Monday, March 7, 2011

కాకినాడ కబుర్లు - కాకినాడంటే ముందుగా గుర్తొచ్చేది.ఆలో ఆలో ఆలో .....వచ్చేసారా? అద్గదీ సెబాసు. అబ్బే ఏం లేదండీ జస్ట్ నిన్న mhsgreamspet స్కూల్ పిల్లల (స్కూల్ జ్ఞాపకాలను తాజాగా ఉంచుకోడానికి పూర్వ విద్యార్ధులు ప్రారంభించుకున్న బ్లాగ్ ఇది. భలే ఇన్స్పైరింగ్ ఉందిలెండి ఆ ఆలోచన) బ్లాగులో " సుబ్బయ్య హోటల్ @ కాకినాడ… “రుచులు” చూడ తరమా?" అన్నపోస్ట్ చూడగానే మనసు విపరీతం గా ఎమోషనల్ అయిపోయింది. ఎందుకా? అదేం ప్రశ్నండీ.......? సొంతూరి సంగతులింటే మీకు మాత్రం ఆ మాత్రం ఫీలింగ్ ఉండదా ఏంటి? కాకినాడ లో పుట్టి పెరిగిన నాకు ఒక్క సారి ఆ పోస్ట్ చూడగానే ట్రియ్యుం ట్రియ్యుం అనుకుంటూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయి మనసులోనే మొత్తం కాకినాడంతా తెగ తిరిగేసి వచ్చాను. ఎప్పటినుంచో కాకినాడ మీద పోస్ట్ రాద్దాం అనుకుంటూ బద్ధకిస్తున్ననేను (ఈ ఆలోచనకు కారణం మన సాటి బ్లాగర్ తృష్ణ గారి అన్నయ్య . కాబట్టి ఈ సీరియల్ కబుర్లలో మొదటి పోస్ట్ ఆయనకే అంకితం.) ఇంక లాభం లేదు మనూరి విశేషాలు మొత్తం బ్లాగ్ప్రపంచం అంతా డప్పు కొట్టి చెప్పెయాల్సిందే అని తీవ్ర నిర్ణయం తీసేసుకున్నా. అంచేత మా ఊళ్ళో ఏరియాలు, ప్రత్యేకతలు, చూడదగ్గ ప్రదేశాలు ఓ సారి నా కళ్ళతో మీకు చూపించేద్దామని డిసైడ్ అయిపోయా. రెడీయా?

ఇదిగో ఇది చదువుతున్న కాకినాడ వాళ్ళు ఎవరైనా ఉంటే అమాంతం ఎమోషన్ ఫీలయిపోయి కళ్ళమ్మట నీళ్ళు తెచ్చేసుకుని నా జన్మ భూమి ..భూమి..భూమి (ఈ రెండు భూమి లకి రీసౌండ్ ఎఫెక్ట్ అన్నమాట) అని ఓ సాంగేసుకొని తరించేయండి. ఇంక బయటి వూరి వాళ్ళయితే "మీ జన్మ భూమి....భూమి...భూమి" అని మా కాకినాడ వాళ్ళ గురించి ఓ సాంగేసుకోండి. కాకినాడ అనగానే మీకు వెంటనే గుర్తోచ్చేదేంటి?.....కరేస్టు కాజా అన్నమాట. నిజానికి మీరందరూ దాన్ని కాకినాడ కాజా అంటారు గానీ మా కాకినాడ వాళ్ళం మాత్రం దాన్ని కోటయ్య కాజా అంటామన్నమాట. ఈ కోటయ్య ఎవరంటారా? నూట పదకొండేళ్ళ క్రితం 1900 లొ ఈ కాజా రెసిపీని కనిపెట్టిన పాక శాస్త్రవేత్త. నిజానికి చాలామంది తాపేశ్వరం మడత కాజాకి, కాకినాడ కాజాకి విపరీతం గా కన్ఫ్యూజ్ అయిపోతారు. దాని టేస్ట్ దానిదే, దీని టేస్ట్ దీనిదే. రెండిటికీ ఉన్న ఒకే ఒక్క పోలికేంటంటే రెండూ తూగోజీవే. (రెండూ స్వీట్లే కదా అని రెండో పోలిక చెప్పమాకండి...మీకేసి నేను దూరదర్శన్ ని చూసినట్టు చూడాల్సోస్తుంది). ఇంక విషయానికొస్తే కాకినాడ వచ్చిన వాళ్ళు ఎవరైనా కాకినాడ కాజా, సుబ్బయ్య హోటల్ భోజనం రుచి (దీని గురించి పైన లింక్ ఇచ్చా చూడండి...ఆ పోస్ట్, అందులో కామెంట్లు చూస్తే మీకు వెంటనే ఆకలేస్తుందని మాత్రం గ్యారెంటీగా చెప్పగలను) చూడలేదంటే వాళ్ళు వచ్చినా రానట్టే. మనం కాజా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని మేటర్కొచ్చేద్దాం. కాకినాడ మెయిన్ రోడ్ లో మసీద్ సెంటర్ దగ్గర ఉంది కోటయ్య స్వీట్ స్టాల్. ఇదే కాకినాడ కాజా బర్త్ ప్లేస్ అన్నమాట. ఆ తర్వాత కోటయ్య గారి వారసులలో కుసింత డిఫరెన్సులు వచ్చి ఈ మధ్యే అదే ఊళ్ళో రెండు మూడు చోట్లకి విస్తరించారు. అయితే టేస్ట్ లో మాత్రం తేడా ఉండదండోయ్. కానీ అలవాటయిపోయిన ప్లేసు కాబట్టి మా ఊరోళ్ళు మాత్రం మేగ్జిమం పాత షాప్ కే వెళ్తాం. ఇక్కడ కాజా ఒక్కటే కాదు పూతరేకులు, బూందీ, చక్కిలాలు, బందరు లడ్డూ (దీన్నే తొక్కుడు లడ్డూ అని కూడా అంటాం) ఇలా బోల్డన్ని ఊరిస్తాయి, అయితే తిరుపతి లో ఎన్ని గుళ్ళున్నా మెయిన్ గుడి గురించే చెప్పుకున్నట్టు ఇక్కడా అంతే. (ఈ పోలికేంట్రా అనుకుంటున్నారా? ఏమో ఇంతకు మించి తట్టలేదు అడ్జస్ట్ అయిపోండి)

