Friday, January 8, 2010

ఫ్లాష్....... ఫ్లాష్.............మహాత్మా గాంధీ హత్య లో బ్రిట్నీ స్పియర్స్ హస్తం ......


ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ కి   మన జాతి పిత మహాత్మా గాంధీని హత్యలో భాగం ఉందా? అవుననే అంటోంది ఉగాండా కి చెందిన ఓ కరపత్రం. దీనిపై మా విలేఖరి గాలివార్తల గన్నారావు అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్.
గన్నారావు: "ఆమె ఒక పాప్ సంచలనం....పెదవి విప్పి పాడినా...కాలు కదిపి ఆడినా కనక వర్షం. అలాంటి ఆమె మన జాతి పిత మహాత్మా గాంధీ ని ఎందుకు చంపించింది?(వీడు దాన్ని ఆల్రెడీ కన్ఫర్మ్ చేసేస్తాడు). ఉగాండా లో దొరికిన ఓ చిత్తు కాగితం ఈ నిజాన్ని బయట పెట్టింది. 1932  లో భారతదేశం లోని ఒక ప్రముఖ ఛానల్ లో ప్రసారమవుతున్న రియాల్టీ షో లో పాల్గొనేందుకు తనకు  మహాత్మా గాంధీ అనుమతి నిరాకరించినందుకే ఆమె ఈ కుట్రకు పాల్పడ్డట్టు ఆ కరపత్రం లో ఉన్న అంశం. (ఆ చిత్తు కాగితాన్ని వంద సార్లు బ్లర్ చేసి..... జూమ్ లో  మరీ చూపించడం జరుగుతుంది)....

(బ్యాక్ టు న్యూస్)
ఈ విషయమై చర్చించేందుకు మన స్టూడియో లో ఉన్నారు ప్రముఖ తాగుబోతులు శ్రీ పిచ్చి పుల్లయ్య గారు, శ్రీ వెర్రి వెంగలప్ప గారు  (పాపం ఆ సమయానికి కాస్త ఖాళీగా వాళ్ళే దొరికుంటారు)......

ఇంక ఆ తరువాత చర్చ మొదలవుతుంది.......దీన్ని అందుకున్న మరొక పది చానెల్స్ ...వాళ్ళ స్టైల్ లో మరింత మసాల జోడిస్తాయి. ఇది నమ్మిన జనం కోపానికి మరొక యాభయ్ బస్సులు, వందలాది  మ్యూజిక్ స్టోర్లు నాశనం అయిపోతుంటే దాన్ని మళ్లీ లైవ్ లో కవరేజి. ఆ తరువాత ఇంకో పిచ్చి నా  పార్టీ దీనికి నిరసనగా ఉగాండా, భారత్ లలో వారం రోజుల బందుకు పిలుపు.......

(దీనిపై ఇంటర్ పోల్ దర్యాప్తు లో అది ఒక రెండో క్లాస్ కుర్రాడి రఫ్ నోట్స్ లో కాగితం గా....అందులో కాస్త కనబడేలా ఉన్న  బ్రిట్నీ........గాంధీ అన్న రెండు పేర్ల ఆధారంగా సదరు చానెల్ సృష్టించిన సంచలన వార్తా కధనం గా తేలడం జరిగింది)
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
(ఇలాంటి న్యూస్ చానెల్స్ కి కోటి దండాలు....ఇంత చదివిన తరువాత కూడా "అవునా!.... నిజమేనేమో" అనుకునే వాళ్ళకి శత కోటి దండాలు.. సంచలన వార్తలంటూ చానెల్స్ ఎంతకయినా దిగజారగలవు అని చెప్పడమే నా ఉద్దేశ్యం తప్ప గాంధీనో ...బ్రిట్నీ స్పియర్స్ నో కించపరచడం నా ఉద్దేశ్యం కాదని మనవి)

14 comments:

Rk said...

edo oka roju ne site anni news channels lo scene create avvadam khayam. ne photo pampinchu. photshop lo marchi ne bujham meda cheyya vesinatlu photo tesukunta. endukaina panikonsundi naku.

