Saturday, June 12, 2010

"సాయంత్రం సినిమాకెళ్దాం"

మొన్న వేదం సినిమాకి ప్రసాద్స్ లో టికెట్లు ఆన్ లైన్ లో బుక్ చేస్తుంటే నాకెందుకో చిన్నప్పుడు సినిమా అంటే ఇంట్లో జరిగే తంతు గుర్తొచ్చింది. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ అన్నమాట........ 

"సాయంత్రం సినిమాకి వెళ్తున్నాం, నాన్నగారు ఆఫీస్ నుంచి, నేను స్కూల్ నుంచి వచ్చేటప్పటికే మీ హోం వర్క్ లు పూర్తి చేసేసుకుని ఉండండి" పొద్దున్నే మా అమ్మగారి ఆర్డర్ లాంటి ఇన్ఫర్మేషన్ తో మాలో ఎక్సైట్మెంట్ మొదలయ్యేది. స్కూల్లో అడిగిన వాడికి, అడగని వాడికి అందరికీ "మేము ఈ వేళ సినిమాకి వెళ్తున్నామోచ్" అని సగర్వంగా చాటింపు వేసుకుని, స్కూల్ అవగానే ఇంటికోస్తూ దార్లో గోడల మీద ఉన్న వాల్ పోస్టర్ల లోంచి కృష్ణ, ఎన్టీఆర్ ల సినిమా పోస్టర్లను ఆప్యాయంగా చూస్తూ వీటిలో ఏదో ఒకదానికి మేము ఈ వేళ వెళ్లబోతున్నాము అని గర్వంగా పక్కన నడిచే ఫ్రెండ్ గాడికి చెప్తూ వాడి  అసూయతో కూడిన చూపును ఎంజాయ్ చేస్తూ ఇంటికి వచ్చి గబా గబా హోమ్ వర్క్ చేసేసుకునేవాళ్ళం. ఇంతలో మా అమ్మగారు కూడా స్కూల్ నుంచి రావడంతో మా చాయిస్ ల పర్వం మొదలయ్యేది. "అమ్మా కృష్ణ/ ఎన్టీఆర్ సినిమాకి వెళ్దాము...ప్లీజ్ ...అని గారంగా మారం చేసేవాళ్ళం" (అవును మరి అప్పట్లో కృష్ణ, ఎన్టీఆర్ లకే ఫైటింగ్ లు అవీ వచ్చు, శోభన్ బాబు కాస్త పరవాలేదు, నాగేశ్వరరావు మాత్రం వేస్ట్ ఫెలో ..అస్సలు ఫైటింగ్ లు రావు...ఇదీ మా గాఢమైన అభిప్రాయం). ఇంట్లో మా పేరెంట్స్ తొక్కలో ఏ నాగేశ్వరరావు స్టొరీ సినిమాకో ఓటు వేసేవారు (అప్పుడు మాత్రం చెప్పొద్దూ...ఉదయకిరణ్ స్టైల్ లో "ఈ పెద్దోల్లున్నారే వీళ్ళకసలు టేస్టే లేదు..ఫైటింగ్ లు లేని సినిమాలు చూస్తామంటారేంటో అని మా చెడ్డ ఖోపం వచ్చేసేది). ఇహ చూస్కోండి ఎప్పుడూ అధికార, విపక్షాల్లా కొట్టుకునే నేను, మా తమ్ముడు ఈ ఒక్క విషయం లో మాత్రం  ఏకాభిప్రాయానికి వచ్చేసి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తపరిచేవాళ్ళం. మొత్తం మీద మా బాధ పడలేక మా సెలక్షన్ కే ఒప్పుకునేవాళ్ళు. వెళ్లి రిక్షాని పిలుచుకు రమ్మనే వారు. 

