Sunday, January 9, 2011

జస్ట్ రాయాలనిపించింది అంతే - చివరాఖరి భాగం. సెంచరీ కొట్టేసానోచ్........... :)


వీటిని హైకూలు అనచ్చో లేదో నాకు తెలియదు. జస్ట్ రాయాలనిపించింది అంతే. నచ్చితే భుజం తట్టండి

౭౬
పిజ్జా కి నా నిర్వచనం 
చాలా సింపుల్ 
అది ఇటలీ వాళ్ళ ఊతప్పం 

౭౭ 
చిన్నప్పటి నా ఫోటో
నేనేం కోల్పోయానో 
వెక్కిరిస్తున్నట్టు చెప్పింది 

౭౮ 
అవసరమైతే రాజీనామా
అడ్డమైన లీడరూ
ఈ మధ్య ఇదే డ్రామా

౭౯ 
చిన్నప్పుడు పెద్దవ్వాలని
పెద్దయ్యాక బాల్యమే బెటరని
మనిషికి ఎప్పుడూ ఏడుపే 

౮౦ 
కొత్త హీరోయిన్
ఒక్క సినిమాతో 
పది షోరూం ఓపెనింగులు 

౮౧ 
కన్వీనియంట్ గా మార్చుకునే
ఒకే ఒక పుస్తకం
భారత రాజ్యాంగం 

౮౨
భలే చిత్రం గా ఉంది
"ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్" ఫ్యూచరిప్పుడు
ఒక "ఇటాలియన్" చేతిలో ఉండటం

౮౩ 
"తెలుగు తల్లి ఎవరు?"
ఈ మాటని కెసిఆర్ 
ఇంకేదయినా భాషలో చెప్పి ఉండాల్సింది 

౮౪ 
అదేం చిత్రమో 
శలవురోజులు మాత్రం 
త్వరగా గడిచిపోతాయి

౮౫ 
మా ఆవిడ 
"మా పుట్టింటి వాళ్ళని చూడాలనుంది" అంది
నేను జూకి తీసుకెళ్లా

౮౬ 
అవును నిజమే
ఉద్యమాల్లో నేతలే ముందుంటారు
పోరుకోసం కాదు, పేరు కోసం

౮౭ 
పదిమంది ఎంపీలు నిరసన తెలిపితే
కసబ్ ని కూడా
వదిలేస్తుందేమో ఈ ప్రభుత్వం 

౮౮ 
ఓటేసి ఐదేళ్లవుతోంది
మా వూరి రోడ్డు మాత్రం
ఇంకా అలానే ఉంది

౮౯ 
హైదరాబాద్ లో పదేళ్లుగా కలిసున్న నా మిత్రుడు 
అకస్మాత్తుగా
నన్ను "సీమాంధ్రుడు" అంటున్నాడు 

౯౦ 
సకుటుంబంగా సినిమాకెళ్లా
సహస్రం వదిలింది
తలనొప్పి మిగిలింది 

౯౧ 
అవినీతి 
ఇది కూడా దేవుడిలా 
సర్వాంతర్యామే!

౯౨
జలుబు చేస్తే హాస్పిటల్ కెళ్లా
ఒక్క రోజులో
ప్రపంచంలో ఉన్న టెస్టులు అన్నీ తెలిసాయి

౯౩
"ఉభయకుశలోపరి"
ఈ మాట మర్చిపోయి
అప్పుడే ఒక తరం అయిపోతోంది

౯౪ 
"ట్వింకిల్ ట్వింకిల్" మోజులో
"సరస్వతీ నమస్తుభ్యం"
వెలవెలబోతోంది 

౯౫
బేబీ సోప్ యాడ్ లో
బికినీ పాపెందుకో
నాకిప్పటికీ అర్ధం కాదు 

౯౬ 
2010 ప్రశాంతంగా గడిచిందట
చిదంబరం
టీవీ చూస్తున్నట్లు లేదు 

౯౭ 
కాలం కన్నా
గొప్ప యాంటిబయోటిక్ 
నాకు ఇంతవరకు దొరకలేదు

౯౮ 
అమ్మకానికి "మనుషులు"
నమ్మకపోతే 
ఐపిఎల్ వేలం చూడండి 

౯౯ 
నువ్వు నువ్వుగా ఉండటమే
నా దృష్టిలో 
బాల్యమంటే 

౧౦౦ 
ఈ పోస్ట్ వలన నాకో లాభం 
వంద వరకు
తెలుగు అంకెలు తెలిసాయి 



అయ్యబాబోయ్!!!!!! వంద హైకూలు (వీటిని నేను అలా అనేసుకునే రాసేశా) పూర్తయిపోయాయి. కామెంట్లతో ఇప్పటివరకు నన్ను ప్రోత్సాహించిన బ్లాగ్మిత్రులందరికీ ఇదే నా "వంద"నం. 

మొదటి ఐదు భాగాలు ఇదిగో ఇక్కడున్నాయి. 









 



 









5 comments:

తృష్ణ said...

జలుబు చేస్తే హాస్పిటల్ కెళ్లా
ఒక్క రోజులో
ప్రపంచంలో ఉన్న టెస్టులు అన్నీ తెలిసాయి

కాలం కన్నా
గొప్ప యాంటిబయోటిక్
నాకు ఇంతవరకు దొరకలేదు

కన్వీనియంట్ గా మార్చుకునే
ఒకే ఒక పుస్తకం
భారత రాజ్యాంగం

--ఈ టపాలో ఇవి బాగా నచ్చాయండీ. మా అందరికీ మీ వంద హైకూలతో ఉల్లాసపరచినందుకు మీక్కూడా ధన్యవాదలు.

Ravi said...

Mamllani mee 100 hyku la tho ullasaparichinanduku chala dhanyavadalu.

Anonymous said...

మీ హై కూ లన్నీ దేనికవే సూపర్ అండీ.
కానీ, ఇంతకీ హై కూ అంటే ఏంటండీ? మనం కొంచెం తెలుగులో ఈకులెండి:)
1.కన్వీనియంట్ గా మార్చుకునే
ఒకే ఒక పుస్తకం
భారత రాజ్యాంగం
భలే చిత్రం గా ఉంది
2."ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్" ఫ్యూచరిప్పుడు
ఒక "ఇటాలియన్" చేతిలో ఉండటం
3.బేబీ సోప్ యాడ్ లో
బికినీ పాపెందుకో
నాకిప్పటికీ అర్ధం కాదు
ఇవి మాత్రం అదుర్స్.
అనట్లు కన్వీనియంట్ గా మార్చుకునే పుస్తకం జాబితాలో ఇప్పుడు శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ కూడా చేరిందండోయ్!
బేబీ సోప్ యాడ్ లో సోప్ యాడ్ చూసే మన బేబీలకి, బేబీ మనావిడకి, బికినీ పాప మనకు:)....అదేనండీ నయనానందానికి.

నండూరి శ్రీనివాస్ said...

బాగుంది సార్ మీ బ్లాగు...
ముఖ్యంగా, "ఇటాలియన్ చేతుల్లో 'ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ ' లాంటి ప్రయోగాలు బలే ఉన్నాయి.

ఏడాదికో ఆరునెల్లకో ఒకసారి బ్లాగడానికే ఏడ్చి చచ్చే నాలాంటి బధ్ధకిష్టు లందరూ, మీ యాక్టివ్ బ్లాగింగ్ చూసి కుళ్ళుకోక మానరు :)

[prem said...

partner, ee blog tho naaku gnam bulb ding mandi. nee nijaswarupam telisimdi.