Wednesday, March 2, 2011

చిత్తశుద్ధి లేని శివపూజలేలరా?

ఈ రోజు పేపర్లో శివరాత్రి స్పెషల్ షోలు ఆడే థియేటర్ల లిస్టు ఇచ్చాడు. ఎంత భక్తీ రస చిత్రాలో మగధీర, రోబో, సింహ, అదుర్స్, కిక్, దిల్  తో బచ్చా హై జీ, దబాంగ్, గోల్ మాల్ ఇలా అన్నీ చక్కని భక్తీ రస చిత్రాలే. అసలు ఇలా కష్టపడి సెకండ్ షో తర్వాత వేసే స్పెషల్ షోలలో బలవంతం గా నిద్ర ఆపుకునే ప్రయత్నాలు చేయడమే శివరాత్రి జాగరణా? ఇంకొన్నాళ్ళు పోతే పబ్బుల్లో కూడా శివరాత్రి స్పెషల్ నైట్స్ కూడా స్టార్ట్ చేస్తారేమో. టైం చూసుకుంటూ ఇంకో రెండు మూడు గంటలుంటే తెల్లారిపోతుంది, రేపు ఆఫీసుకు సెలవు పెట్టి హేపీగా నిద్రోవచ్చు అనుకుని శివరాత్రి జాగారం చేయడం అవసరమా? నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఎలాగైనా నిద్ర మానుకుని మేల్కొంటే నిన్ను అనుగ్రహించేస్తాను అని ఆ శివుడు చెప్పాడా?. ఇక శివరాత్రి ఉపవాసాల విషయానికొస్తే సాయంత్రం ఎప్పుడవుతుందా? రాత్రికి ఏమేం చేసుకుని తినాలా? అనుకుంటూ ఉపవాసాలు చేయడం ఎందుకు? చివరికి చిన్నపిల్లల్ని కూడా నోర్మూసుకు కూర్చోండి, ఆకలి అంటే కళ్ళు పోతాయి, శివరాత్రి ఉపవాసం చేస్తే పుణ్యం అని బలవంతం గా పస్తులు ఉంచేస్తారు. మనలో  ఉన్న శివుడి ఆకలి కేకలు వింటూ గుడిలో ఉన్న శివుడ్ని పూజించడం ఏం భక్తో?. ఇలాంటివన్నీ చూసే వేమన చెప్పాడేమో "చిత్తశుద్ధి లేని శివపూజలేలరా?" అని. అంతగా శివుని మీద నిజంగా భక్తి ఉంటే అర క్షణం పాటు మనసారా "ఈశ్వరా" అనుకున్నా చాలు . నాకు తెలిసి శివుడంత అల్ప సంతోషి లేడు. ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. నాకిష్టమైన ఎమ్మెస్ గారి గొంతులో శివపంచాక్షరీ సోత్రం 


బాలమురళీ కృష్ణ గారు పాడిన ఈ తత్వమంటే కూడా నాకు చాలా ఇష్టం. అదీ వినండి 
Yemi_Sethura_Linga...

12 comments:

Ravi said...

భలే చెప్పారు. మనసులో శివుడ్ని తలుచుకోకుండా హీరోయిన్ల అంగాంగ ప్రదర్శనలు చూస్తూ ఆ జాగరణ ఏలనో...

కానీ టీవీలో ఒక్కోసారి భూకైలాస్, దక్షయజ్ఞం లాంటి సినిమాలు వేస్తుంటారు. అలాంటివి కొంచెం పరవాలేదు.

కానీ ధ్యానంలోనో పూజలోనో కూర్చుని ఉండటమే ఉత్తమం.

తృష్ణ said...

బాగా చెప్పారు. కొన్ని చోట్ల సందుల్లో కూడా తెరలు కట్టి ఏవేవో సినిమాలు చూపిస్తూ ఉంటారు.

పద్మ said...

బాగా చెప్పారు. మాకిక్కడేమో రాత్రి అంతా అభిషేకాలు/పూజలు, రెండు గంటలకొకసారి హారతి.

Indian Minerva said...