 పండగకి సొంతూరోచ్చిన కాకినాడ వాళ్ళయినా, పనిమీద వచ్చిన బయట ఊరి వాళ్ళయినా దీని రుచి చూడకుండా, తమతో పాటూ ఒకటో రెండో కేజీలు తీసుకెళ్ళకుండా ఉండరు. సినేమా స్టార్లయినా, రాజకీయ నాయకులైనా, మహా మహా గోప్పోల్లెవరైనా దీని రుచికి దాసోహమనాల్సిందే. ఎవరైనా కాకినాడ వెళ్తున్నాం అంటే పక్కింటి వాళ్ళో, ఆఫీసులో కోలీగ్సో, ఆఫీసులో బాసాసురుడో " వచ్చేటప్పుడు కాజా తేవడం మర్చిపోకు" అనేది మాత్రం ఖచ్చితం గా అంటారు. ఎవర్నయినా కాకా పట్టాలన్నా కేజీ కాజా మంత్రం జపిస్తే చాలు.

క్యాప్సూల్ లా ఉంది లోపల తీయని పాకంతో ఉండే ఈ కాజా తినడం అంత వీజీ కాదు. టెక్నిక్ తెలియకుండా తింటే బట్టలన్నీ తీయని పాకంతో పునీతమవుతాయి. (అంటే ఈ టెక్నిక్ కాకినాడ వాళ్లకి మాత్రం పుట్టుకతో వచ్చేస్తుంది లెండి :) ). గోళీ సోడా తాగడం లాగే (దీని గురించి అప్పుడెప్పుడో ఓ పోస్టేసుకున్నాలెండి) ఈ కాజా కూడా టెక్నిక్ తెలిస్తే పాకం కారకుండా తినచ్చు. (అదెలాగో చెప్పవా అంటారా? దీనికి క్రాష్ కోర్సులు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సులు ఏమీ లేవు. ఎవరికీ వాళ్ళు అనుభవం మీద తెల్సుకోవాల్సిందే. కాదూ కూడదు చెప్పే తీరాలి అని మొహమాట పెడితే మాత్రం మా కాకినాడ బ్లాగర్ల జెఎసి లో సమావేశమై మీ అభ్యర్ధన పరిశీలించి, తీవ్రంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నాక చెప్తాం). మా ఊళ్ళో ఇదొక్కటే కాదండోయ్ బాలాజీ చెరువు టాక్సీ స్టాండ్ దగ్గర, రామారావు పేట మూడు లైట్ల జంక్షన్, గాంధీనగర్ గాంధీ బొమ్మ, పార్క్ ముందు ఉండే బజ్జీల బళ్ళు అక్కడ దొరికే బజ్జీలు, బఠానీ, మిక్చర్, పి.కే.పి ఇలా తలచుకుంటే నోరూరే టేస్ట్ లు బోల్డన్ని ఉన్నాయి. గాంధీ నగర్ అయ్యర్ హోటల్లో వేడి వేడి పెసరట్టు తిని, ఫిల్టర్ కాఫీ తాగితే ఉంటుందీ.....మహాప్రభో అమృతం ఆఫ్ట్రాల్ అనిపించేస్తుందంటే నమ్మండి.

