Sunday, January 2, 2011

జనవరి ఐదవ తేదీ రాత్రి సమైక్య, వేర్పాటు వాదుల ఆలోచన ఎలా ఉంటుందన్న చిన్న చిలిపి ఆలోచనతో - ఒక పేరడీ

మంచి మిత్రులు సినిమాలో "ఎన్నాళ్ళో వేచిన ఉదయం" నాకు చాలా ఇష్టమయిన పాటల్లో ఒకటి. రేపు జనవరి ఆరో తేదీన శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్ మన ముందుకు రానున్న తరుణంలో ఐదవ తేదీ రాత్రి సమైక్య,వేర్పాటు వాదుల  ఆలోచనలు ఏ విధంగా ఉంటాయన్న చిలిపి ఆలోచనతో ఏ పాట రాయడం జరిగింది. ఆ సినిమాలో ఇద్దరు మిత్రులు ఒకరినొకరు కలుసుకొనేటప్పుడు తమ ఆలోచనల్లో వచ్చిన మార్పు గురించి అవతలివాళ్ళకి చెప్పాలనే ఆత్రుతతో తెల్లరడం గురించి ఎదురుచూస్తూ ఉంటారని మీకు తెలిసే ఉంటుంది. అలాగే ఆరవ తేదీ గురించి సమైక్య, విభజన వాదులు తమ ఆలోచనలు మార్చుకుంటే ఎలా ఉంటుందనేదే ఈ పేరడీ కి స్ఫూర్తి. ఇంత సూపర్ హిట్ పాట  ట్యూన్ మీకు తెలియదని కాదు. అయినా ఏదో నా తృప్తి కొద్దీ పాట లింక్ కింద ఇస్తున్నాను. ట్యూన్ కి తగ్గట్టు పేరడీ ఉందా లేదా అనేది మీరే చెప్పాలి. 


http://www.box.net/shared/e3f7u0du1pఎన్నాళ్ళో వేచిన ఉదయం
ఈనాడే ఎదురవుతుంటే
ఎన్నాళ్ళో వేచిన ఉదయం
ఈనాడే ఎదురవుతుంటే 

ఇన్నినాళ్ళు దాచిన సత్యం
ఉబికి ఉబికి వస్తుంటే 
ఇంకా తెలవారదేమి 
ఈ సస్పెన్స్ విడిపోదేమి?
ఇంకా తెలవారదేమి 
ఈ సస్పెన్స్ విడిపోదేమి?

ఒకటిగా నిలిచిన జాతిని 
ఏ తంత్రం ఏమీ చేయదని 
ఐక్యత కోరే వారికి
ఏనాటికి ముప్పే రాదనీ

ఐక్యత కోరే వారికి
ఏనాటికి ముప్పే రాదనీ

నేనెరిగిన సమైక్య వాదం
నీతో చెప్పాలని వస్తే 
ఇంకా తెలవారదేమి 
ఈ సస్పెన్స్ విడిపోదేమి?

నేతలు తిరిగే జాతిలో 
ఏ ఐక్యత పనికి రాదనీ
ప్రగతిని కోరే స్టేటులో 
తమ ప్రాంత స్వార్ధమే మేలని 
నేచూసిన విభజనిజం
నీతో చెప్పాలని వస్తే 

ఇంకా తెలవారదేమి 
ఈ సస్పెన్స్ విడిపోదేమి?
ఇంకా తెలవారదేమి 
ఈ సస్పెన్స్ విడిపోదేమి?

"విభజనిజం" అనే కొత్త పదం పుట్టించాల్సి వచ్చింది. దీనికి వీరతాడు వేసినా (ఎవరూ పుట్టించకుండా కొత్త పదాలు ఎలా పుడతాయి - మాయా బజార్ లో ఘటోత్కచుడు), భాషను ఖూనీ చేసానని తిట్టుకున్నామీ  ఇష్టం. ఈ ప్రయత్నం నచ్చితే ఒక చిన్న కామెంట్ తో భుజం తట్టండి చాలు!!!! 

13 comments:

Padmarpita said...

:):):)

Anonymous said...

Baagundi.:)

తృష్ణ said...

బావుందండీ.

భాను said...

good

seshu said...

nice attempt. But becareful that either TRS may ban it or Samaikyandhra people may adopt it as their main weapon to fight against TRS.

Anonymous said...

మీ ఆలోచన బాగుంది. పేరడీ కూడా బాగుంది. తెలుగు న్యూస్ ఛానళ్ల
వాళ్లు ఎవరైనా కాపీ కొట్టే ప్రమాదముంది. జాగ్రత్త

సుజాత వేల్పూరి said...

విభజనిజం....వేస్కోండి వీరతాడు! చక్కగా ఉంది ...రివిజనిజం లాగా!

కొత్త పాళీ said...

super.
"విభజనిజం" బాగుబాగు

aparna said...

pavala adirindi.vibajanijam nijamga bagundi

జర్నో ముచ్చట్లు said...

పేరడీ బావుంది. విభజనిజం పదం సంకరమే. అయితే దీని విస్తృతార్థం ఆలోచించేదిగా ఉంది. (దీన్ని విభజన.. నిజం అని విడదీసి చూడొచ్చు.. అలాగే, క్యాపిటలిజం, మార్క్సిజం తరహాలో ఏకపదంగా చూడొచ్చు) వర్తమానానికి ప్రతీకగా ఉంది కాబట్టి అందుకోండి వీరతాడు..

విజయ్

ఆ.సౌమ్య said...

నేను రాగయుక్తంగా పాడుకున్నానండీ...చక్కగా కుదిరింది.

విభజనిజం....అందుకోడి రెండు వీరతాళ్ళు :)

వేణూశ్రీకాంత్ said...

పేరడీ చాలా చక్కగా కుదిరిందండి :-) విభజనిజం కి వీరతాడే :-)

Rk said...

Totalga ADURS..