ఇక రిక్షాకి  టాప్ తీయిన్చేసి ఎలక్షన్ లో భారీ మెజార్టీ తో గెలిచిన ఎమ్మెల్యే ఓపెన్ టాప్ జీప్ లో ఊరేగినట్టు నిలబడి రోడ్డు మీద మా ఫ్రెండ్స్ ఎవరయినా కనిపిస్తే ఊరంతా వినిపించేటట్టు ..."ఒరేయ్ మేం సినిమాకి వెళ్తున్నాం"..అంటూ అరవడం, ఆ వెనుకే కూర్చుని ఉన్న మా నాన్నగారు నా రెక్కపట్టి అరచింది చాలు పడతావు కూర్చో అంటూ మా అమ్మగారి వాళ్ళో నన్ను కూలేయడం జరిగేవి. రిక్షా జగన్నాధపురం వంతెన దాటి సినిమాహాల్ స్ట్రీట్ లో ప్రవేశించింది మొదలు (సినిమాహాల్ స్ట్రీట్  అంటే మా కాకినాడ వాళ్లకి అర్ధమై పోతుంది...మిగిలిన వాళ్ళ కోసం మా ఊళ్ళో సినిమా హాల్స్ అన్నీ ఒకే స్ట్రీట్ లో ఉంటాయి..దాన్ని సినిమాహాల్ స్ట్రీట్ అంటారు). అటూ ఇటూ ఉన్న థియేటర్స్ లో ఉన్న సినిమా పోస్టర్లు చూసుకుంటూ (అవన్నీ ఎప్పుడు చూస్తానో అని మనసులో అనుకుంటూ) మొత్తం మీద హాలు కి చేరేవాళ్ళం. అక్కడ లైన్ ని బట్టి మా పేరెంట్స్ ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్లి టికెట్స్ తీసుకునే వాళ్ళు. లోపలి వెళ్తే ఇంకా డోర్ తీయడు కాబట్టి బయటే కాసేపు వెయిట్ చెయ్యాల్సి వచ్చేది. అక్కడున్న కూల్ డ్రింకులు, పాప్ కార్న్ చూడగానే నాకు, మా తమ్ముడికి ఒక్కసారిగా దాహం, ఆకలి గుర్తొచ్చేవి. "అమ్మా దాహం వేస్తోంది...కూల్ డ్రింక్ తాగుతా" రిక్వెస్ట్ లాంటి కన్ఫర్మేషన్. "ఇప్పుడు తాగితే మళ్ళీ ఇంటర్వెల్ లో ఉండదు మరి" మా అమ్మగారి చిన్న బెదిరింపు. అప్పుడు సంగతి అప్పుడు చూస్కుందాం లే అని ఓ.కే. అనేవాళ్ళం.  కూల్ డ్రింక్ తీసుకుని రెండు సిప్ లు తాగుతామో లేదో హాల్ లోపలికి రావచ్చంటూ బెల్లు మోగేది. ఆదరాబాదరాగా ఆ డ్రింక్ సీసాను పట్టుకుని స్వాగతం స్లైడ్ నుంచీ ఎక్కడ మిస్సయిపోతామో అని లోపలి వెళ్ళిపోదామని గోల మొదలు పెట్టేవాళ్ళం. 

లోపలకి వెళ్లినప్పటినుంచీ  "అమ్మ ఇంకా సినిమా రావట్లేదేంటి? ఎప్పుడు వేస్తారు? ఇంకా ఎంత టైం పడుతుంది? కృష్ణ ఆ తెల్లగోడ (స్క్రీన్) వెనక్కాల రెడీ అవుతున్నాడా? ఇలాంటి యక్ష ప్రశ్నలతో మా నాన్నగారు నోర్మూసుకుని కూర్చోండి అని మమ్మల్ని గట్టిగా కసిరే దాకా అడిగే వాళ్ళం. ఇంతలో స్క్రీన్ మీద "స్వాగతం" అన్న స్లైడ్ పడగానే ఒక్కసారిగా నోర్మూసుకుని స్క్రీన్ కి అంకితం అయిపోయేవాళ్ళం. సినిమా మొదలు.