అదండీ సంగతి.

(NEXT: కాకినాడ కబుర్లు - సినిమా హాల్ స్ట్రీట్)
నేను బ్లాగాల్సింది చాలా ఉంది. మీరు కామెంటాల్సింది ఇంకా ఉంది.

32 comments:

Andhraman said...

Both Kotiah/Kakinada Kaza and Subbayya Hotel were featured in Highway On My Plate by NDTV Good Times.

తృష్ణ said...

ఈ టపా చూస్తే అన్నయ్య ఎగిరి గంతేస్తాడు. అంకితం ఇచ్చినందుకు కాదండి కాకినాడ కబుర్లు రాసినందుకు. అలా కాజాలు చూపించి ఊరిస్తే ఎలాగండి అన్యాయంగానూ...:(
అయినా మాకు ఎప్పుడూ ఒక కేజీ వచ్చేస్తాయి ఎవరు వచ్చినా అట్నుంచి. మేమూ బెజవాడవెచ్చేప్పుడు కాజాలు, మా దొడ్లోని దబ్బకాయలు తెచ్చి అలానే తెచ్చి అందరికీ పంచేవాళ్ళం.
అన్నట్లు ఇంతేనా? ఇంకా బోలెడు కబుర్లు ఉన్నాయి. పార్క్ దగ్గర బండివాళ్ళమ్మే "పిడత కింద పప్పు" రుచి? అది నా ఫేవొరేట్. త్రిపురసుందరి గుడి దగ్గర చెరువులో ఉండే కలువపూలు(అవి కలువలేనా?)...అవి చూడ్డానికే ప్రతి కాకినాడ ట్రిప్ లో ఆ గుడికి తప్పనిసరిగా వెళ్ళేదాన్ని.
ఇంకా చాణక్యాచంద్రగుప్త... సినిమా హాళ్ళ వీధి, ప్రశాంతంగా ఉండే రైల్వే స్టేషన్? బోలెడు రాయాలి
ముఫ్ఫై ఏళ్ళకు పైగా ఆ ఊరితో అనుబంధం. ఎక్కడికో తీసుకుపోయారు...బహుశా కాకినాడ సముద్రం అంచులదాకా...:)

bharadwaj said...
This comment has been removed by the author.
bharadwaj said...

సుబ్బయ్య హొటెల్...ఒక పూట తిని..రెండో పూట బోజనం చేద్ధామనుకుంటే..వినాయక వ్రత కధ లో చెప్పినత్లు..ఉధరం నేల కానిన,చరణంబులు ఆకసంబునకేగె..అన్న పరిస్థితి వస్తుంధి.ఇక కాకినాడ కాజా గుర్తుకు వస్తే,టూర్ ప్రోగ్రాం చేంజ్.నెక్స్త్ వీక్ కాకినాడ జంప్.

Unknown said...

కాకినాడ ప్రస్తావించినప్పుడు నూకాలమ్మ గుడి ,బాలత్రిపుర సుందరి గుడి
పిండాల చెరువు మర్చి పోవడం అన్యాయం .పిడత కంది పప్పు అని ఎప్పుడో
నా బ్లాగ్ లో రాసిన నాకు ,అంకితం కాక పోయినా కనీసం కోటయ్య కాజా అయినా
యిచ్చి వుండాల్సింది .కాకినాడ పేరు చూడగానే గుండె పొంగి పోతుంది .ఎంతైనా మా
తల్లిదండ్రుల వూరు , సర్కార్ ఎక్ష్ప్రెస్స్ అని ఏకం గా వొక సినిమానే వచ్చింది ,
ప్రస్తుత పరిస్తితులలో అబిడ్స్ నెహ్రు విగ్రహం దగ్గర కాకినాడ గ్రేట్ అని ఎలుగెత్తి చాట లేను గాని
యిలా చాటు గా అన్న చెప్పక పొతే ఆనందాన్ని పంచిన సినిమా వీధి క్షమించదు .

