ఈ పోస్ట్ నేను గత సంవత్సరం పోస్ట్ చేశా. నిరాశే మిగిలింది. సరే ఈ ఏడాదిలో ఎంతో మంది కొత్త బ్లాగర్లు వచ్చి ఉంటారు. వాళ్ళలో ఒక్కరైనా ఉండకపోరా అన్న చిన్న ఆశతో మళ్ళీ పోస్ట్ చేస్తున్నా.
నేను 1977 మార్చి 14 న కాకినాడలో పుట్టాను. నాకో చిన్న కోరిక ..... నాలాగే అదేసంవత్సరం, అదే రోజు పుట్టినవాళ్ళని (అంటే బర్త్ డే మేట్స్ అన్నమాట) ఎప్పటికయినా కలుసుకోవాలని. ఖచ్చితం గా అదే రోజు చాలా మంది ..అందులో కొంతమందయినా తెలుగు వాళ్ళు పుట్టి ఉంటారు...అందులో మావూరి వాళ్ళు ఉన్నాలేకపోయినా ..కనీసం ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్న వాళ్ళు కొంతమందయినా ఉంటారు. వాళ్ళలో ఒక్కరికయినా బ్లాగింగ్ అలవాటు ఉండదా అన్న ఆశతో ఈ పోస్ట్ చేస్తున్నా. ఉంటే కనుక రిప్లై ఇవ్వండి. మనందరం కలిసి బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుందాం :). ఎంత కాదనుకున్నా ఒకే రోజు ఈ భూమ్మీదకొచ్చాం కదా!
26 comments:
వున్నారు! శంకర్ గారు మా అత్తయ్య మనవుడు. కిరణ్ US
లో వున్నాడు పెళ్లి అయింది.తెలుగు వచ్చు తప్పక మీ బ్లాగ్ చూస్తాడు
నీ బాద చూస్తే నా పుట్టిన రోజు మార్చుకోవాలని వుంది కానీ కుదరక ఊరుకుంటున్నాను...all the best
@ మాణిక్యాంబ గారూ
మీకు బోలెడన్ని థాంకులు. ఎప్పటినుంచో వెతుకుతుంటే ఇప్పటికి దొరికారన్నమాట.
మరీ ఇలా సంవత్సరము కూడా ఒకటే కావాలంటే కష్టమేమో శంకరా!అందునా తెలుగు వాళ్ళంటివీ..అదీ కాక బ్లాగ్ ఓనరు కూడా కావాలంటివీ...సరే సంబరాలకి మాత్రం మా అందరినీ పిలవాలి సుమా!
శంకర్ గారు! మీరు భలేవారండీ! మరీ అలా సంవత్సరం,తేదీతో సహా బ్లాగు రాసే తెలుగువారంటే కష్టమే! నా ఫ్రెండ్స్ లో బ్లాగ్ అంటే ఏంటి? అని అడిగే అమాయకపు చక్రవర్తులు ఉన్నారు తెలుసా! మళ్ళీ అందరూ విదేశాల్లో సెటిల్డు!అద్దీ సంగతి! కావున...ఆ పైన చెప్పిన కిరణ్ గారు కనికరించి ఒక బ్లాగు ఓపెన్ చేస్తే...మీకుపండగ కనుక ఇక ఎన్నెలగారు చెప్పినట్లు ఏర్పాట్లు ఘనంగా జరగాలి.ఏమంటారు?? :)
[పైన కామెంటు పొరబాటున డిలీటు అయినది..గమనించవలెను]
hmmm,,,, మీలాగే నా పుట్టినరోజున పుట్టిన వాళ్లని ఆ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు కల్సుకుందామనుకునే లోపే వాళ్ళిద్దరు తొందర పడ్డారు. లేక నేనే ఆలస్యం చేశాను. వాళ్ళిద్దరూ పీవీ నరసింహారావు గారూ, ముళ్ళపూడి వెంకట రమణ గారూనూ!
మా పెద్దమ్మ కొడుకు మీ కంటే ఒక్క ఏడు పెద్ద,1976 మార్చి 14. వాడికి బ్లాగూ లేదు, వాడు హైద్రాబాదులోనూ లేడు. బెంగుళూరులో ఉన్నాడు.
మీ ఇద్దరికీ ఒకే రోజు శుభాకాంక్షలు చెప్తాను
నాకు తెలిసి, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అనే ఓకాయన వుండేవాడు, కాని ఆయనకు బ్లాగుల దుకాణం వుండేది కాదు. :) :P
social network sites lo check madi..