ఇంటర్వెల్ లో కూల్ డ్రింక్స్ తీసుకొస్తానని బయటి కొచ్చే మా నాన్నగారితో పాటు నేను వస్తానని నేను, నేను కూడా అంటూ మా తమ్ముడు నడిచేవాళ్ళం. బయట సమోసాలు, పాప్ కార్న్, పకోడీలు (ఇవి ఆలూ బొండాల సైజు లో ఉండేవి...భలే టేస్టీగా ఉండేవి లెండి), ఐస్ క్రీం, కూల్ డ్రింక్స్ ఇలా అన్నిటినీ చూస్తూ  వివాహ భోజనంబు పాటలో ఎస్వీఆర్ లా ఫీలయిపోయి చివరికి ఐస్ క్రీం, పాప్ కార్న్ కొనిపించుకుని  లోపలికి వచ్చేవాళ్ళం. తీరా చూస్తే ఇంకా "ముందు సీట్ల పై కాళ్ళు పెట్టరాదు" స్లైడ్ కూడా పడేది కాదు. సినిమా స్టార్ట్ అయితేనే ఐస్ క్రీం తినడం స్టార్ట్ చెయ్యాలన్నది మా ఆలోచన. ఒక పక్క ఐస్ క్రీం కరిగిపోతూ ఉంటుంది...అవతల సినిమా ఇంకా స్టార్ట్ చెయ్యడు..(దేవుడా బాలకృష్ణ కి కూడా ఇన్ని కష్టాలు రాకూడదు). ఎలాగైతేనేం సినిమా స్టార్ట్ అవడం పాపం ముందు ఐస్ క్రీం తినేసి ఆ తరువాత పాప్ కార్న్ అవగొట్టి, ఫైటింగ్ సీన్లలో కృష్ణ కొట్టలేక పోతే మేం వెళ్లి హెల్ప్ చేద్దాం అన్నంత ఉత్సాహంతో కుర్చీ సీట్  కి కొద్దిగా ఉన్న చిరుగులోంచి స్పాంజ్ లాగుతూ సినిమా లో లీనమయ్యే వాళ్ళం. పెద్ద ఫైటింగ్ అయిపోయాక పోలీసులు కనిపించగానే ఇంక సినిమా అయిపోబోతోందన్న విషయం "శుభం" కార్డు పడకుండానే అందరికీ అర్ధమై పోయి ఎలా నిలబడ్డారబ్బా అని బోల్డంత హాశ్చర్యపోయి బయటకి వచ్చేవాళ్ళం.

ఇంటికి వచ్చి భోజనం చేసాక నిద్ర పోయే టైం లో సినిమాని మళ్ళీ మనసులో ఒకసారి "నెమరేసి", రేపు స్కూల్లో చెప్పాలి అనుకుంటూ చాలా హ్యాపీ గా నిద్రపోయేవాళ్ళం. 

అదండీ ఫ్లాష్ బ్యాక్...ఇప్పుడు అదేం లేదు. టికెట్లు ఆన్ లైన్ లో బుక్ చేసుకుని పావుగంట ముందు థియేటర్ కి వెళ్లి, ఏ క్లైంట్ ఎప్పుడు ఫోన్ చేస్తాడో, అనుకుంటూ సగం మనసు మొబైల్ మీద ఉంచి, ఏదో వచ్చామా, చూసామా అనే తప్ప మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తూ సినిమా చూసి ఎన్నేళ్ళయిందో....:(

11 comments:

Rk said...

నీ వల్ల నాకు మన పాత కాకినాడ గుర్తుకు వొచ్చింది.

సంతోష్ said...

memu theatres ki velladam manesam gaa..
only torrents..

హరే కృష్ణ said...

baaga chepparu
superbly written

ఆ.సౌమ్య said...

భలే చెప్పారండీ, మేమూ ఇలాగే ఫీల్ అయ్యేవాళ్ళం. రిక్షాలెక్కి వెళ్ళేవాళ్ళం కాకపోతే పాత సినిమాలకి, విశ్వనాథ్ సినిమాలకి అప్పుడప్పుడూ చిరంజీవి సినిమాలకి.

ముఖ్యంగా జగదేకవీరుడు-అతిలోకసుందరి సినిమాకి ఇలా రిక్షా ఎక్కి సంబరపడిపోతూ వెళ్ళడం నాకు బాగా గుర్తు. మర్నాడు ఆ కథని చిలవలుపలవలుగా బడిలో స్నేహితులకి చెప్పడం.

చిన్ననాటి రోజులు గుర్తు చేసారు thanks!

ఇప్పుడయితే ఈ ఊరుగాని ఊరులో సినిమాలా, రిక్షాలా! only downloads.