SHANKAR.S said...

@ Andhraman
చాలా థాంక్సండీ. ఇది నాకు నిజంగా స్వీట్ సర్ ప్రైజ్

@ రవి గారు, తృష్ణ గారు
పిడత కింద పప్పు గురించి మనం మామూలుగా వాడే పి.కే .పి అని ఆల్రెడీ ప్రస్తావించానండీ. బజ్జీల బళ్ల గురించి చెప్పి దాన్ని మర్చిపోతే అసలు నాది కాకినాడే కానట్టు :).
ఇంకా కబుర్లు అయిపోలేదండీ. ఒక్కోసారి ఒక్కో ఏరియాని, ప్రత్యేకతని పరిచయం చేద్దామని అనుకుంటున్నా. నెక్స్ట్ సినిమా హాల్ స్ట్రీట్ గురించి రాయబోతున్నా.
ఒకటా రెండా? ఇంకా ఎన్నున్నాయి? భానుగుడి జంక్షన్ అక్కడి చార్మినార్ సెంటర్, సుభద్ర ఆర్కేడ్, మసీద్ సెంటర్, జగన్నాధపురం వంతెన, పి.ఆర్. కాలేజ్, మా ఐడియల్ కాలేజి, msnc high school, మెక్లారిన్, అప్పట్లో తెగ తిరిగే సిటీ బస్సులు, జగన్నాధపురం లో చొల్లంగి తీర్ధం, రైల్వే స్టేషన్, సూర్య కళా మందిర్, బాలాజీ చెరువు, త్రిపుర సుందరి గుడి అన్నిటికీ మించి ఊరంతా తప్పనిసరిగా చూసే ఎగ్జిబిషన్, అక్కడి కుళాయి చెరువు, సుబ్బయ్య హోటల్ (ఆల్రెడీ ఆయనెవరో రాసేసినా మన ఊరి సుబ్బయ్య హోటల్ గురించి మనం రాయకుండా ఎలాగా? :), నూకాలమ్మ గుడి, బోట్ క్లబ్, బీచ్, అక్కడ కుంభాభిషేకం జరిగే ప్లేస్, అక్కడ గుడిని మోస్తున్నట్టుందే రావణాసురుడి పే...ద్ద విగ్రహం ఇలా బోల్డన్ని ఉన్నాయి. ఒక్కోటీ ఒక్కోసారి రాస్తా.

@ భరద్వాజ్
ఇక్కడికి రెండు కేజీ కాజా పార్సిల్ :)

Ennela said...

ఏందో , మాకు తెల్వద్ గదా అని కాజాలకు గిన్ని పేర్లు పెడుతూంటివి!ఏదో ఒక పేరు తియ్ మల్ల ! జస్ట్ కాజాల కతల్ చెప్పుడేనా..ఒక కిలొ పార్సెల్ గిట్ల చేసేదేమన్న ఉందా! జెల్దిన చెప్తే రెండ్రోజులు ఒక్క పొద్దు ఉంటమన్నట్టు!

SHANKAR.S said...

@ ఎన్నెల గారు
అరె ఎందమ్మా? గట్ల గుస్సా జేస్తవ్? ఒక్క కిలో ఏందీ? దస్ కిలో పంపిస్త. కానైతే నీ బ్లాగ్ల గీ పోస్ట్ జూసి సోచాయిస్తున్నా . గా స్వీట్లు తింటే మల్ల సన్న జాజులోయ్ పోస్ట్ పార్ట్ 2 రాస్తవేమో అని. సమఝైనాదా?
http://ennela-ennela.blogspot.com/2011/01/blog-post_30.html

అయినా నువ్వుండేది కెనడా, గీ కాజాలు కో-కెనడా వి (కాకినాడని అట్లా భీ అంటార్లే )

మంచు said...

కెవ్వు కేక.... కాకినాడ బ్లాగర్ల సంఘం ఎమయినా పెడుతున్నారా????

పి కె పి ఎందుకు తెలీదండీ...

అయ్యర్ హొటెల్ లొ సాంబార్ ఇడ్లీ ఆడ్ చెయ్యండి... రెండు ఇడ్లీ బకెట్ సాంబార్ తినేది అక్కడే కదా :-)

కమల్ వీర్ గురించి కూడా రాయాలి మీరు... కేవలం సగం చార్జి కే సినిమా చూపెడుతూ ఆ థియేటర్ ని ఎంత నీట్ గా మైంటైన్ చేసేవాడు ... ఆ ఏ సి తొ వాడు వదిలె పెర్ఫ్యూం కోసమే ఆ థియేటర్ కి వెళ్ళేవాళ్ళం

శరత్ కాలమ్ said...

