Saturday, June 11, 2011

బ్లాగర్స్ సర్వీస్ కమీషన్ పరీక్ష (పేపర్ 1)

బ్లాగర్లలో, బజ్జర్లలో బ్లాగ్లోకం మీద ఎంత పరిజ్ఞానం ఉందో తెలుసుకునేందుకు బ్లాగర్స్ సర్వీస్ కమీషన్ పరీక్ష ఉంటే ఎలా ఉంటుందో అన్న ఊహతో ఈ ప్రశ్నా పత్రం రూపొందించబడింది. ఆసక్తి గల అభ్యర్ధులు కామెంట్లు పెట్టి హాజరవవచ్చు. ఈ రోజు జరిగే పేపర్ 1 (50 మార్కులు) మరియు రేపు జరిగే పేపర్ 2 (20 మార్కులు) లలో  ఉత్తీర్ణులయిన వారికి ఇంటర్వ్యూలు (30 మార్కులు) నిర్వహించబడతాయి. 

(ప్రతి  ప్రశ్నకూ 5 మార్కులు) 

ప్రశ్న 1. తెలుగు బ్లాగర్ల పోస్టులలో అజ్ఞాతల పాత్ర సోదాహరణముగా వివరింపుము 

ప్రశ్న 2. మధ్యందిన "మార్తాండునిలా" చెలరేగుతూ  అన్ని బ్లాగులలో అసందర్భ  కామెంట్లు పెట్టు బ్లాగర్ పేరేమి? వారి చిత్ర విచిత్ర చేష్టలను క్లుప్తంగా వివరించుము 

ప్రశ్న 3. తెలుగు  బ్లాగులకు గల ఐదు  సంకలినుల  పేర్లు తెలుపుము 

ప్రశ్న 4. బ్లాగుల్లో "సెగట్రీ" అనగా ఎవరు? వారికి ఆ పేరు ఎట్లు వచ్చినది 

ప్రశ్న 5. తెలుగు బ్లాగులలో మీకు తెలిసిన ఐదుగురు  మధ్య తరగతి (రెండు బ్లాగులు కలవారు), ధనిక (రెండు కన్నా ఎక్కువ బ్లాగులు కలవారు) బ్లాగర్ల మరియు వారి బ్లాగుల పేర్లు చెప్పుము 

ప్రశ్న 6. "నవ్వితే నవ్వండి" బ్లాగరు ఎవరు?  వారి ప్రాశస్త్యం గురించి పది వాక్యాలకు మించకుండా వివరించుడి 

ప్రశ్న 7. ఈ క్రింది బ్లాగులు వాటి యాజమాన బ్లాగర్ల ను జతపరచుడి 

మనసులో మాట                            -                ఫణిబాబు గారు 
మాయా శశిరేఖ                              -                తృష్ణ గారు
బాతాఖానీ లక్ష్మీఫణి కబుర్లు       -           భరద్వాజ్ గారు 
తృష్ణ                              -           ఆ. సౌమ్య గారు 
రౌడీ రాజ్యం                        -           సుజాత గారు 

ప్రశ్న 8. బ్లాగ్లోకం  లో మీరు చూసిన ఐదు ఉత్తమ బ్లాగులు, ఐదు చెత్త బ్లాగులు కారణాలతో సహా వివరించండి 

ప్రశ్న 9 : బజ్జుకు , బ్లాగుకు గల తేడాలను వివరించుము 

ప్రశ్న 10 : బ్లాగర్లలో ప్రవాస తెలుగు బ్లాగర్ల పాత్రను వివరింపుము. మీకు తెలిసిన ఐదుగురు ప్రవాస బ్లాగర్ల పేర్లను తెలుపుము 




(అన్ని ప్రశ్నలకూ జవాబులు చచ్చినట్టు రాసి తీరవలెను. ఇది సరదా పోస్టే కాబట్టి ఎవరూ ఫీలవకూడదని తెలియజేయబడినది) 

26 comments:

బులుసు సుబ్రహ్మణ్యం said...

నేను చచ్చితిని

కథా మంజరి said...

నేను ఫెయిలయ్యానండీ. పాస్ మార్కులు కూడా రావు.

జ్యోతి said...

నాకు అన్ని సమాధానాలు తెలుసు కాని నాకేటి ఆహా నాకేటంట??