అసలూ...మాన సేవే మాధవ అన్నప్పుడు. ఆ మానవసేవ అంత ఆకర్షణీయంగా వుండదనా మాధవసేవ కోసం పరితపిస్తారు. నేనేసేవా చెయ్యరనుకోండి అదివేరేవిషయం :).

durgeswara said...

చాలామంచి చురకలంటించారు
ప్రతిదీ వ్యాపరదృష్టితో చూసేవారికి శివపూజకూడా అంతే.శివానుగ్రహం కూడా ఆస్థాయిలోనే ఉంటూంది లెండి

బులుసు సుబ్రహ్మణ్యం said...

అంతా ఈశ్వరేచ్చ. మనమంతా నిమిత్త మాతృలము, ఈ టపా శంకరుడి గారితో సహా.

bharadwaj said...

andhariki neelaga rooju comp mundhu koochoni jagaram chese vopika vundadhu kadhaa...andhike edho sakthi kodhee alaa kanichesthaaru..nuvvu sahrudhayam tho ardham chesukogalavani manavi...

Rao S Lakkaraju said...

మన ఆచారాలు ఎందుకు వచ్చయ్యో ఎలావచ్చయ్యో వాటి వెనుక reasoning నాకయితే తెలియదు కానీ అవి మంచివని నేను వీలయినంతవరకూ పాటించటానికి ప్రయత్నిస్తాను. ఉదా: ఉదయముననే లేచి కాలకృత్యములు తీర్చుకో. వేళకి భోజనం చెయ్యి.

జాగరణ కొస్తే నా కయితే దాని గుప్త భావము తెలియదు కానీ ఉపవాసాలకు చెప్పగలను. పేరుకున్న చెత్తా చెదారం గురించి ఏమి చెయ్యాలి ఆలోచించటానికి మన శరీర వ్యవస్థకు విరామము ఇవ్వటం. సాయంత్రం భోజనం చేసినా పొట్టలో ఎంతపడితే అంత తింటారు కానీ ఎక్కువ తిన లేరు. Fasting గురించి గూగుల్ చెయ్యండి ఇంకా తెలుసుకోవాలంటే.

ఇందు said...

కెవ్వ్వ్! దెబ్బకొట్టారు మాష్టారు...నేను మాత్రం అలా పిచ్చి సినిమాలు చూడకుండా జాగారం చేసినంత సేపు చాలా నిష్టగా చేసేదాన్ని :) ఇక నాకు తెలియని స్థిథిలో అలా నిద్రలోకి జారిపోవడం అంటూ జరుగుతుంది కానీ....నాకు జాగారం/ఉపవాసం విషయాల్లో మీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను :)

Ennela said...

అయ్యయ్యో శంకరా , నేను ఇందూ గారి బ్లాగ్లో కామెంట్ పెట్టేసాక చూసాను ఈ పోస్టు..చ చ..ఇలా అంటే ఎలాగయ్యా...కసినో కి వెళ్ళద్దా అయితే?

ఇందు said...

హ్హెహ్హెహ్హీ! ఎన్నెలగారూ...శంకర్ గారు నిద్రపోతున్నారు...లేవగానే మీకు ఉందిలేండీ....హ్హహహహ్హా!! అమ్మా! శివరాత్రి రోజు ఏ భక్తి సినిమానో చూడక కాసినో వెళతారా? ఆగండి ఒక్క ఐదు గంటలు....మా శంకర్ గారు లేస్తారు...మీకు ఇక జింగుచక :))

సుమలత said...

ఇంతకీ జాగారం గురించి నాకు తెలిసింది చెప్తానువుదయాన్నే లేచి ఉపవాసం వుండిఅది నిష్టగా ...
అంటే ఉదయం పాలూ మధ్యానం నిల్ సాయంత్రం టిపిన్ ఈ మధ్యలో చిరు తిండి జాన్తానహ్హీ..అంతవరకూ ఉపవాసం
జాగారం లో హాయిగా బెడ్ మీద పవలి౦చకుండా చాప మీద పడుకోవాలి అలా చేస్తే పలితం వుంటుంది
మా అత్తయ్య అయితే కిందనే పడుకుంటారు ....