Friday, March 11, 2011

ఇంతకు మించి ఏమీ చెప్పలేను :(

ఈ రోజు ట్యాంక్ బండ్ పై జరిగిన సంఘటన చూసిన వెంటనే ఆవేశం, ఆక్రోశం కలగలిసి రాసిన పోస్ట్ ఈ క్రింది బ్లాగర్ కూడా అదే ఆలోచనతో అప్పటికే పోస్ట్ పెట్టడంతో అందులో తోలి కామెంట్ గా పోస్ట్ చేశా. http://manogatam.blogspot.com/2011/03/blog-post.html . ఆ స్పందన మీకోసం మళ్ళీ ఇక్కడ కూడా ఇస్తున్నాను.

తలకెక్కిన ఉన్మాదం - ఇదా గాంధేయవాదం?

మిలియన్ మార్చ్ పేరుతో ట్యాంక్ బండ్ పై విధ్వంసం.
చేతులు కట్టుకుని చూస్తోంది చేవ లేని ప్రభుత్వం
ఏ పార్టీ వాడని ఎర్రాప్రగడని కూల్చారు?
ఏ ప్రాంతం వాడని క్రిష్ణదేవరాయుని నీట ముంచారు?
మాట్లాడితే మా సంస్కృతీ మా సంస్కృతి అనే కే.సి,యారూ
ఈ ఉన్మాదమే మీ సంస్కృతా చెప్పండి సారూ?
ఇదేనా మీరు చెప్పే గాంధేయ వాదం
కాదు కాదు ఇది అచ్చమైన కేసియారీయం
స్వచ్చమైన తెలుగులో చెప్తే స్వార్ధ రాజకీయం

(ట్యాంక్ బండ్ మీద తెలంగాణా వాదుల చేతిలో ఘోర పరాభవానికి గురయిన తెలుగు జాతి మహనీయులకు క్షమార్పణలు చెబుతూ)

గమనిక: ఇప్పటి వరకు నేను నా బ్లాగులో "తెలబాన్లు" అనే పదాన్ని ఖండించాను. సాటి తెలుగు వారిని తాలిబాన్లతో పోల్చడం మూర్ఖత్వం అని వాదించాను. కానీ ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద ధ్వంసమైన విగ్రహాలలో నాకు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు ధ్వంసం చేసిన బుద్ధ విగ్రహాలు కనిపిస్తున్నాయి.కానీ ఉన్మాదంలో వీరు వారినే మించి పోయి తమ తెలుగు జాతి మహనీయుల విగ్రహాలనే కూల్చారంటే వీళ్ళని అలాగే అనాలనిపిస్తోంది. ఆ పదం కూడా తక్కువనిపిస్తోంది. 

ప్రస్తుతం చానెళ్ళలో చూపిస్తున్న విరిగిన విగ్రహాలు, తగలబడుతున్న పోలీసు జీపులు, అద్దాలు పగిలిన బిల్డింగులు చూస్తుంటే ఈ పాట గుర్తొచ్చింది.  
4 comments:

ఇందు said...

హ్మ్! ఇక్కడ కొన్ని వెబ్సైట్లు ఇచ్చిన వీడియో లింకుల్లో ఈ అరచకాలు చూసి ఎంత బాధేసిందో! టాంక్బండ్ దగ్గర విగ్రహాలు ఏం పాపం చేసాయీ?? రాళ్ళు పెట్టి ఫెడేల్ ఫెడేల్ మని కొడుతుంటే...అది చూడలేక ఆపేసా ఇక! మీరన్నది నిజం! వారికి 'తలబాన్లూ' పదం సరిపోదు! ఇంకా అసహ్యకరమైన పదాలు కూడా తక్కువైపోతాయేమో వీరి అకృత్యాలకి! మొన్నటిదాకా కష్మీరే పెద్ద సమస్య అనుకుంటే...ఆ తీవ్రవాదులకంటే రెచ్చిపోతున్నరు ఈ తెలంగాణా వాదులు! ఛీ!

Jahnavi said...

siggu leni nayakulu,vichkshaNa leni manushulu .Memu kooda telangana vallamani andulo noo hyderabadees mi ani cheppukovalante siggestundi.siggutho talavanchukuntunnanu.

Jahnavi said...

Vinaashakaale vipareetha buddhi.

srikanth said...

munduga tankbund meedha jarigina sangatanalanu manavathvam vuuna prathi manashi kandichalsina vishayam addi vigrahala dwasam ,vilekarulapai dadee
marokaa vishayam gurthu unchukovalisina emeetantee assalu eesagatana enduku jarigindi yenduku sahanam kolpoi enntha vichakshana rahithanga vyavarichalsi vacchindi annedhe sodhara bavamtho alochinchalee tappa
telangana udyamani talibanlaatho polchadam sari kadhu telanganaloni 10jillalalo nivasisthuna andhra ,seema prajalapai yekadanaina dadulu jargaya valla asthulu emaina dwasam chesara ?
daya chesi ilanti rechakotey prayathnalu manadi
inkaa oka vishayam gurthunchukovalisndi yemeetantee (K C R) anteney telangana
telangana antey (k c R)
annatuu chitrikarinchadam chala badhakaram kCR nayakathvani telangana prajalu vyethrekisthnarani telusukuntey manchidi
telangana antey KCR sothu kadhu telangana antey nallugu kottla prajala janma hakuuuuuu
KCR kuu telagananuu mudi pettadam sarikadhuaddi