బులుసు సుబ్రహ్మణ్యం said...

1. జ్ఙాతులు కాని వారు అజ్ఙాతులు. సంబంధ బాంధవ్యముల నిచ్చగించని వారు, మఫ్టీలో ఉన్న రక్షక భటులమనుకొనే వారు కొందరు.
2. డిల్లీ రాష్ట్రము నకు ఆదే పేరు గల రాజధాని పేరేమి అను టైప్ ప్రశ్నలకు జవాబు ఇవ్వము.
3. తెలుగు బ్లాగర్లకు అన్నీ మూల సంకలే. అన్ని సంకలినులు అతి వేగముగా ప్రచురించును. అంతే వేగముగా నిష్క్రమింప జేయును.
4. చెపితే వారు తిడతారు వ్రాయక పోతే మీరు కొడతారు కాబట్టి నో కామెంట్స్.
5. మీరు మధ్య తరగతి నుంచి ఎగువ తరగతికి ఎగుయుటకు ప్రయత్నిస్తున్నారని అర్ధం అవుతోంది. అది తేలిన తరువాత జవాబు ఇచ్చేదము.
6. హాహాహాహ్హ ఊహహ హిహిహి
7. ఒక ఒకట్లు ఐదు, రెండు రెళ్ళు నాల్గు, మూడు మూళ్ళు ఒకటి , నాల్గు నాల్గులు రెండు, ఐదు అయిదులు మూడు
8. నేనింకను బ్లాగుల్లో కొంతకాలము ఉండదల్చితిని అందుచే దీనికి జవాబు ఇవ్వను.
9. ఆత్మకు పరమాత్మకు కల సారూప్యమే
10. మనం పడుకున్నప్పుడు కూడా కామెంట్లు పెట్టేవారు ప్రవాసాంధ్రులు.

వేణూశ్రీకాంత్ said...

బులుసు గారు మీ స్టైల్లో చించేశారు సారు.. అత్యుత్తమ్మ సమాధానాలు... నన్నడిగితే నూటికి రెండొందల మార్కులు ఇచ్చేయచ్చు మీకు :-)

Yagna said...

ప్రశ్నలు బావున్నాయి, గురువు గారి సమాధానాలు అంతకన్నా బావున్నాయి..., ఇంతకీ గురువు గారు పేరెప్పుడు మార్చుకున్నట్టో? :)

Unknown said...

Answer to first question..
అజ్ఞాతల పాత్ర ...ఇది నాకు అస్సలు అర్ధం కాని విషయం. అసలు ఒక బ్లాగ్ చూసి ఏదయినా పోస్ట్ నచ్చితే చక్కగా మన పేరు పెట్టుకుని బావుంది అని చెప్పడానికి ఏమి ఇబ్బంది ఉంటుంది? ఒకరు ఏదయినా రాసారు అంటే దాని వెనక అంతర్మధనం ఉంటుంది. రాయడం అనేది అందులో నలుగురిని మెప్పించేలా రాయడం అనేది మామూలు విషయం కాదు కదా మరి నచ్చినధనో లేక మీరు రాసింది నచ్చలేదో అని చెప్పడానికో అజ్ఞాత అవతారం ఎందుకు ఎత్తడం?

హరే కృష్ణ said...

శంకర్ గారు ఇంత మంచి ప్రశ్నాపత్రం సెట్ చేసిన మీకేదైనా అవార్డ్ ఇచ్చేయాలని డిసైడ్ అయ్యాం .. కేక
ఒక గూసీ వాచీ ఓకే నా :)
గురువు గారు సమాధానాలు కెవ్వ్

Anonymous said...

కల్లి రిసైల బల ( అంటే అర్థం కాలేదు అయినా మంచి ప్రశ్న అడిగారు కాబట్టి చెబుతున్నా)

