Friday, January 8, 2010

స్వేచ్చ అంటే విశృంఖలతా?


నిన్న నిరాధారంగా గాలి వార్తా పట్టుకుని సంచలనం రేపి విధ్వంసానికి కారణం అయిన టివి ఛానల్ ఆ వార్తను ప్రసారం చేస్తున్నప్పుడు ఇది పాత్రికేయ విలువలను తుంగలో తొక్కేదిగా ఉంది అని ఖండించని మన ఘనత వహించిన పాత్రికేయులంతా ఈ రోజు అదే చానెల్ సిబ్బంది అరెస్ట్ చేయంగానే రోడ్ల మీద కెక్కి ధర్నాలు మొదలెట్టారు. పైగా ఇది మీడియా స్వేచ్చను అడ్డుకోవడం అని నినాదాలు కూడాను. సిగ్గు లేకపోతె సరి. ఏది మీడియా స్వేచ్చ? చేతిలో మైకు, ఎదురుగా కెమెరా ఉంటే నోటికొచ్చినట్టు మాట్లాడటమే స్వేచ్చా? ఇప్పుడు ఆస్తి నష్టం జరిగింది కాబట్టి సరిపోయింది అదే ప్రాణ నష్టం జరిగుంటే సమాధానం ఎవడు చెప్తాడు? లేదా ఎప్పటిలాగానే మేం వార్తా చూపించాం కానీ చావమని చెప్పామా? అని తొక్కలో వాదనొకటి మొదలెడతారా? మీ వరస చూస్తుంటే మీడియా అన్న ముసుగేసుకుంటే ఎవడైనా? ఎలాగైనా? ఏదయినా మాట్లాడచ్చు అనేటట్టున్నారు.

అత్యున్నతమైన న్యాయ వ్యవస్థనే తప్పు చేస్తే నిలదీసే దేశం మనది. మీరేమైనా దిగోచ్చామనుకుంటున్నారా?  నిజానిజాలు తెలుసుకోకుండా గాలివార్తలు పట్టుకుని విద్వేషాలు రెచ్చగొట్టేలా కధనాలు ప్రసారం చేయడం ముమ్మాటికీ పాత్రికేయ నైతిక విలువలకు విరుద్ధమే. మాకు విలువలు లేవంటారా.....చానెల్ మూసేసి వేరే అనైతిక మార్గాలు చూసుకోండి.

నాకు అస్సలు నచ్చలేదు ......ఈ మీడియా వ్యవహారం

5 comments:

సుజాత వేల్పూరి said...

మీడియా ముసుగేసుకుంటే ఎవరైనా ఒకరే! వీళ్ళ అరెస్టుని స్టూడియోలకొచ్చి మరీ ముక్త కంఠంతో ఖండిస్తూ గోల చేస్తున్న 'సీనియర్ జర్నలిస్టులకు" కూడా సిగ్గు , విలువలు లేనట్టేగా! నిజంగానే సిగ్గేస్తోంది వీళ్లను చూస్తుంటే!

kmreddy said...

very good

kmreddy said...
This comment has been removed by the author.
Unknown said...

Good Comments,
Media illa tayaravataniki manam kuda konta badhyata vahinchalani naa vuddesam.

bharadwaj said...

Asalu edhi paniki pache vvartha, edhi paniki raani vaartha anna gyanam janalalki vachadhaaka ee news channels elaage vuntai.