Friday, September 16, 2011

సంగీత సరస్వతి పుట్టిన రోజు - మీకో కానుక



"ఎమ్మెస్" - ఈ పేరు చాలు. అప్రయత్నంగానే మన మనసులో భజగోవిందమో, విష్ణు సహస్రనామ సంకీర్తనో లేక తెల్లవారింది లే స్వామీ అని వేంకటేశ్వరుని మేల్కొలిపే సుప్రభాతమో మారుమ్రోగుతుంది. తస్సదియ్య బ్రహ్మదేవుడు క్షీర సాగర మధనం టైం లో కాస్త అమృతాన్ని ఎవరికీ తెలియకుండా దాచి, ఎమ్మెస్ ను తయారుచేసినప్పుడు  ఆ కాస్తా ఈవిడ గొంతులో పోసి భూమ్మీదకి వదిలాడేమో. మనిషిని చూస్తే పెద్ద బొట్టు, తలనిండా పూలు, ధగ ధగ మెరిసే ముక్కుపుడక, కళ్ళలో ప్రశాంతత, పవిత్రతతో పార్వతీదేవిలా కనిపిస్తుంది. స్వరంలో సరస్వతీదేవి గొంతు వినిపిస్తుంది. పేరు చూస్తే లక్ష్మాయే! అసలు ఈవిడ దేవత కాదు మనిషి అంటే ఎట్టా నమ్మేది? 

మూడ్ బాలేనప్పుడు ఎమ్మెస్ పాట ఒక్క సారి విని చూడండి. అమ్మ ఒళ్లో తలపెట్టుకు పడుకున్నంత హాయిగా ఉంటుంది. అసలు ఆ గొంతులో ఏ పాటైనా అమృతం జల్లులా మారిపోతుందేమో. అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు, మీరా వీళ్ళంతా ఏ లోకానున్నా తమ భక్తి ఎమ్మెస్ గొంతులోంచి జాలువారుతుంటే పరవశంతో పులకించిపోయి ఉంటారని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అలాంటి సంగీత సరస్వతి ఈ భూమ్మీద అవతరించిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆవిడని స్మరిస్తూ మీకోసం ఒక అపురూపమైన కానుక. ఎమ్మెస్ తొలి హిందీ చిత్రం "మీరా" (1947) గ్రామఫోన్ రికార్డ్ లో అన్ని ట్రాక్ లు అందిస్తున్నాను. ఈ పాటలు నెట్లో ఉంచిన వారెవరో గానీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. 


భారత రత్న పురస్కారం పులకరించిన ఘట్టం 





12 comments:

శ్రీనివాస్ పప్పు said...

సుబ్బులమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు

MURALI said...

భారతరత్న ఎం.ఎస్.సుబ్బలక్ష్మిగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

Unknown said...

మనిషిని చూస్తే పెద్ద బొట్టు, తలనిండా పూలు, ధగ ధగ మెరిసే ముక్కుపుడక, కళ్ళలో ప్రశాంతత, పవిత్రతతో పార్వతీదేవిలా కనిపిస్తుంది. స్వరంలో సరస్వతీదేవి గొంతు వినిపిస్తుంది. పేరు చూస్తే లక్ష్మాయే! అసలు ఈవిడ దేవత కాదు మనిషి అంటే ఎట్టా నమ్మేది?

కష్టమే నమ్మడం.నేను మాత్రం ఆవిడని దేవత అని ఫిక్స్ అయిపోయాను.

ఆ.సౌమ్య said...

సుమ్మలష్మి గారికి జన్మదిన శుభాకాక్షలు! అద్భుతం మేషారు...మంచి పాటలందించారు...అన్నీ దించుకున్నాం. thanks!

Ravindra Babu said...

భారతరత్న ఎం.ఎస్.సుబ్బలక్ష్మిగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

కృష్ణప్రియ said...

చాలా బాగుంది. థాంక్స్!

నేస్తం said...

Nice PosT సుబ్బలక్ష్మిగారి పుట్టినరోజుకి చాలా మంచి కానుక అందించారండి

Thanks

పూర్వ ఫల్గుణి (poorva phalguni) said...

క్షీరాబ్ధి కన్య కు శ్రీ ఎమెస్ సుబ్బలక్ష్మి కి మన
గాన కోకిలకు పుట్టినరోజు శుభాకాంక్షలు( నీరాజనం)

kiran said...

aahaaa....ఆ ఫోటో ఎంత బాగుందో..!!!!!! :)
అలా చూస్తూ ఉండిపోయాను....
మీరు రాసిన మాటలు చదువుతుంటే..ప్రతి line కి నిజమే కదా అనిపించింది..:)

Ennela said...

ఇప్పుడే సౌమ్య గారి బ్లాగ్ లో యీ గాన సరస్వతి ఆంగ్లంలో పాడ్డం విన్నాను..వావ్ కదా!!!

ఎందుకో ? ఏమో ! said...

Nice Post

Thanks

?!


http://endukoemo.blogspot.com/2011/11/by-mssubba-lakshmi.html

Alapati Ramesh Babu said...

సరస్వతిదేవి ప్రజలను తరిoపచేయతానికి ఇలా సంగీత విదుషీమణి లా అవతారము దాల్చినద అని అనిపిస్తుంది.ఏమి ఆ గానం నాదోపాసన అనేదానికి ఓ మచ్చుతునక లాంటి ప్రత్యక్ష నిజం.ఎన్ని జన్మల పుణ్యఫలం.