పద్యమూ" అనే టపా వీలయితే చూడండి. మీ బ్లాగు లింకును నా బ్లాగులో చేరుస్తున్నాను.
రాజు
blaagu.com/chandamamalu
telugu.chandamama.com
krajasekhara@gmail.com
Post a Comment