Thursday, January 6, 2011

జస్ట్ రాయాలనిపించింది అంతే - చివరి భాగం -.... యాభై అయ్యాయి కదా!!! ఇంక చాల్లెండి. మిమ్మల్ని మరీ ఎక్కువ హింసిస్తున్నానేమో అనిపిస్తోంది.


వీటిని హైకూలు అనచ్చో లేదో నాకు తెలియదు. జస్ట్ రాయాలనిపించింది అంతే. నచ్చితే భుజం తట్టండి

౩౭ 
తెలంగాణా ఉద్యమం
జనాల కన్నా
జేఏసి లే ఎక్కువున్నాయి

౩౮ 
ఛానెల్లో చర్చలు
ఎప్పుడు చూసినా
అవే మొహాలు 

౩౯ 
అతివృష్టి
ఎటుచూసినా నీళ్ళే
పొలంలో, రైతు కళ్ళలో

౪౦ 
గతేడాది పిల్లలకి
వేసవి శలవలతో పాటు
వేర్పాటు శలవలూ వచ్చాయి 

౪౧ 
కమిటీ రిపోర్టిచ్చింది
ఏడాది క్రితం పరిస్థితికి
తీసుకొచ్చి వదిలేసింది 

౪౨ 
శ్రీ కృష్ణ కమిటీ
కొండని తవ్వి
ఎలకనీ వదిలేసింది 

౪౩ 
అందరికీ ఆమోదయోగ్యం
అంటే
ఎవరికీ అక్ఖర్లేదని అర్ధం

౪౪ 
ఎవరన్నారు 
దేశం క్రీడల్లో వెనకుందని?
నేతలు జనాలతో ఆడుకోవట్లేదూ

౪౫ 
మార్కెట్ కెళ్లా
జేబు ఖాళీ అయి
సగం సంచి నిండింది 

౪౬ 
డైలీ సీరియల్ హీరొయిన్ 
వీలునామాలో 
తన పాత్ర మునిమనవరాలికి రాసింది 

౪౭ 
మా ముత్తాతకి , శ్రీ శ్రీ కి  
ఒక పోలికుంది
ఇద్దరూ కీర్తి శేషులే 

౪౮ 
ఎవరో అడిగారు నా వయసెంతని
12045 డైలీ సీరియల్ ఎపిసోడ్లు 
నా సమాధానం

౪౯ 
మా ఊరికి రైల్లో ప్రయాణం
రైలు ముందుకి
ఆలోచనలు వెనక్కి

౫౦ 
దేవతలకే కాదు మనకీ తెల్సు 
అమృతం రుచి
కాపోతే మనం అమ్మచేతి వంట అంటాం 



ఇంక చాలు మహాప్రభో అనుకుంటున్నారా? ఏదో మీ అభిమానం. ఈ సారికిలా కానిచ్చేయండి.










8 comments:

తృష్ణ said...

అన్నీ ఓరోజెందుకు
సీరియల్లా వెయ్యల్సింది కదా
హిట్లు పెంచేవాళ్ళం

:):) ఇదెలా ఉందండి?
అన్నీ బాగున్నాయి. good work.

Ennela said...

hamma hamma,,,chachaanu navvaleka....tuitoring chestaara yela wraayaalo? nenu mee modati student....

Sudha Rani Pantula said...

యాభై అయితేనేం....
చక్కగా ఉన్నాయి.
వేసవి శలవలు,వేర్పాటు శలవలు, అమ్మ చేతివంట, ఎటు చూసినా నీళ్ళే....
చాలా బాగున్నాయి.
భుజం తడుతున్నామబ్బాయ్...
శతమానంభవతి....అంటే వంద కొట్టండి అని అర్థం.

Jyothi said...

చాలా బాగున్నైండి. మనస్పూర్తిగా హాయిగా నవ్వుకున్తున్నాం. ఇంకా రాయండి సర్, ౫౦ చాలు అని అనుకోకుండా.. ధన్యవాదములు

Syam Ghana said...

Orai. Bhale Chamatkaramgaa Raasavu. Baagu Baagu Nee Blaaagu

Syam Ghana said...

Orai. Bhale Chamatkaramgaa Raasavu. Baagu Baagu Nee Blaaagu

Radha said...

మీరు రాసినది కాదా హైకూ
అందులో సందేహం కైకూ
ఇక రాయడం మానైకూ
యాభైతో మాత్రం ఆపైకూ....
ప్రాసకోసమే ఏకవచన ప్రయోగం..
అన్యధా భావించకండేం.
యాభైకి అర్థశత వందనాలు.
వందకి వంద వందన చందనాలు.

Anonymous said...

excellent.