మీరందరూ సుబ్బయ్య హోటలూ, కాకినాడా కాజాల గురించి గుర్తుకు తెచ్చుకుంటుంటే నాకేమో ఒక్కడ నోరు ఊరిపోతోంది. ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు కకినాడకి దగ్గర్లోని పీఠాపురం దగ్గర్లోని గోరసలో వున్న నా బాల్యమిత్రుడిని వెతుక్కుంటూ నయినా కాకినాడ వచ్చేసి ఆ హోటలుకి వెళ్ళాలి.

SHANKAR.S said...

@ మంచు గారు
అయ్యర్ హోటల్ సాంబార్ గురించి, కమల్ వీరు గురించి ఇంత సాధికారంగా చెప్తున్నారంటే మీదీ గాంధీ నగర్ ఏరియానా ఏంటి కొంపతీసి? మా ఇల్లు గాంధీ బొమ్మ దగ్గర. మీది?
మొత్తం కాకినాడ హోటల్స్ గురించి కూడా రాస్తానండీ. వీనస్ రెస్టారెంట్ (కల్పనా దగ్గర), అయ్యర్ హోటల్, క్రాంతి రెస్టారెంట్, న్యూ ద్వారక (ఎక్కడో చెప్పుకోండి? :). అలాగే గాంధీనగర్ సిమెంట్ రోడ్ లో మార్కెట్ దాటిన తర్వాత ఎడం చేతి వైపు ఒక చిన్న పాక హోటల్ ఉండేది (నైట్ హోటల్ కాదు....ఇంకా ముందే) దాని పేరు గుర్తులేదు అక్కడ కారప్పొడి , నెయ్యి తో వేడి వేడి ఇడ్లీ ఫేమస్ ఆ హోటల్ పేరు గుర్తుంటే కాస్త చెబ్దురూ.

@ శరత్ గారు ఎక్కడి సూర్యాపేట ? ఎక్కడి గోర్స? ఈ లింక్ ఎక్కడ కుదిరింది మాస్టారూ? అదీ బాల్యమిత్రుడు అంటున్నారు.
కాజా, సుబ్బయ్య హోటల్ రెండూ ఒకేసారి అంటే డేంజరస్ కాంబినేషన్. ఏ ఒక్కటి తిన్నా వెంటనే ఇంకోదాని రుచిని మనఃపూర్తిగా ఆస్వాదించలేరు. కాబట్టి కుసింత గ్యాప్ ఇచ్చి కుమ్మేయండి అంతే.

శరత్ కాలమ్ said...

నేను భువనగిరి(భోనగిరి) (నల్లగొండ జిల్లా) లో 8,9 చదువుతున్నప్పుడు కొండలరావు అనే క్లోజ్ ఫ్రెండ్ వుండేవాడు. వాళ్లది మీ ప్రాంతమే. కొంతకాలం తరువాత వారు స్వస్థలానికి తరలి వెళ్ళారు. కొన్నేళ్ళ తరువాత ఒకసారి మా నాన్నగారు నేను మా నాన్నగారి స్వాతంత్ర్య సమరయోధుల ఉచిత రైల్వే పాస్ మీద రాష్ట్రం అంతా తిరుగుతూ నా బాల్య స్నేహితుడు మరియు నాన్నగారి ప్రియ శిష్యుడు అయిన కొండలరావుని కలవడానికి కాకినాడ వెళ్ళాము. అక్కడినుండి పీఠాపురం, గోరస ఆ తరువాత వాళ్ళిల్లూ వెతుక్కుంటూ వెళ్ళి కలిసాము. అలా అనుకోకుండా, చెప్పాపెట్టకుండా వాళ్ళింటికి వెళ్ళి సర్ప్రైజ్ ఇచ్చాము. ఇప్పుడు అతను ఎక్కడ వున్నాడో, ఏం చెస్తున్నాడో తెలియదు. కలిసి చాలా ఏళ్ళవుతోంది. CA పరీక్షలకు అటెండు అవుతున్నట్లు అప్పట్లో చెప్పినట్లు గుర్తు.

విరిబోణి said...

Hello Shankar gaaru,
Meeru kakinaada kaaza gurinchi cheppadam chala bavundi kani ...oka 1kg kaazaalu emanna koncham itu pampinchagalara :)) mari maku ela nooru oore laa post lu raaste ela:(

SHANKAR.S said...