సినిమా వచ్చిన నెలకి డౌన్ లోడ్ చేసుకుని చూడడం అంతే.

సుజాత వేల్పూరి said...

"నాగేశ్వరరావు మాత్రం వేస్ట్ ఫెలో ..అస్సలు ఫైటింగ్ లు రావు... సేమ్ ఫీలింగ్ ఇక్కడ కూడా! ఒట్టి ఆడంగోడు ఎప్పుడూ ఆ వాణిశ్రీ వెనక పడుతూ అని పన్లో పనిగా టైట్ బట్టలు వేసుకుంటుందని వాణిశ్రీని కూడా తిట్టేశేవాళ్ళం! అప్పట్లో ఈ నాగేస్రావ్ వాణిశ్రీ సినిమాలు సెకండ్ రిలీజో పదో రిలీజో అయినప్పటి సంగతి ఇదంతా! ఫస్ట్ రిలీజప్పుడు పుట్టే ఉండంగా మనం!

రిక్వెస్ట్ లాంటి కన్ఫర్మేషన్..లు మా నాన్నగారి దగ్గర అసలు పని చేసేవి కాదు. అన్నీ ఇంటర్వల్ లోనే!

"ముందు సీట్లపై కాళ్ళు పెట్టరాదు"అనే స్లైడ్ చూసే దాకా ఆ పని చెయ్యొచ్చనే అయిడియా వచ్చేది కాదు. చూడగానే మాత్రం వెంటనే అమలు చేయాల్సిందే!

బాగుంది, మీ టపా నన్ను మా వూర్లో సూపర్ స్టార్ కృష్ణా సినిమాకి తీసుకెళ్ళింది..రిక్షాలో!

Unknown said...

సూర్యకళావతి, సంతోష్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వాళ్ళిద్దరూ ఖాళీ సమయాలలో నాగవళి నది ఒడ్డున మరియు పార్కులలో సంచరిస్తుంటారు. పట్టణానికి తొమ్మిది కిలో మీటర్ల దూరాన ఉన్న రైల్వే బ్రిడ్జి కింద కూడా ఒంటరిగా కలుసుకుని కబుర్లు చెప్పుకుంటుంటారు. ఒక రోజు సూర్యకళ, సంతోష్ లు పట్టణానికి 15 కిలో మీటర్లు దూరాన ఉన్న వంశధార రైల్వే బ్రిడ్జి కింద కలిసి కబుర్లు చెప్పుకోవాలనుకున్నారు. వంశధార రైల్వే బ్రిడ్జి శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ కి 5 కిలో మీటర్లు దూరం. ఆ బ్రిడ్జి దగ్గరకి వెళ్ళడానికి రోడ్ లేదు. స్టేషన్ నుంచి పట్టాల పక్కన నడుస్తూ బ్రిడ్జి వైపు పయనించారు సూర్యకళ, సంతోష్ లు. ఇద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుంటూ పట్టాలకి, పొలాలకి మధ్య ఉన్న న్యారో పాస్ లో నడిచారు. ట్రైన్ వస్తున్నప్పుడు పట్టాల పక్కన పొలాలలోకి జరగసాగారు. ఇలా వంశధార రైల్వే బ్రిడ్జి దగ్గరకి చేరుకున్నారు.

