ఎంకి, నాయుడు బావ తెలియని, కనీసం ఎప్పుడూ వాళ్ళ పేర్లయినా వినని తెలుగోడు ఉంటాడా? జానుతెలుగు జానపద జంట వాళ్ళు. ఒకరి కోసం ఒకరు. అసలు నన్నడిగితే పెళ్ళయిన కొత్తలో ప్రతి వాడికి భార్య ఎంకి లాగే కనిపిస్తుంది (పాతబడితే? అని అడగకండి...నాకు ఇంకా ఆ స్టేజి రాలేదు..బహుశా "ఎంకి" కాస్తా "పెంకి" గా కనిపిస్తుందేమో! :) ).
నండూరి సుబ్బారావు గారి "ఎంకి పాటలు" పున్నమి రాత్రి పెరట్లో జాజిపందిరి కింద వాలు కుర్చీలో పడుకుని కళ్ళు మూసుకుని తన్మయత్వంతో వింటూంటే నా సామిరంగా...అదీ మంగళంపల్లి బాలమురళి కృష్ణ, శ్రీరంగం గోపాలరత్నం లాంటి వాళ్ళ గొంతులో ఎంకి, నాయుడు బావల ఊసులు వింటుంటే మనసుకు మంచిగంధం పూసినంత చల్లగా ఉంటుంది. (అసలు ఈ పాటలు పాడి వాళ్ళు ధన్యులయ్యారో...వాళ్ళ గొంతులో వినబడి ఆ పాటలు పుణ్యం చేసుకున్నాయో....చెప్పడం కష్టం) నెట్లో వెతికితే ఓ పాతిక ముప్ఫై పాటల దాకా దొరికాయి. రెండు భాగాలుగా పోస్ట్ చేస్తున్నా. (పెద్ద గ్యాప్ ఏమీ ఇవ్వనులెండి ఈవేళ....రేపు అంతే ). తనివి తీరా వినండి. క్రింద లింక్ లు ఇస్తున్నా క్లిక్ అండ్ ఎంజాయ్ :)
(ఇవన్నీ మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు పాడినవే. రేపు ఇద్దరి గొంతులూ "విందు"రుగాని...)
6 comments:
Thank you shanky!
ఎంకిపాటలన్నీ మంగళంపల్లి, శ్రీరగం కలిపి పాడారు...అద్భుతంగా ఉంటాయి. మంచి విషయం రాసారు. Thanks!
థాంక్స్ అండి.మంచి పాట ల గురించి చెప్పారు.
Thanks for sharing...waiting for next part.
Thank you. God bless you.
May God also bless the person who uploaded them
ఎంకి , తెలుగు వారికి నండూరి అందించిన రతనాల బొమ్మ;
వెలుగు - చీకటులకు చక్కని భాష్యం చెప్పిన జానపద తరువుల కొమ్మల ఊగాడే వెన్నెలల కొమ్మ!
Post a Comment