@ శరత్ గారు
చిన్నప్పటి ఫ్రెండ్ ఇన్నేళ్ళ తర్వాత కలిస్తే ఎంత థ్రిల్ ఉంటుందో నాకు తెలుసు. మీ ఫ్రెండ్ ని మీరు వీలయినంత త్వరగా కలుసుకోవాలని, మీరిద్దరూ మా కాకినాడ రుచుల్ని కలిసి ఆస్వాదించాలని (అఫ్కోర్స్ ఆయనకి కొత్త కాకపోవచ్చు లెండి) మనఃపూర్తిగా ఆశిస్తున్నాను.

@విరిబోణి గారు
:) .అబ్బే పార్సిల్ సర్వీసులు కుదరవండీ. కాకినాడకొచ్చి వేడి వేడి కాజా అప్పటికప్పుడు తింటే ఉండే మజాయే వేరు. అయినా మీ ఊళ్లోనే మా కాకినాడ వాళ్ళు బోలెడంత మంది ఉన్నారు. వాళ్ళలో ఎవరు ఇంటికొచ్చినా తిరిగి వెళ్ళేటప్పుడు కాజా తీసుకెళ్లడం తప్పనిసరి. తప్పదు మీరు ఆ క్షణం కోసం ఎదురుచూడాల్సిందే :)

Ennela said...

పర్వలే తియ్యి తమ్మీ..ఎంత జేసిన బొండు మల్లెలు సన్నజాజులయితయా? ఏటూ బొండు మల్లెలే! ఇంక జెర్రంత బరువేసిన కుడ్త యేం ఫరక్ పడదన్నట్టు.

Vijju said...

శంకర్ గారు, మాది కూడా కాకినాడే.మీరు చెప్పిన కారప్పొడి hotel నాకు బాగా తెల్సు. పొడితో పాటు red color ఆల్లం chutney కూడా యిచ్చేవాడు.Hotelకి పేరు వుందో లేదో గుర్తు రావడం లెదు. మాఇంట్లో మాత్రం "పాక hotel" అనే పిలిచేవాళ్ళం. మేము PratapNagar లో వుండే వాళ్ళం, మాParents ఇంకా అక్కడే వుంటున్నారు. Thanks for refreshing my childhood memories :)

KAKINADA SREENIVAS said...

shankar garu

aa hotel ni babai hotel antaru. mee article chaala bagundi. nenu vumdedi a subbayya hotel venakane!!!!

Anonymous said...

పొద్దున లేచిన దగ్గరినుంచీ తిండి .. తిండి.. తిండి.. తిండి మీద వర్ణనలూ .. హూ..

తిండి మీదే ధ్యాస వుంటే
దేశమేగతి బాగుపడునోయ్ , అని గురజాడ అనేవుంటారు.

జనాలు బాగా తింటున్నరు కాబట్టే ధరలు పెరుగుతున్నాయ్ అని ఎవరో అన్నారంటే అతిశయోక్తి కాదని పిస్తోంది. :P :)

ఆ సుబ్బయ్య మహానుభావులెవరో జనాలను మేపడానికే హోటల్ నడుపుతున్నారని తెలుస్తోంది, బాగుంది.

SHANKAR.S said...

@ vijju garu
మాది గాంధీ నగర్. ఇంకా చాలా విశేషాల గురించి రాయబోతున్నాను. ఫాలో అయిపొండంతే :)

@ kakinada sreenivas garu
ఆ హోటల్ ఇంకా ఉందా? దాన్ని దాటి కొంచం ముందుకి వెళ్తే కుడి చేతి వైపు ఒక పాన్ షాప్ ఉండేది. మ్యాగ్ జైన్లు అన్నీ ఉండేవి. ప్రతి వారం ఎంప్లాయ్ మెంట్ న్యూస్ ఆ షాప్ లోనే కొనుక్కునే వాళ్ళం. ఆ తరవాత కొంత కాలానికి దాన్ని తీసేశారు.

సుబ్బయ్య హోటల్ వెనక అంటే శివాలయం దగ్గరా? మా ఇల్లు మమత నర్సింగ్ హోమ్ ఎదురుగా.

@snkr garu
ఇక్కడ మేటర్ తిండి గురించి కాదండీ. ఊరి జ్ఞాపకాల గురించి.

"ఆ సుబ్బయ్య మహానుభావులెవరో జనాలను మేపడానికే హోటల్ నడుపుతున్నారని తెలుస్తోంది, బాగుంది."