బ్రిడ్జి కిందకి దిగారు. నదిలో ఇసుక దిబ్బల మీద నడుస్తూ మనోహరమైన ప్రకృతిని చూసి ఆనందిస్తున్నారు. ఇలా నడుస్తుండగా సూర్యకళని "నీ వయసెంత?" అని అడిగాడు సంతోష్. ఎందుకు? అని అడిగింది సూర్యకళ. చెప్పొచ్చు కదా అని అన్నాడు సంతోష్. చెప్పను అని అంది సూర్యకళ. చెప్పడం ఇష్టం లేదా? అని అడిగాడు సంతోష్. నేను వయసులో నీ కంటే పెద్దదాన్నైతే నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటావా? అని అడిగింది సూర్యకళ. సంతోష్ సమాధానం చెప్పలేదు. భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ ముఖ్యం కానీ వయసు ముఖ్యం కాదు. నువ్వు మాదిగ కులస్తుడివి, మేము క్షత్రియులం. కులాంతర వివాహం చేసుకునే ధైర్యం ఉన్న నీకు వయసు గురించి ఆలోచించకుండా పెళ్ళి చేసుకునే ధైర్యం లేదా? అని అడిగింది సూర్యకళ. నీ వయసెంతో చెప్పకపోతే నేను నిన్ను పెళ్ళి చేసుకోను అని అన్నాడు సంతోష్. నేను చెప్పను, వయసు గురించి పట్టించుకోకుండా నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటానంటే నిన్ను ప్రేమించడానికి నాకు అభ్యంతరం లేదు, నీకు ప్రేమ కంటే వయసు ముఖ్యం అనుకుంటే నేను చేసేదేమీ ఉండదు అని అంది సూర్యకళ. నేను ఇక్కడ నిన్ను రేప్ చేస్తే ఏమి చేస్తావ్? అని అడిగాడు సంతోష్. సూర్యకళ తన హ్యాండ్ బ్యాగ్ నుంచి పెర్ఫ్యూమ్ బాటిల్ తీసింది. ఇదేమిటో తెలుసా? యాసిడ్. నేను నీ మీద యాసిడ్ పోస్తే ఏమి చేస్తావ్? అని అడిగింది సూర్యకళ. వీడు టిపికల్ మగ దురహంకారి అని తెలియక వీడ్ని ప్రేమించాను అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సూర్యకళ.

సూర్యకళ ఇంటికి వచ్చింది. ఇంత సేపు ఎక్కడ తిరిగొస్తున్నావు? మాదిగ సంతోష్ గాడితోనేనా? అని అడిగాడు తండ్రి సూర్యసేన వర్మ. నేను, సంతోష్ విడిపోయాం. ఇప్పుడు మేము ప్రేమించుకోవడం లేదు అని అంది సూర్యకళ. నిజంగానా? అని అడిగాడు సూర్యసేన వర్మ. ఔను నాన్నా, పెళ్ళి విషయంలో అభిప్రాయాలు కలవలేదు. పెళ్ళి చేసుకోకపోతే రేప్ చేస్తానన్నాడు. ఈ పెర్ఫ్యూమ్ బాటిల్ చూపించి, ఇది యాసిడ్ అని, నీ మీద పోస్తానని బెదిరించి వచ్చాను అంటూ బ్యాగ్ నుంచి పెర్ఫ్యూమ్ బాటిల్ తీసింది సూర్యకళ. మాదిగోడిని ప్రేమించొద్దు అని నేను చెపితే వినలేదు, మాదిగోళ్ళ సంస్కారమే అలాంటిది అని అన్నాడు సూర్యసేన వర్మ. సంస్కారం కులాన్ని బట్టి ఉండదు నాన్నా, మీరు పొరపడుతున్నారు. నేను కులం కోసం అతన్ని వదిలెయ్యలేదు. అతను వయసులో తన కంటే చిన్న అమ్మాయినే పెళ్ళి చేసుకుంటాడట, అతనికి ప్రేమ కంటే వయసు ముఖ్యమట. ప్రేమ కంటే వయసు ముఖ్యమైతే ప్రేమ బలహీనమైనది అనుకోవాలి. అందుకే నేను అతన్ని వదిలేశాను అని అంది సూర్యకళ. కులం సంగతి సరే, ఈ విషయంలో నువ్వు చేసినది బాగుంది. పెళ్ళి విషయంలో వయసు, ఎత్తు లాంటి సంకోచాలకి పోయేవాడు భార్యని ఏం గౌరవంగా చూస్తాడు? అలాంటివాడితో పెళ్ళికి ముందే తెగతెంపులు చేసుకుని నీ యశస్సుని నువ్వు నిలబెట్టుకున్నావు. నువ్వు నిజంగా యశోవతివే. 'సూర్యకళావతి' అనే పేరు నీ యశస్సుకి సరిపోయింది అని అన్నాడు సూర్యసేన వర్మ. ఇలాగైనా మీ కూతురుని అర్థం చేసుకున్నారు, థాంక్యూ నాన్నా అని అంది సూర్యకళావతి.