Indian Minerva said...

ఉండండుండి మరీ అంతగా తీసిపారేయాల్సిందేమీలేదు. ఈ వాదన నేను కూడా విన్నాను
1) గాంధీ విదేశీ "ఉత్పత్తు"లను బహిష్కరించేమనేవారని మనకు తెలుసు. నిజానికి ఆ ముసుగులో తన పాత శత్రుతువులైన స్పియర్స్ కుటుంబంవారిని నైతికంగా, ఆర్ధికంగా దెబ్బతీయాలనేది గాంధీ నిజోద్దేశ్యంగా అప్పట్లో అనుమానాలున్నమాట విదితమే.
2) ఈ విషయమై బ్రిట్నీ ప్రత్తర్ధులతో చర్చించటనికే గాంధీ ఇంగ్లండు వెళ్ళారని రౌండ్ టేబుల్ సమావేశాలు కేవలం అందుకు సాకు మాత్రమేనని "అబిజ్ఞవర్గాల" భోగట్టా.
3) ఈ విషయంలో నెహ్రూకూడా గాంధీకి సహకరించేవారని ఈ మధ్యనే రష్యన్ విచారణ సంస్థ కె.జి.బి. తమ రహస్య పత్రాలను బైట పెట్టినప్పుడు ప్రపంచాని వెల్లడై అక్కడ సంచలనాలు సృశ్ఠించిన విషయం విజ్ఞులైన పాటకులకు విదితమే.
4) బ్రిట్నీ సానుభూతిపరులకు నష్టం కలిగించేందుకే దక్షిణాఫ్రికాలోని భారతీయులను, నల్ల వారిని కూడగట్టుకొని పోరాడరనేది ఈ మధ్యనే బయటకు వచ్చిన నిజమని "మనకందరకూ" తెలిసిన విష్యమే కాదా!!

ఏది ఏమైనా ఇంకా చాలావరకు నిజాలు బయటకు రావాల్సి వుంది. నేను మెరుగైన సమాజాన్ని ఆకాంక్షిస్తూవుంటాను కాబట్టి నిరాధారభూతమైన విషయాలను కాకుండా పటిష్టమైన సాక్ష్యాలతో మీముందుకు వచ్చి ఇది తెలియజేసుకుంటున్నాను.

సుజాత వేల్పూరి said...

ఏమిటీ,నిజమా? నేను నమ్మలేకపోతున్నాను.బ్రిట్నీ స్పియర్స్ ఎంతో అమాయకురాలనుకున్నాను సుమీ!

SHANKAR.S said...

@ ఇండియన్ మినర్వా గారు

మిమ్మల్ని మా ఛానల్ న్యూస్ డెస్క్ ఇన్ చార్జ్ గా తక్షణం నియమిస్తున్నాము. ఇంకా మీరు చెప్పాల్సింది చాలా ఉంది...మేము వినాల్సింది మిగిలే ఉంది

Harsha said...

కొంతమంది అమాయక ప్రేక్షకులు రెడీ గా వున్నారు గుండె ఆగి పోవటానికి.

Anonymous said...

baavundandi, nenu ee vishayam meda ade,janam aavesam meda serious ga vrayalanukunte, meru na mood marchesaru. ina meru chala fast sumaa ratre vrasesaru.

Anonymous said...

సమాజ హితం పట్టని వాళ్ళు మెరుగైన సమాజం కోసం కృషి చేస్తారట. సిగ్గు సిగ్గు.

Anonymous said...

ఇంత కుట్ర జరిగి ఉంటుంది అని అస్సలు అనుకోలేదండి. ఆ పిల్ల చాలా అమాయకురాలు అనుకున్నాను.

AB said...

title super

వేణు said...

టపా అద్భుతంగా ఉంది. చదువుతుంటే నవ్వాపుకోవటం సాధ్యం కాలేదు. అభినందనలు!

Unknown said...
This comment has been removed by the author.
vkc said...

ఇలాంటి వార్త చూసి SMS చేసే వాళ్లకి సహస్రకోటి దండాలు..

swetha said...

title super

swetha said...

title super