ఏంటో అటు కోస్తా, రాయలసీమలలో ...ఇటు తెలంగాణా లో రోజుకొక్క జేఏసి పుట్టుకొస్తోంది. ప్రతి యూనివర్సిటీకొక జేఏసి, లాయర్లకి, డాక్టర్లకి, యాక్టర్లకి, కులానికి ఒకటి, మతానికి ఒకటి, పార్టీకి ఒకటి, ప్రాంతానికి ఒకటి, వూరికొకటి, చెట్టుకొకటి, పుట్టకొకటి చొప్పున జేఏసి లు..వాటిలో మళ్ళీ వర్గ జేఏసి లు పుట్టుకొస్తున్నపుడు ఇవన్నీ చూసి ఏం? మన బ్లాగ్గర్స్ ఎందులో తీసిపోయారని అనిపించి బ్లాగ్గర్స్ జేఏసి ప్రారంభిద్దామని డిసైడ్ అయిపోయా. దీని కార్యవర్గం లో ఎవరెవరు ఉండాలో మీరే సలహా ఇవ్వండి.
అలాకాదూ....మళ్ళీ ఇందులో కూడా మహిళా బ్లాగ్గర్లు, పురుష బ్లాగ్గర్లు, బాల బ్లాగ్గర్లు, వృద్ధ బ్లాగ్గర్లు, తెలంగాణా బ్లాగ్గర్లు, ఆంధ్ర బ్లాగ్గర్లు, ఉత్తరాంధ్ర బ్లాగ్గర్లు, రాయలసీమ బ్లాగ్గర్లు, ప్రవాసాంధ్ర బ్లాగ్గర్లు, బ్లాగ్ స్పాట్ బ్లాగ్గర్లు, వర్డ్ ప్రెస్ బ్లాగ్గర్లు ఇంకా నానా రకాల బ్లాగ్గర్ల విడివిడి జేఏసి లు ఉండాలంటారా....మీ గొడవ మీరు పడండి...నేను మాత్రం నా స్వంత జేఏసి ప్రారంభిన్చేసుకుంటా....వద్దామనుకున్నా వాళ్ళు రావచ్చు.
ఇంతకీ జేఏసి లక్ష్యం ఏంటి అంటారా?.....ఏమో ఇప్పటి దాకా ఉన్న ఏ జేఏసి కి మాత్రం వాళ్ళ లక్ష్యం ఖచ్చితం గా తెలిసి ఏడిసింది కనుక...
(నాకు మొదటి కామెంట్ చేసిన వాళ్లకి నా జేఏసి కన్వీనర్ పదవి ఇచ్చేస్తానోచ్!!!!!! త్వరపడండి)
12 comments:
haha!!!!!!!!!!!
Very funny
super :)
nenu oka jac pedatha, ekadante maa veedilo
nice idea.....
ఈ రకరకాల జేఏసీలు అన్నిటికీ కలిపి నేను జేజెమ్మేసీ స్థాపించబోతున్నా.
మీ మొదటి కామెంట్ మీరే వ్రాసుకున్నారనిపిస్తోంది
:)
గుడ్ ఐడియా
భవదీయుడు
అప్పారావు శాస్త్రి
naadi andhra bloggers jac
Mine is female telugu bloggers JAC. As per formula I will be the convener because I commented first, from women bloggers.
andaroo swartha paruley, prati okkaru tama tama JAC lo start cheyyali ane.......
అజ్ఞాతలు పదవులకు అర్హులు కారు కాబట్టి నాదే కన్వీనర్ పదవి. ఏమంటారు?
@ అజ్ఞాత గారు
తొలి పోస్ట్ చేసినందుకు ధన్యవాదాలు. కానీ జేఏసి నడిపించాలంటే మీరు వెలుగులోకి వచ్చి తీరాలి. మీకు ఈ నెల 28 వ తేదీ దాకా గడువిస్తున్నాము. వచ్చి బ్లాగ్జీవన స్రవంతి లో కలిసిపోండి.
@ శరత్ కాలం గారు
తప్పకుండానండి! ఆ అజ్ఞాతగారెవరో కనీసం ఏ కన్వీనర్ పదవికోసమయినా 28 వ తేదీ లోగా వెలుగులోకి వచ్చి బ్లాగ్జీవన స్రవంతి లో కలుస్తారని ఆశిద్దాం. ఆయన రాకపోతే మీరే కన్వీనర్. అప్పటిదాకా కాస్త ఓపిక పట్టాలి మీరు. :)
@ గురివింద గారు
మీ వీధి జేఏసి కి మా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం
@ నిజం గారు
థాంక్సండి
@ అబ్రకదబ్ర గారు
అదేం కుదరదు. అయినా అందుకు మీరు మీ అధిష్టానం అనుమతి తీసుకోవలసి ఉంటుంది.
@ అప్పారావు శాస్త్రి గారు
అయ్యబాబోయ్ ...అస్సలు కాదండీ. అందుకే ఆ అజ్ఞాతగారికి 28 వ తేదీ లోగా వెలుగులోకి రమ్మని గడువిచ్చాం
@ సుజాత గారు
ఖచ్చితంగా మహిళా జేఏసి కి మీరే కన్వీనర్.
@ ఆర్.కె , సత్యం 90
:)
:)
baagundi mee JAC gOla, naakEmi teliyadu nannu involve cheyyakanDi
Post a Comment