ఇన్నాళ్ళు ఎవడికి నచ్చినట్టు వాడు తనమీద కోపాన్ని చూపుతుంటే మూగగా భరించిన బస్సు ఇప్పుడు తనవంతంటోంది. ఆర్టీసీ అంటే R (రాయల సీమ) T (తెలంగాణా) C (కోస్టల్ ఆంధ్ర) అన్నట్టు అందరికీ సమానంగా ఇన్నాళ్ళు సేవలందించి, మన కోపాలు, తాపాలు భరించిన ఎర్రబస్సు కళ్ళెర్ర చేసింది. తన కోపమే తన శత్రువు అన్న మాట ఇప్పటికయినా ఆందోళన కారులకు అర్ధం అయితే బస్సుల మీద ప్రతాపం చూపడం ఆపుతారని ఆశిద్దాం. లేదా ఇంకో సారి బస్సు ఛార్జీల వడ్డింపుకు సిద్ధపడదాం.
నేను ఈ ఛార్జీల పెంపును సమర్ధిస్తున్నాను. (ఎందుకంటే అటు కార్మికుల జీతాలూ పెంచి, ఇటు ఆందోళనకారుల ఆగ్రహాలూ చూసిన ఎర్ర బస్సు బ్రతికి బట్టకట్టాలంటే ఈ పెంపు అవసరం అని నేను భావిస్తున్నాను..)
8 comments:
నేనూ సమర్ధిస్తున్నాను! (ఎలాగూ నాకు పోయేదేమీలేదు కనక కూడానూ)
ఇలా ఏదయినా తగలబెట్టినప్పుడల్లా ఇలా పెంచేస్తూవుంటేనన్నా బుద్ధి వస్తుంది ...వాళ్ళకి, ప్రజలకి. అసలు విధ్వంసాలు జరిగినప్పుడు కమ్యూనిటీ ఫైన్ వేస్తేగానీ విధ్వంసకాండను వినోదంగా టివిలల్లో చూసే ప్రజలకు విధ్వంసకారుల మీద చురుకుముట్టదు.
సమర్ధించక ఇపుడు చేయగలిగినది ఏమైనా ఉందా?
కమ్యూనిటీ ఫైన్!
నేనూ ఇలాంటిదే ఒకటి ఆలోచిస్తూవుండేవాడిని కాకపోతే అది విద్యుత్ చౌర్యం గురించి. ప్రతి transfoermer కీ మీటర్ పెట్టి వూరిలో అన్ని మీటర్ రీడింగ్స్ కలిపితే వచ్చేదానికి సరిపోలుతుందో లేదో చూడాలి అలా సరిపోకపోతే వూరందరికీ ఫైన్. ఎన్ని డబ్బులు తేడా వచ్చాయో అన్ని ప్రతిఒక్కరినుంచి వసూలుచేశామనుకోండీ. అప్పుడు ఎవడూ విద్యుత్తు దొంగిలించడు ఒకవేళ ఎవడైనా దొంగిలిస్తే ఎవడూ నాకెందుకులే అని వూరుకోడు. ఇలాగే sub station స్తాయిలో ఇంకా పైస్తాయిలో జరుగుతూవుందనుకోండి అప్పుడు పరిస్థితి చక్కబడుతుంది.
ఇప్పుడు RTC దగ్గరికి వద్దాం. ఏవూళ్ళో బస్సు తగలబడుతుందో ఆ వూరివాళ్ళందరిదగ్గరనుంచీ పదిపదిహేను బస్సుల విలువకుసమానంగా డబ్బులురాబట్టుకోవాలి ఇందులో ప్రయాణీకులనుకూడా చేర్చాలి. ఏదో రెండుమూడు రూపాయలు కాకుండా ఆ ఫైన్ కనీసం ఒక 200 రూపాయలకు తగ్గకుండా వుండాలి. అప్పుడు తగలబేట్టేవాడూవుండడు తగలబెడుతుంటే చూస్తూవుండేవాడూ వుండడు.
చాలా బాగా చెప్పారు....నేను కూడా సమర్థిస్తున్నాను...మినెర్వా గారి కమ్యూనిటీ ఫైన్ కాన్సెప్ట్ కూడా బాగుంది..
బస్సులు తగలడిపోతోంటే నోరుమూసుకుని సినిమా చూసిన పార్టీలన్ని ఇప్పుడు ధర్నాలు చేస్తున్నాయి సిగ్గులేకుండా.
India Minerva: ఇలాంటి తప్పు వెయ్యాల్సిందేనండి. ఉద్యమాల్లో ప్రభుత్వ ఆస్తులకు కలిగే నష్టం మీద ఈమధ్య కోర్టు ఒక తీర్పు ఏదో ఇచ్చినట్టు గుర్తు - సదరు నష్టాన్ని ఉద్యమాన్ని నడిపిన పార్టీలే భరించాలని. ఆ లెక్క ప్రకారం, కాంగ్రెసు, తెదేపా, తెరాస,.. వీళ్ళందరికీ తప్పు వెయ్యాలి.
ఆర్టీసీ పరిస్థితి గురించి ఆ మధ్య ఒక వార్త చదివాను. గత కొన్నేళ్ళుగా సమర్ధంగా పనిచేసి, ప్రస్తుతం లాభాల బాటలో ఉంది అని దినేష్ రెడ్డి కొన్ని నెల్ల కిందట చెప్పాడు. ఇప్పుడు హఠాత్తుగా నష్టాలొచ్చాయని అన్నారంటే దానికి ఉద్యమమే కారణమై ఉంటుంది -ఆస్తుల నష్టం, వ్యాపార నష్టం. ఇప్పుడు ఉద్యమం ఆగిపోయింది కాబట్టి, వ్యాపార పరిస్థితి మెరుగుపడాలి. దానికోసం చార్జీలు పెంచనక్కరలేదు. ఇక, ఉద్యమంలో కోల్పోయిన ఆస్తుల విలువను రాబట్టుకోవాలి. అందుకు చార్జీలు పెంచడం సమంజసమేనా!!? ఆ నష్టం పూడాక, చార్జీలను మళ్ళీ తగ్గిస్తారా?
i support minerva's comment
ఉద్యమాల నష్టాన్ని తప్పనిసరిగా వాటినినడిపిన/నడిపించిన పార్టీలకి మత్రమే కాదు, ప్రభుత్వఅస్తులని తగలేస్తుంటే ప్రత్యక్షప్రసారం చేసి ప్రోత్సహించే వార్తాచానళ్ళకికూడా తప్పు వెయ్యాలి.
Post a Comment