కమర్షియల్ గా హోటల్ నడపనందుకు ఆయన మహానుభావుడే. అయినా డౌట్ అందుకు ఒక సారి వచ్చి చూస్తే మీకే తెలుస్తుందిగా :)

ఆవకాయ said...

అయ్యరు హోటల్ మూసేసారని విన్నానే? ఇంకా ఉందా లేక ఊరించటానికి రాసారా?

మీరు తూగోజీ స్పెషల్ స్వీటు ఒకటి మర్చిపోయారు..కరకజ్జం. అలాగే ఈ సారి "రాజు ఎంపోరియం"(పేరు కరక్టేనా?)గురించి కూడా రాయండి, ఎన్ని సంవత్సరాలనుండీ ఉందో ఆ షాపు.

మిరియప్పొడి said...

ఐతే కాకినాడ ప్రపంచానికి కేంద్రం అంటారు?

SHANKAR.S said...

@ మిరియప్పొడి గారు
ప్రపంచం విషయం ఏమో గానీ జిల్లాకి కేంద్రం అని మాత్రం తెలుసు. అయినా మీ ఊరి నుంచి కూడా బోలెడన్ని నాన్ స్టాప్ బస్సులున్నాయిగా కాకినాడకి :).

Unknown said...

శంకర్ గారు మీరు ఇంకా బాగా రాయచ్చు అండి :)

సుబ్బయ్య హోటల్ లో పునుకుల కూర .. కులాయి చెరువు పార్క్ ... తాజ్ మహల్ టీ సెంటరు .. సంత చెరువు సాయి బాబా గుడి .. ఆ గుడి సందులో వేసే పెసరట్లు .. సినిమా హాల్ రోడ్ .. కన్నయ్య కాపు నాగర్ దగ్గర బెక్ వాటర్స్ :) ... చిన్న మసీదు .. రైల్వే స్టేషన్ ... మానస సరోవర్ రెస్టారెంట్ .. తిరుమల థియేటర్ .. వీర కమల్ థియేటర్ .. ఉడిపి హోటల్ .. అబ్బో చెప్పుకుంటూ పొతే ఎన్నో ఎన్నెన్నో :)

SHANKAR.S said...

@ కావ్య గారు
ఒక్కోదాని గురించి రాసుకుంటూ వస్తా. నెక్స్ట్ సినిమా హాల్ స్ట్రీట్ . ఆ తర్వాత మసీద్ సెంటర్. ఇలా అన్నమాట
అన్నట్టు ఇంకో విషయం అది తాజ్ మహల్ టీ సెంటర్ కాదండీ. చార్మినార్ టీ సెంటర్. :)

రమణ said...

ఆంధ్రా పాలిటెక్నిక్, ఎం.ఎస్.ఎన్. కాలేజీ మరియు చారిటీస్ ని మర్చిపోయారు.

SHANKAR.S said...

@ రమణ గారూ
పైన రవి గారు, తృష్ణ గారికి ఇచ్చిన జవాబు మళ్ళీ ఇస్తున్నాను. ఒక సారి చూడండి

@ రవి గారు, తృష్ణ గారు
పిడత కింద పప్పు గురించి మనం మామూలుగా వాడే పి.కే .పి అని ఆల్రెడీ ప్రస్తావించానండీ. బజ్జీల బళ్ల గురించి చెప్పి దాన్ని మర్చిపోతే అసలు నాది కాకినాడే కానట్టు :).
ఇంకా కబుర్లు అయిపోలేదండీ. ఒక్కోసారి ఒక్కో ఏరియాని, ప్రత్యేకతని పరిచయం చేద్దామని అనుకుంటున్నా. నెక్స్ట్ సినిమా హాల్ స్ట్రీట్ గురించి రాయబోతున్నా.
ఒకటా రెండా? ఇంకా ఎన్నున్నాయి? భానుగుడి జంక్షన్ అక్కడి చార్మినార్ సెంటర్, సుభద్ర ఆర్కేడ్, మసీద్ సెంటర్, జగన్నాధపురం వంతెన, పి.ఆర్. కాలేజ్, మా ఐడియల్ కాలేజి, msnc high school, మెక్లారిన్, అప్పట్లో తెగ తిరిగే సిటీ బస్సులు, జగన్నాధపురం లో చొల్లంగి తీర్ధం, రైల్వే స్టేషన్, సూర్య కళా మందిర్, బాలాజీ చెరువు, త్రిపుర సుందరి గుడి అన్నిటికీ మించి ఊరంతా తప్పనిసరిగా చూసే ఎగ్జిబిషన్, అక్కడి కుళాయి చెరువు, సుబ్బయ్య హోటల్ (ఆల్రెడీ ఆయనెవరో రాసేసినా మన ఊరి సుబ్బయ్య హోటల్ గురించి మనం రాయకుండా ఎలాగా? :), నూకాలమ్మ గుడి, బోట్ క్లబ్, బీచ్, అక్కడ కుంభాభిషేకం జరిగే ప్లేస్, అక్కడ గుడిని మోస్తున్నట్టుందే రావణాసురుడి పే...ద్ద విగ్రహం ఇలా బోల్డన్ని ఉన్నాయి. ఒక్కోటీ ఒక్కోసారి రాస్తా.

