Thursday, December 30, 2010

అసలు శ్రీ కృష్ణ కమిటీ తన రిపోర్ట్ లో ఏం చెప్పింది?


నాకు మాత్రం ఏం తెలుసండీ? జనవరి ఆరో తారీఖు దాకా ఆగాల్సిందే అట. 
.
.
.
.
.
.
.
.
-
-
-
-
-
-
-
ఏమనుకోకండి, అసలు సంగతేంటంటే బాపు రమణ లను కలిసిన విశేషాలు మీ అందరితో పంచుకుందామని ఉత్సాహంగా  పోస్ట్ పెడితే ఎంత మంది చదివారో నాకు తెలియదు కానీ కామెంట్ల ద్వారా స్పందన మాత్రం చాలా తక్కువగా వచ్చింది. అసలు సమస్య పోస్ట్ హెడ్ లైన్ లో ఉందా లేక మరొకటా అనేది తెలుసుకోవడానికి ఇలా ఈ హెడ్ లైన్ తో పోస్ట్ పెట్టాల్సోచ్చింది. అన్యధా భావించకండి. 

కళాకారుడికి చప్పట్లు, బ్లాగ్గేయకారుడికి కామెంట్లే కదండీ ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చేవి. కుసింత ఆలోచించండి. 

10 comments:

శిశిర said...

:)ఇప్పుడు ఈ పోస్ట్‌కి కామెంట్ రాస్తే ఆ పోస్ట్‌కి ఏమైపోయావ్ అనరు కదా! అవీ, ఇదీ అన్నీ ఇప్పుడే చదివాను. బాగున్నాయి విశేషాలు.

cheekati said...

Thank god.. ivaala april 1st kaadu ;-)

తృష్ణ said...

బ్లాగర్లలో ఈ మధ్యన కాస్త స్పందించటం తక్కువయిందండీ..చదువుతారు కానీ కామెంటరు. అదంతే. కావాలంటే మీ స్టేట్స్ చూసుకోండి తెలుస్తుంది...:)

సుజాత వేల్పూరి said...

ఎవరూ ఏమీ అనుకోనంటే ఒక మాట చెప్తా! మన బ్లాగు చదివి కామెంట్ రాస్తే ఆనందంగానే ఉంటుంది. కానీ మనం కూడా అప్పుడప్పుడూ ఇతరుల బ్లాగుల్లో కూడా కామెంట్స్ రాస్తూ ఉంటే నలుగురికీ మనం కాస్త పరిచయం అవుతాం. ఒక బ్లాగర్ చెప్పారు, నా బ్లాగు పోస్టు ఒకటి నచ్చినా "నా బ్లాగులో ఈవిడ కామెంట్ రాయలేదు కానీ ఇంతవరకూ....పాపం నేనెందుకు రాయాలి?" అని చదివేసి వెళ్ళిపోయార్ట.

మనం మాత్రం సెలెక్టివ్ గా చదివి కామెంట్స్ రాస్తూ ఎవరో మన బ్లాగులో కామెంట్స్ రాయడం లేదని అనుకోవడం సమంజసం కాదని నాకే అనుభవమైంది. అప్పటినుంచి బ్లాగు నచ్చాలే కానీ వెంటనే కామెంట్ రాస్తాను. కాకపోతే ఈ మధ్య విపరీతమైన బిజీలో ఉండి అసలు చదవడమే తగ్గించాను. రాయడం కూడా!

మీ రమణ పోస్టు ఇప్పుడే చూస్తున్నాను. ఇలాంటి అనుభవాలు అరుదుగా దొరుకుతాయి కాబట్టి అందరితో పంచుకోవడం ఎంతో బావుంటుంది.

"దేశం నాకేమిచ్చింది అని కాదు, దేశానికి నేనేమిచ్చాను..." లాగా నా బ్లాగులో కామెంట్స్ ఎందుకు రాయడం లేదు అనే ముందు నేనెంత మంది బ్లాగులో కామెంట్స్ రాశాను అని ఆలోచించుకోవాలనమాట! నేనలాగే చేశాను.

కాబట్టి నాలాగే మీరు కూడా మిగతా బ్లాగుల్లో కామెంట్స్ రాయడం గురించి ఆలోచించండి.

అన్నట్టు మీ పోస్టుల్లో రిక్షాలో సినిమా కెల్ళే పోస్టు నా ఫేవరిట్టు

Anonymous said...

కామెంట్ల కోసమా! మొహమాట పెట్టేస్తున్నారు.
కృష్ణశ్రీ, చెప్పుదండలు బ్లాగులకి వద్దంటే కామెంట్లు, వాళ్ళని పిలుద్దామా? :)
అజ్ఞాతల భావస్వేచ్చను ఆదరించకపోవడం మీ సంకుచిత భావవైశాల్యాన్ని తెలియచేస్తోంది. :P

Kathi Mahesh Kumar said...

@సుజాత: :)

Anonymous said...

@ సుజాత గారూ..:-) మీరు దీని మీద పెద్ద పోస్ట్ రాసేయగలరు ఈ మూడ్ లో :)

@ శంకర్ గారూ, ఒక్కో సారి టైటిల్ వల్ల కూడా చూడరేమో అనిపిస్తుంది , కాని బాపు గారి పేరు కనిపించాక ఊరికే చదవకుండా ఉండరు కదా..మిస్స్ అయ్యి ఉంటారు.మీరు రాస్తూ ఉండండీ, నెమ్మదిగా ఎప్పటికో చదువుతాము. :)

నేస్తం said...

నాకూ మీ బ్లాగ్ చాలా ఇష్టం అండి.. మంచి పోస్ట్లు వేస్తారు మీరు ..:)

SRRao said...

మీకు, మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు

SRRao
శిరాకదంబం

kannaji e said...

శాంకీ గారు..కరష్టేనా?
ఏమదృష్టం,ఏమదృష్టం...ఆ మగానుబావులని కలిసోచ్చేరంటే మాటలండీ???చెప్తే నవ్వుతారేమో..ఆ జంట క్రియేట్ చేసిన'"బుడుగు" కేరెక్టర్ ఎంత మర్చిపోలేనంటే మా అబ్బాయి ని మరి బుడుగనే పిల్చుకుంటాం ..అదండే మరి అందవల్ల సేప్పోచ్చేదేటంటే...ఎవరు కామెంటలేదని నిరుత్సాహ పడకండి..అలా కానిచ్చేయండి...మరి మీకు నూతన వర్ష శుభా కాంక్షలు