ఏదో ఉద్ధరించేస్తానని ఉత్తర రాకుమార ప్రజ్ఞలు పలికి రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి ముచ్చటగా మూడేళ్ళు కూడా పార్టీని నడపలేక ఓటేసిన జనాల నమ్మకాన్ని నట్టేట ముంచి సొనియమ్మ పాదాల ముందు సాగిలపడిన వైనం నాకు భలే చికాకు కలిగించింది. పదవి రాకపోతే పార్టీని నడపలేం అనుకున్నాడో ఏమో మరి. అందుకే అసలు చిరంజీవి రాష్ట్రం లో పెరుగుతున్న ఈ రాజకీయ పోరు లో నిలవలేనని నిర్ణయించుకుని ఏ పార్టీలో చేరాలా అని సోనియానే సలహా అడిగితే ఎలా ఉంటుందో అన్న చిలిపి ఆలోచనే ఈ పేరడీ. దీనికి నేను తీసుకున్నా పాట రక్షకుడు సినిమాలో "సోనియా సోనియా". ఆ పాట లింక్ క్రింద ఇస్తున్నాను. అది వింటూ ఇది చదివి ఎలా వుందో చెప్పండి.
రక్షకుడు సినిమాలో పాట లింక్
సోనియా సోనియా
సోనియా...నీ దయ
సోనియా...నీ దయ
(చిరంజీవి వీరాభిమానులూ.. దీన్ని కేవలం సరదాగానే తీసుకోండి)
రక్షకుడు సినిమాలో పాట లింక్
సోనియా సోనియా
సోనియా...నీ దయ
సోనియా
నీ దయ
సోనియా సోనియా
దేవతంటి సోనియా
పెరుగుతోందే రాజకీయ పోరు
పార్టి ముందు రెండు రూట్లు
బాబుదొకటి, అమ్మదొకటి
రెండిట్లో ఏది నాకు బెటరు?
సంటైమ్స్ బాబే వేస్టు
సంటైమ్స్ నేనో ఘోస్టు
ఇచ్చే వరములు చూసి
తీస్కో ఏదో రూటు || సోనియా సోనియా ||
ఓ పదవి ఇచ్చే పార్టీలో దూకి
జండా పీకేస్తే అది ఫేటు
ఆంటోని మాట బెటరంటూ నమ్మి
నీ శరణు జొస్తే అది గ్రేటు
పదవులు కోరుకునే వెధవలమల్లె
నా ఫ్యామిలినంతా
స్తుతి చేయడమే గ్రేటు
మిగతా నాయకుల దారిని పట్టి
నా భజనలు చేస్తూ
వెయిట్ చేయడమే ఫేటు
నీ పార్టి లోని బంటును నేనై
పదవిచ్చే దాక భజనే చెయనా
సంచులతో డబ్బుల్ నీ దోసిట పోసి
సీయం పోస్టయినా కొట్టకపోనా
పదవొచ్చే పార్టీలో దూకేస్తా అమ్మడూ
సోనియా సోనియా
దేవతంటి సోనియా
రెండిట్లో ఏది నాకు బెటరు?
జనమంతా వార్నీ
అనుకుంటూ చూసి
ఖాండ్రించి నా పై
ఉమ్మేస్తుంటే
కాంగ్రేసు మడిసై
నువ్విచ్చే పదవే
ఆ తిట్లు చీవాట్లు
మరపిస్తుంటే
రాజకీయాల్లో విలువలు లేవే
ఒక పధ్ధతి లేదే
జనమేమంటే ఏం లే!
సియం చేయకుంటే ఏడవరాదు
నువ్వు "నో" అనరాదు
ఏదో టైం లో చూస్తాలే
కాంగ్రేసు చెప్పింది బానేఉందే
ఏపిలో పరువుతో పని ఏముందే
సొనియమ్మ చెప్పాక తిరుగే ఉందా
పార్టీని కలపడమే లాభం కాదా
ఏపిని నడిపేది నాకంటి చూపేగా...