అన్నట్టు మీది జగన్నాధపురమా? నా స్కూలింగ్ అంతా M.S.N.C లోనే జరిగింది. :) దాన్నెలా మర్చిపోతానండీ?

ఆ.సౌమ్య said...

బావున్నాయి కాకినాడ కథలు.నాకు మడతకాజ, కాకినాడ కాజా రెండూ ఇష్టం. మా అత్తలు ఉంటున్నారు ఇప్పటికీ.. వాళ్ళు ఎప్పుడు విజయనగరం వచ్చినా మాకు ఓ రెండు కేజీలు కాజాలు వచ్చేవి. నాకింకా బాగ గుర్తు...నేను మూడో నాలుగో చదువుతున్నప్పుదనుకుంటా...అప్పుడే మొదటిసారి కాకినాడ కాజా తినడం (నాకు గుర్తుండి). కసక్కున కొరికాను...అంతే బట్టలు సర్వనాశనం. మొదట్లో తినడం రాక బట్టలమీద పోసుకునేదాన్ని, తరువాత అలవాటయిపోయింది. ఏమైనా అవి మంచి రుచి. ఊ ఇంకా కబుర్లు చెప్పండి..మేము వింటాం. :)

Sunny said...

" boss saarudu " ane padam correct ga thindi vishyam meeda prasthaavinchadam chaala aahladakarangaa undi.

సుమలత said...

కాకినాడ కాజ అంటే నాకు చాల ఇష్టం మీరు ఇలా టపా
రాసేసి మమల్ని ఎక్కడికో తీసుకువెళ్ళారు

నేస్తం said...

మీరు MSNC లో చదివారా :) నేను తప్పించి మా అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ చార్టీస్ లో చదివినవాళ్ళే ..నా పదవతరగతి ఎక్జాంస్ అక్కడే సెంటర్ నాది.:) మీరు ఇటు జన్నాధపురం వచ్చేసి ఆగకూడదు అక్కడ మున్సభుగారి తూము నూకాలమ్మ, నేరేళ్ళమ్మ గుడి తూరంగి సూర్యామహల్ వరుసగా వెళ్ళిపోండి అంతే :)

John said...

Wow....About Kakinada....with this kind of unique narration ( your writing style)....hmmmmmm.........

భాను కిరణాలు said...

మన కాకినాడ గురించి ఎంత గొప్ప గా చెప్పారండి ... మన స్నేహితుల కామెంట్స్ కూడా కాజ అంత రుచిగా ఉన్నాయ్... ఎక్కడో ఒక మిత్రుడు అన్నాడు .... ఏదో సుబ్బయ్య జనాలని మేపడానికే హోటల్ నడుపుతున్నాడని.. అక్కడే కొంచెం కాజ పాకం బట్టల మీద పడ్డట్టు అనిపించింది ...... పర్లేదు లెండి... మొదటిసారి కదా .................... మీరు ఇంకా చాలా చోట్ల ఆగాలండి .. మరి ముఖ్యం గా గాంధీ నగర్ పార్క్ లో.. అక్కడ ఉన్నా పెద్ద రాకెట్.... నేనితే ఇంటర్ లో కూడా ఆ రాకెట్ పయికి ఎక్కేవాడిని ....... ఆ పక్కన బజ్జిల బండి దగ్గర బజ్జీలు తినిపించారు కాబట్టి ఓకే ...... ఓ సారి అలా మన సర్పవరం భావన్నారాయణ స్వామి గుడికి కూడా రండి .........మర్చిపోవద్దు .. అలాగే సామర్లకోట రోడ్ లో మన యండమూరి నడుపుతున్న సరస్వతి విద్యా పీఠం లో కూడా కాసేపు కుర్చోపెట్టండి మన మిత్రులందరినీ .........
--