ఇలాంటి కధలతో తీస్తేనే సినిమా కి సోషల్ మెసేజ్ తో పాటు సినిమా పెద్ద హిట్ అవుతుంది
నేను అదే ప్రయత్నం లో ఇప్పుడు నల్గొండ వెళ్లి
మల్లె హైదరాబాదు లో ఉన్న దర్శకులకు నిర్మాతలకు నా కధను వినిపిస్తాను
పనిలో పనిగా ఈ నెల బ్లాగర్ల సమావేశానికి యూసఫ్ గుడా కృష్ణ కాంత్ పార్క్ లో జరిగే సమావేశానికి హాజరవ్వాలని అనుకుంటున్నాను

Unknown said...

నాగేశ్వర రావు స్త్రీ వాడి అందుకే ఆటను కనీసం ఇద్దరు హీరోయిన్లని పెట్టుకుంటాడు
ఇద్దరికీ అవకాసం ఇచ్చేవాడు ఖచ్చితంగా స్త్రీ వాదే
అది తెలియను కొంతమంది బ్లాగర్లు ఆడంగోడు లాంటి పరుష పదజాలం తో విమర్శిస్తారు
మహామహుల సాహిత్యం చదివిన నాకు స్త్రీవాదం అంటే నాకు బాగా తెలుసు
ఖచ్చితంగా నాగేశ్వరరావు స్త్రీవాదే అందుకే ఇద్దరి కోడళ్ళకు వాళ్ళ ఇంటిలో స్తానం ఇచ్చాడు

bharadwaj said...

baaga cheppav baavaa. First time friends tho cinemaki velladaniki 10th class lo maa amma tho pedda yudham cheyyalsi vachindhi(Lankeswarudu). 5th class lo first time sivarartriki midnight show, nela ticket ki MAHA NAGARAM LO MAYAGADU cinema choodadam eppatiki marchipolenu. Eepatiki artham ayyuntnundhi manam bayankaramaina chiru fan ani.

తృష్ణ said...

భలే, మీది కాకినాడా? మాదీనూ. మేం బెజవాడలో పెరిగినా, మా అన్నయ్య అక్కడే పెరిగాడు. చదువంతా అక్కడే. శెలవులకు ఎప్పుడూ కాకినాడే. సినిమాలు కూడా బానే చూసాం ఆ ఊళ్ళో. ఈ టపా మా అన్నయ్యకు చూపిస్తే ఎగిరి గంతేసి...మీరు రాసిన పెద్ద సమోసా సైజు పకోడిలు అవీ గుర్తు తెచ్చుకుని , 'మా కాకినాడ' అని తెగ సంబర పడిపోయాడు.
బాగుందండి టపా.

మొన్నఒకసారి నా పాటల లిస్ట్ బాగుందన్నారు కదా, కొత్తగా మ్యూజికల్ బ్లాగ్ ఒకటి ఓపెన్ చేసానండి. లింక్ ఇస్తున్నాను. వీలున్నప్పుడు చూడండి.
http://samgeetapriyaa.blogspot.com

vinaybhasker said...

chaalaa bagundandi,ee link ni TB lo advertsiement thread lO pettinanduku santhOsham.

hmm chinnapillalandariki ilaagE anipistundi.kakapOthE nEnu putti cinema ani telisEsariki chiru,nagarjuna generation vachchEsindi,inti pakkanE hall unDEdi daanitho chaala cinemalakE veLLevaLLamu, naaku baag gurthunna scene ek, do ,theen song...Tarvaata siva lOni jagada jagada song,inka tarvaata samvatsaraaniki oka cinemanE ,inter vijayawada lO ,akkada queu lO nunchOvadam,budget prakaaram karchu pettadDam,ippudu online bookings,leda torrents entha maaripOyaamu pch maLLi childhood days ni gurthuchEsukunElaaa chEsinanduku dhanyavadaalu

మంచు said...

ఒహొ.. మీది కాకినాడ...మాది కాకినాడ...అయితే ఇకనుండి బొల్డు కామెంట్లు ఫ్రీ మీకు :-D:-D
భలే గుర్తుచేసారు సినిమా అనుభవాలు.........