సోనియా
నీ దయ
ఇది నచ్చితే నా పాత పేరడీల మీద కూడా ఓ లుక్కేయండి (లేబుల్స్ సెక్షన్ లో పేరడీలు అని ఉంది)
(చిరంజీవి వీరాభిమానులూ.. దీన్ని కేవలం సరదాగానే తీసుకోండి)
10 comments:
hahahaha...
సినీ నటీ నటులకు రాజకీయాల్లోకి రావటం అక్కడ ఒక వెలుగు వెలగటం అనేది వాళ్లకి ఒక స్టాటస్ సింబల్ గా మారింది. అందులో కొద్ది మంది పక్కా రాజకీయ నాయకులయ్యారు, మిగిలిన వాళ్ళు కొన్నాళ్ళు సరదా తీర్చుకుని తెర మరుగయ్యారు. సినీ నటులు రాజకీయాల్లోకి వచ్చి ఏదో చేసేస్తారని అనుకోవటం అత్యాశే.
శంకర్ – ఓ లుక్కేయమన్నారుకదా అని మీ బ్లాగులోకి వెళ్లి పనిలోపనిగా ముత్యాలముగ్గు పాటకూడా వినేశాను. నేను కర్ణాకర్ణిగా విన్నదాంట్లో కొంత సమాచారం పంచుకోదలిచాను. హైదరాబాద్ లోని ‘ఇందిరా ధన్ రాజ్ గిరి పాలెస్’ లో ఆ చిత్రంలోని ప్రధాన సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రముఖ కవి గుంటూరు శేషేంద్రశర్మ ఈ పాట రాసారు. ఆయన ఇందిర భర్త. బాగా స్తితిమంతుడయిన ధన్ రాజ్ గిరి గారి కుమార్తె శ్రీమతి ఇందిర, శేషేంద్ర శర్మ గారి కవిత్వాన్ని మెచ్చి,నచ్చి ఆయనను పెళ్ళాడారు. ధనరాజ్ నిజాం నవాబుకు చేబదుళ్ళు ఇచ్చేవారని ఆ కుటుంబంతో బాగా సాన్నిహిత్యం వున్న వెనుకటి తరం జర్నలిస్ట్, కలం కూలీగా తనను తాను అభివర్ణించుకున్న జి కృష్ణ గారు మాతో చెప్పేవారు. సినిమాలకోసం శేషేంద్రశర్మ గారు రాసిన మొదటి పాటా, చివరి పాటా ఇదే అని రేడియోలో వార్తలు చదివిన డి వెంకట్రామయ్య గారు చెప్పారు. ముత్యాలముగ్గు చిత్రంలో జమీందార్ గా పాత్ర పోషించిన నటుడు కాంతారావు గారి బంగ్లాగా ఈ పాలెస్ ను చూపించారు. –భండారు శ్రీనివాసరావు
కెవ్వ్ కెవ్వ్ కెవ్వ్....అదరగొట్టారు :D
chiru pai mee SONIA..SONIA... perady song chala bagundi. ur blog very intresting
సూపరో...సూపరు! రక్షకుడులో ఎప్పుడు ఈ పాట విన్నా సోనియానే గుర్తుకొచ్చి చిరాకేసేది.ఇప్పుడు నవ్వొస్తుంది.హ్హహ్హహ్హా!
meeru bhale rasestu untarandi. chala chala bagundi. nakaithe direct ga chiranjeevi daggara padi vinipiste bagundu anipistundi. change kakapoyina shy feel avutademo mari. asalu party enduku pettado kuda marchipoyinattunnadu.
Your blogs are very interesting.
mee post ki dheetugaa comment cheyadaniki prayatninchi prati sari odipoina nenu... normal ga " chalaa bagundi" ani cheppi meetho poti padakunda migilipodam anukuntunna...
chala chala chala bagundi... Chiru vinali oka sari...
mi posts chala bagunnayi sir
i want to shre some feelings and situations can give ur email id
to my mail siri2satyams@gmail.com
Post a Comment