Sunday, May 1, 2011

కామెడీగా మన మంత్రులు, నాయకులు చెప్పే కొన్ని కామన్ స్టేట్మెంట్స్


కామెడీగా మన మంత్రులు, నాయకులు చెప్పే కొన్ని కామన్ స్టేట్మెంట్స్. ఇంకో పదేళ్ళ తర్వాత కూడా ఈ స్టేట్మెంట్స్  ఇలాగే ఉంటాయని నేను హామీ ఇస్తున్నాను :)

౧. నిందితులు ఎంతటి వారైనా కఠినం గా శిక్షిస్తాం
౨. పూర్తీ వివరాలు అందిన తర్వాత స్పందిస్తాం 
౩. సరైన సమయం లో సరైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది 
౪. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం 
౫. ఇది కేంద్ర స్థాయిలో తీసుకోవలసిన నిర్ణయం
౬. పరిస్థితి అదుపులో ఉంది
౭. త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం
౮. దేశం ఒక మహా నేతని కోల్పోయింది or  ఆయన/ ఆమె మరణం ..................కు తీరని లోటు (ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఏ రంగానికి చెందిన వాళ్ళయితే ఆ రంగం పేరు ఖాళీలో నింపుకోవలెను)
౯.  మా ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉంది 
౧౦. నా మీద వచ్చిన ఆరోపణల మీద దమ్ముంటే ఎంక్వయిరీ కమిటీ వేయించమనండి

7 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

:)
ఇది సిద్ధాంతపరమైన నిర్ణయం.

Anonymous said...

చట్టం తన పని తాను చేశుకుపోతుంది.

తృష్ణ said...

"కాకినాడ" గురించిన తరువాయి భాగం కోసం చూస్తూంటే..ఇదేమిటి?
"పూర్తి వివరాలు అందిన తర్వాత స్పందిస్తాం"..! ఇది నాకు బాగా నచ్చుతుంది.
అది అసలైన cool స్పందన. మీకేం తెలీదసలు...:)

బులుసు సుబ్రహ్మణ్యం said...

పరిస్తితి అదుపులోనే ఉంది. ముందు జాగ్రత్త చర్య గా కర్ఫ్యు విధించాము .
ఉక్కు పాదంతో అణచివేస్తాం.

రాజకీయాలే పెద్ద కామెడీ ఈ దేశంలో.

ఆత్రేయ said...

టెర్రరిజాన్ని/ఉగ్రవాదాన్ని ఉక్కుపాదం తో అణచివేస్తాం.
(ఈ ఉక్కు పాదం ఏ గవర్నమెంట్ ఫౌండ్రీ లో తయారీలో ఉందో , ఎన్నాళ్ళయినా తయారావట్లేదు.)

మంచు said...

ఇది పిరికిపందల చర్య (ఇది సొనియా, మన్మొహన్ ల పేటెంట్ స్టేట్మెంట్. ఉదా: సొనియా ఇది పిరికిపందల చర్యగా అభివర్ణించారు)
కేబినెట్ లొ చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాం.
అన్నివర్గాల వారికి అమోదయోగ్యమయిన నిర్ణయం తీసుకుంటాం.

రాజ్ కుమార్ said...

శ్వేతపత్రం విడుదల చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాం...

హహహ సూపరు..
శంకర్ గారూ.. మీ బ్లాగ్ చూడటం ఇదే ఫస్ట్ టైం...
కాకినాడ సిరీస్ తో మొదలెడదాం అనుకున్నా.. కానీ ఇక్కడ కొబ్బరికాయ కొట్టాను... ;) ;)

రాజ్ కుమార్.