అజ్ఞాతలు: తమ అభిప్రాయాల్ని వున్నదున్నట్టు చెప్పేవారు. చాలామందికి చేదు నిజాలు , మందులు నచ్చవు, కాబట్టి తేనె/చక్కెర కలిపి, ఎసెన్సు వాడి కామెంటాలని ఏచెత్త బ్లాగరైనా కోరుకుంటాడు. అందుకే అజ్ఞాతలని అవమానించే కుసంస్కారులు ఎక్కువగా చూస్తాము. :P
ఇగ పోతే మీరడిగిన పాయింట్: కొండొకచో అజ్ఞాతలు మెచ్చుకున్నారంటే ఆ పొగడ్త నిఖార్సైనది, నగిషీలు లేనిది అనుకోవాలి. దాని విలువ 10రెట్లు ఎక్కువ. మారుమాటాడకుండా స్వీకరించేయండీ. ఆ అజ్ఞాతను అప్పుడప్పుడు వస్తూండమని మరీ వెంటబడినట్టు కాక, సుతారాముగా అడగండి. వాళ్ళతే భోజరాజుల్లా అలా మారువేషాల్లో తిరుగుతుంటారు, అదంతే! ఎందుకు ఏమిటి అని విసిగించకండి, అజ్ఞాతలకు కోపిస్తే ... :)) ఏమవుద్దో అందరికీ అనుభవమే.

Anonymous said...

ఇస్మీ.. మీ పేరు కల్లూరి శైలబాల ఏమో కదండి, చమించండి, పొరపాటైంది. ఈ ఇంగ్లీషుంది చూశారు, లిపి సులభమంతేగాని నిజానికి చాలా చెత్త భాషండి.

Sri Kanth said...

ప్రకటన

మా బ్లాగునందు, కోచింగు సెంటరు ఓపను చేశాము. బ్లాగ్ సర్వీసు కమీషను కు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని మీద చక్కగా కోచింగు ఇవ్వగలము. మా పూర్వ విధ్యార్థులు ఇలాంటి పరీక్షలనే అనేకం రాసి అదరగొట్టారు.

వరుసగా 1,4,5,7 ర్యాంకులు.. ఇంకా మరో 100 ర్యాంకులు మా కోచింగు సెంటరు విధ్యార్థులకు వచ్చి ఉన్నవి.

గమనిక: అబ్బాయిలకు అమ్మాయిలకు ప్రత్యేక హాస్టలు సదుపాయం కలదు.

గమనిక2: ప్రశ్నాపత్రము లీకు చేయడములో మాకు మంచి సహాయ సహకారాలు అందుతాయని ఓపనుగానే చెబుతున్నాము. 5000 రూపాయలకు ఒక ప్రశ్న లీకు చేయబడును.

తృష్ణ said...

absolutely hilarious..!! i think i've become a "ceiling fan" of this blogger !!

Unknown said...

snkar garu కల్లి రిసైల బల teevram ga khandistunnam...
ikapote meeru agnata ki echina reply bavundi. ala unte inka nastam kastam em unnayandi.kani nenu verito chala ibbandi paddanu. nenu oka post lo 10 lines raste 100 lines comment. aa pogatalu kooda mari vipareetam ...


తమ అభిప్రాయాల్ని వున్నదున్నట్టు చెప్పేవారు. చాలామందికి చేదు నిజాలు , మందులు నచ్చవు, కాబట్టి తేనె/చక్కెర కలిపి, ఎసెన్సు వాడి కామెంటాలని ఏచెత్త బ్లాగరైనా కోరుకుంటాడు.

sankar garu naku vachina agnata comments ila unnadi unnatlu cheppi unte nenu kooda agnatalani anedanni kadu. e konam naku telidu..
ఇగ పోతే మీరడిగిన పాయింట్: కొండొకచో అజ్ఞాతలు మెచ్చుకున్నారంటే ఆ పొగడ్త నిఖార్సైనది, నగిషీలు లేనిది అనుకోవాలి. దాని విలువ 10రెట్లు ఎక్కువ. మారుమాటాడకుండా స్వీకరించేయండీ.

ee pogatalu mari ekkuvi bharinchalekapoyanu.

వాళ్ళతే భోజరాజుల్లా అలా మారువేషాల్లో తిరుగుతుంటారు, అదంతే!
aha idi super...sankr garu meeru okasari bhojarajula na blog ki rammani manavi.

on a serious note...meeru annatu nijamga vimarsa swekarinchaleni variki ala agnataga comment petina swekarinche nalanti variki ala akkarledu ani cheppadam na uddesyam. indulo evarinina nopinchi unte sorry...

Bhãskar Rãmarãju said...

స్లిప్పుల సర్వీస్ ఏవన్నా ఉందా సోదరా?
ఎవరక్కడ
గురూగార్కి కొబ్బరి బోండాలట్రా

రాజ్ కుమార్ said...

