ఇండియన్ క్రికెట్ లో గవాస్కర్ తరువాత సచిన్ శకం లాగ , తెలుగు సినిమా పాట ప్రస్థానం లో ఘంటసాల తరువాత శకం మన "బాలు" ది (పద్మశ్రీ. డా. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు అనేకంటే "మన బాలు" అనుకుంటేనే ఆత్మీయంగా అనిపిస్తుంది కనుక టైటిల్ లో అలా సంబోధించా...అయినా గవాస్కర్ కి, ఘంటసాలకి పోలికేంట్రా కుంకా...అని తిట్టుకుంటున్నారా? ఏమో నాకలా అన్పించింది అంతే! ).
ఎన్టీఆర్ కి పాడినా, ఏయన్నార్ కి పాడినా, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి...ఇలా ఎవరికీ పాడినా వాళ్ళ గొంతుల్లోకి పరకాయ ప్రవేశం చేస్తూనే తన గాత్ర ధర్మాన్ని తప్పకపోవడం బాలు ప్రత్యేకత. కళ్ళు మూసుకుని వింటే బాలు గొంతు "కనిపించేలా", ఇది "బాలు పాట" అని చెప్పే స్థాయిలో తనదైన ముద్ర వేసిన ఈ నటుడు, గాయకుడు, వ్యాఖ్యాత, సంగీత దర్శకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్... నిర్మాతగా కూడా అభిరుచిని చాటుకున్నాడు. నేడు ఆ 'బాలు'డి బర్త్ డే సందర్భంగా ఆయన తొలిపాట, తొలినాటి ఫోటోలతో పాటు అంతటి గాయకుడిని మనకు పరిచయం చేసిన శ్రీ ఎస్.పి కోదండపాణి గారి ఫోటో కూడా జత చేస్తున్నాను. మన బ్లాగ్మిత్రులందరి తరపున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు.
కొన్ని అరుదైన ఫోటోలు
1 (బాలిక కాదు..."బాలు"డే)
2 కాలేజి ఏజీలో..టీనేజి మోజులో
౩. నా పాట పంచామృతం
4 . పాటకు పద్మశ్రీ
5. ఆబాలగోపాలం మెచ్చిన ఈ"బాలు"ని మనకు పరిచయం చేసిన శ్రీ ఎస్.పి. కోదండపాణి
6. శ్రీ ఎస్.పి. కోదండపాణి గారితో ఎస్పీబీ
(మనలో మన మాట ఈ ఫోటోలు ఆయన అఫీషియల్ సైట్ http://www.spbindia.com/ లోం
6 comments:
superb!!
many happy returns to balu's fans like us!!!
pl. check the song. it is not working.
చాలా థేంక్స్ అండి..అరుదైన పొటులు చూపారు ..:)
ఓహ్ మంచి ఫొటో లు పెట్టారు,thanks!
బావుంది మీ ప్రయత్నం..మెదడు ఒక వైపు పాటలు తోడి పోస్తుంటే, రెండో వైపు వాటిని లెక్కిస్తుంది. కొన్ని ఆయన పాడాల్సినవే అన్నంతగా ప్రాణం పోసుకున్నాయా గళాన.
wonderful collection.
thanq
బాగున్నాయండీ ఫోటోస్. నేను కూడా కొన్ని నా బ్లాగ్లో పెట్టాను చూడండి.
http://trishnaventa.blogspot.com/2010/06/rare-photos.html
Post a Comment