మీరు క్రితం ఏడు రాసిన టపా గుర్తుందండి. మార్చి 9,10 తారీఖుల్లో అయితే ఉన్నారండి. కానీ వాళ్ళు మీకన్నా పెద్ద ,చిన్న కూడా. బ్లాగులూ లేవు..! మీరిలాంటి కష్టమైన ప్రశ్నాపత్రం ఇస్తే మేం బేతాళుడిలా మారాల్సి వస్తుంది..:)
మీరు ఏదాది క్రితం రాసిన టపా నాకు బాగా గుర్తు...దానిలో నేను వ్యాఖ్య రాసాను కూద్డా...మీ వేట సమవత్సరం అయినా ఇంకా కొనసాగుతూనే ఉందన్నమాట. బ్లాగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాది కాబట్టి మీ కోరిక త్వరలో అంటే ఈ యేదాది కాకపోయినా వచ్చే యేడాదయినా తప్పక నెరవేరుతుందని ఆశిస్తున్నాను.
పార్టీ ఎక్కడ ఇస్తున్నారో చెపితే నేను వెతికి పెడతాను. jokes apart, మంచి ప్రయత్నం. నవంబర్ 4 వ తారీఖు వాళ్లెవరైనా ఉంటే చేతులు ఎత్తండి. మనం కూడా కలుద్దాము.
చ జస్ట్ మిస్స్.... నాది సెప్టెంబర్ మొదటివారం :-)
oh!nenu meethopaate aderoju puttaanu . meekante nenu pedda...naaku blog vundi :):)
చిన్ని గారు,
అంటే మీరూ మార్చి 14 అన్నమాట.
నిజానికి నేను వెతుకున్నది నాకన్నా పెద్దా కాకుండా, చిన్న కాకుండా అదే సంవత్సరం, అదే రోజు పుట్టినవాల్లని (గంటలు, సెకన్లకు మినహాయింపు).
అయితే ఈ సారి నేను మీ బ్లాగ్ లో, మీరు నా బ్లాగ్ లో విషెస్ చెప్పేసుకుందాం :).
శంకరా,చిన్ని గారు అదే రోజు పుట్టాను అని చెప్తే, నీకు 14అని యెలా తెలిసిందీ? నాకయితే అర్థం కాలేదు.ఏంటో, నాకు ఇంకా శివరాత్రి హాంగ్ ఓవర్ తగ్గినట్టు లేదు..
చిన్ని గారూ, మీరు యీ అబ్బాయిని పట్టించుకోకుండా పార్టీ ఎక్కడో చెప్పెయ్యండి మేము సూట్‌కేసులూ అవీ సర్దుకోవాలి...
"ఆకు " పై కవితా పోటీకి, ఇంతవరకు వచ్చిన కవితలు
http://neelahamsa.blogspot.com/2011/03/blog-post_05.html
షంకర్.ఎస్ గారు, ఇంకో మాట చెప్పండి. మార్చి 14+/-1వారం చేసుకోండి, ఒప్పేసుకోండి, పార్టీకి రావడానికి అధమం ముగ్గుర్ని తోలుకొస్తా. :)
@శంకర్
అలానే.మీకు అడ్వాన్సు'జన్మదిన శుభాకాంక్షలు'.ఈ వారంలోపు మీ కోరిక ప్రకారం బర్త్డేడేమేట్స్ దొరకాలి అని ఆకాంక్షిస్తునాము.
@ఎన్నెల
సూట్‌కేసుల్లో గిఫ్ట్‌లు పట్టుకొస్తాను అంటే పార్టీ రెడీ..పార్టీ అట్లాంటిక్ లో పెట్టమంటార?..లేదా పసిఫిక్ లోనా:-)
me maatalu kakinada kaazaalla unnay
Amir Khan kuda aroje puttaadu kani year theleedhu :)
nenu March15,1987 :)
@నాగార్జున గారూ
అమీర్ ఖాను, నేను, ఐన్ స్టీన్ ఒకే రోజు పుట్టాం. సంవత్సరాలే తేడా. :)
మీరు పుట్టిన తేదీనే (సంవత్సరం కాదు) మా కజిన్ కూడా పుట్టాడు
Same Pinch ! Nenu kooda 1977.
అబ్బే.. మీకూ తోడు రాలేను. బులుసు గారి కంటే పదిరోజులు పెద్ద అయిపోయాను. మీ ఆశ మాత్రం చిత్రంగా, నిజాయితీ గా ఉంది. నేనూ వెతుకుతా. పార్టీ నేను అడగక్కర్లేదులెండి. ఇంత ఎదురుచూస్తున్న వారు ఆ మాత్రం పార్టీ ఇవ్వరా, ఏం?
కొత్తావకాయ గారూ మీరు వెతకండి చెప్తాను. పార్టీదేముందండీ??మీరు అడిగినప్పుడు, అడిగిన చోట, అడిగినట్టుగా ఇచ్చే పూచీ నాది. సరేనా?
@సుజాత గారు
సంవత్సరం కాదండీ డేటు కూడా ముఖ్యం ఇక్కడ. అదన్న మాట సంగతి :)
Post a Comment