మీ పోస్ట్నే కేక అనుకున్నా.. బులుసు గారి కామెంట్ కేకో...కేకా..
అహ్హాహా

రాజ్ కుమార్

Ramana said...

అరె అన్నా ఎప్పుడు జూసినా ఒక బ్లాగర్ మీద మరో బ్లాగర్ ఎడ్వడంతోనే లైఫ్ అంతా గడిపోతాంది మీకు ఎప్పుడు అదే రొందినా జస్ట్ ఫర్ చేంజ్ నా బ్లాగ్ సూడండి

http://pachchinijaalu.blogspot.com/

kiran said...

మొదట బులుసు గారికి ఓ పెద్ద ఓఓఒ
మీరు ఇంత కష్టంగా ప్రశ్నా పత్రం ఎందుకు తాయారు చేసారు..:(..నా లాంటి వాళ్ళ మీద జాలే లేదా..?
నేను ఫెయిల్..:(

ఆ.సౌమ్య said...

ఈ ప్రశ్నాపత్రం సులువుగానే ఉందికానీ జవాబు రాయడం కష్టమండీ...మారీ బులుసు గారికున్నన్ని తెలివితేటలు నాకు లేవు....ఏం చేద్దాం!
సరే బులుసుగారిని ఇమిటేట్ చేస్తా...నేను ధైర్యంగా రాయగలిగే జవాబు నాలుగవ ప్రశ్నకి - "హాహాహాహ్హ ఊహహ హిహిహి" :))))

కానీ మీ సర్వీస్ పరీక్ష అవిడియా కేక!

బులుసుగారూ...నమోనమః.....మీకు సాటి మరెవ్వరూ లేరంతే...ఏం జవాబులు చెప్పారు మేషారూ...మీకు ఓప్పదో, డెబ్బై వీరతాళ్ళు.

బులుసు సుబ్రహ్మణ్యం said...

వేణూ శ్రీకాంత్ గార్కి,
యజ్ఙ గార్కి,
హరే కృష్ణ గార్కి,
భాస్కర్ రామరాజు గార్కి,
వేణూ రాం గార్కి,
కిరణ్ గార్కి,
ఆ. సౌమ్య గార్కి,

ధన్యవాదాలు.

ఏమిటో ఈయన టపాలో నేను ధన్యవాదాలు చెప్పుతున్నాను. అంతా శంకర మాయ లాగున్నది.

నేస్తం said...

బులుసుగారొక్కరే పాస్ అయ్యారు అన్నమాట :) ముందుగానే చెప్తే నేను బులుసుగారి వెనుక బెంచులో కూర్చుని ఎక్జాం రాసేదాన్ని కదండి

durgeswara said...

హమ్మా !
ఇవి కరణీకం పశ్నల్లాఉన్నాయి . జుట్టుజుట్టూ ముడివేసి ఆనక సందడిచూస్తారు

కొత్తావకాయ said...

ప్రశ్నల కన్నా కామెంటులే బోలెడు విషయాలు తెలుపుతున్నాయ్. హ్మ్
>>>> మనం పడుకున్నప్పుడు కామెంటులు పెట్టువారు ప్రవాసాంధ్రులు.

మేం పడుకున్నాక బజ్జుల్లో కబుర్లాడేసుకొనేవారు దేశీయులు. :X

Ennela said...

వేర్ ఇస్ మై కామెంట్?
నా కామెంట్ ఎక్కడ?
మెరీ కామెంట్ కహా హై?

రహ్మానుద్దీన్ షేక్ said...

రెండు రోజుల వ్యవధి లోనే రెండవ పరీక్ష ఇంటర్వ్యూ అంటిరి?
ఏది ఎక్కడ?
ఏకడ?

గీతిక బి said...

మంచి పోస్ట్ మిస్సయ్యానన్నమాట..

నవ్వలేక చచ్చాను. చాలా బాగున్నాయండీ. ప్రశ్నలూ, జవాబులు కూడా. జతపరుచుము జవాబులైతే మరీనూ.

రసజ్ఞ said...

అమ్మో! చాలా కష్టంగా ఉన్నాయి మీ ప్రశ్నలన్నీ! బులుసు గారి సమాధానాలు అదిరాయి!